BigTV English

Kolkata Rape Sanjay Roy: ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పిన నిందితుడు.. మరీ ఇంత సైకోనా అంటూ విస్తుపోయిన సీబీఐ అధికారులు

Kolkata Rape Sanjay Roy: ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పిన నిందితుడు.. మరీ ఇంత సైకోనా అంటూ విస్తుపోయిన సీబీఐ అధికారులు

Kolkata Rape Sanjay Roy update(Telugu flash news): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడి మానసిక పరిస్థితి గురించి సిబిఐ అధికారులు మీడియాకు తెలిపారు. నిందితుడు సంజయ్ రాయ్ ది ఒక జంతువు లాంటి స్వభావమని.. మహిళా డాక్టర్ ను పాశవికంగా హత్య చేసినందుకు అతనిలో ఏ పశ్చాత్తాపం లేదని కేసు విచారణ చేసే ఓ సిబిఐ అధికారి గురువారం తెలిపారు.


కోల్ కతా లోని ఆర్ జి కార్ మెడికల్ కాలేజీ అనే ప్రభుత్వ ఆస్పత్రిలో ఆగస్టు 9న అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఓ జూనియర్ మహిళా డాక్టర్ ని సంజయ్ రాయ్.. రేప్ చేసి ఆ తరువాత ఆమెను హత్య చేశాడనే ఆరోపణలున్నాయి. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలు, సిసిటీవి వీడియోలను బట్టి పోలీసులు సంజయ్ రాయ్ ని అరెస్టు చేశారు. అయితే ఈ కేసు వివాదాస్పదంగా మారడంతో కోల్ కతా హై కోర్టు కేసుని సిబిఐకి అప్పగించింది.

కేసు విచారణ చేపట్టిన సిబిఐ బృందం హింసాత్మక ఘటన కావడంతో నిందితుడు సంజయ్ రాయ్ మానసిక పరిస్థితిని పరిశీలించింది. విచారణలో భాగంగా సంజయ్ రాయ్ ని ప్రశ్నించగా.. అతను నేరం అంగీకరించాడు. పైగా డాక్టర్ పై అత్యాచారం చేసి.. ఆ తరువాత ఆమెను ఎలా హత్య చేశాడో సిబిఐ అధికారులకు వివరంగా చెప్పాడు.


అయితే సంజయ్ రాయ్ ఘటన గురించి వివరిస్తున్న సమయంలో సిబిఐ అధికారులు అతని మానసిక స్థితి గమనించారు. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది కొరత కారణంగా ఆ మహిళా ఏకధాటిగా 36 గంటలుగా డ్యూటీ చేస్తూ.. అలసి పోయింది. కాస్త విశ్రాంతి తీసుకునేందుకు ఆస్పత్రిలో సరైన రెస్ట్ రూమ్స్ లేకపోవడంతో సెమినార్ హాల్ లో కాసేపు పడుకొని ఉండగా.. అక్కడికి సంజయ్ రాయ్ వచ్చాడు. 31 ఏళ్ల అందమైన యువతి తనకళ్లెదుట నిద్రిస్తుండడం చూసి అతనిలోని మృగ వాంఛ మేల్కొంది. దీంతో సంజయ్ రాయ్ ఆ మహిళా డాక్టర్ పై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె ప్రతిఘటించడంతో నిందితుడు రాక్షసంగా ఆమెను చితకబాదాడు.

ఈ క్రమంలో ఆ మహిళా డాక్టర్ శరీరం పై భాగాల్లో 16 చోట్ల గాయాలయ్యాయి. ఆమె శరీరం లోపలి భాగాల్లో 9 చోట్ల గాయాలయ్యాయి. ఆమెను విపరీతంగా కొట్టి స్పృహ కోల్పోయిన బాధితురాలిపై పైశాచికంగా అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. రేప్ చేసిన వెంటనే ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లి రక్తపు మరకలు అంటుకున్న తన చొక్కాని ఉతికేసి హాయిగా నిద్రపోయాడు. ఈ ఘటనంతా సంజయ్ రాయ్ గ్యాప్ లేకుండా ఉద్రేకంగా సిబిఐ అధికారుల ముందు వివరించాడు. అతని వివరణ చూసి విస్తుపోయామని సిబిఐ అధికారులు మీడియాతో చెప్పారు.

ఘటనా స్థలంలో సంజయ్ రాయ్ బ్లూటూత్ ఉండడంతోపాటు, సిసిటీవి వీడియోల్లో సంజయ్ రాయ్ ఆస్పత్రిలో ప్రవేశించి, బయటికొచ్చిన సమయాలను బట్టి పోలీసులు అతడిని అరెస్టు చేశారు. సంజయ్ రాయ్ ఫోన్ లో చాలా అశ్లీల వీడియోలు లభించాయని అధికారులు తెలిపారు. పైగా అతను గతంలో మూడు వివాహాలు చేసుకున్నాడని, ఒక భార్యను తెగ హింసించేవాడని విచారణలో తెలిసింది. అతను కొట్టడం వల్ల అతని భార్యకు గర్భపాతం కూడా జరిగిందని సంజయ్ రాయ్ అత్త ఆరోపణలు చేసింది.

Also Read: ఏడాదిలో 9 మహిళలను చంపిన సైకో.. హత్యకు చిహ్నంగా లిప్ స్టిక్ తీసుకెళ్లే అలవాటు!

అయితే ఈ కేసులో మరో కోణం గురించి పోలీసులు విచారణ చేస్తున్నారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ శవాల వ్యాపారం చేసేవాడని.. ఆస్పత్రి సిబ్బంది అఖ్తర్ అలీ చెప్పడంతో మహిళా డాక్టర్ హత్య కేసులో కొత్త కోణం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×