BigTV English

Double Ismart Losses: భారీ నష్టాల్లో హనుమాన్ ప్రొడ్యూసర్‌.. కొత్త ఆఫర్ తీసుకొచ్చిన పూరీ!

Double Ismart Losses: భారీ నష్టాల్లో హనుమాన్ ప్రొడ్యూసర్‌.. కొత్త ఆఫర్ తీసుకొచ్చిన పూరీ!

Double Ismart Losses| హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన నిర్మాత నిరంజన్ రెడ్డికి భారీ నష్టాలు తప్పేట్టు లేవు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా, బాలీవుడ్ నటులు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా భారీ అంచనాలతో విడుదలై చివరికి డిజాస్టర్ గా మారింది. దీంతో సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పేట్టు లేవు.


ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్విల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ తో నడిచింది. అయినా హాలిడే సీజన్ ఉండడంతో కలెక్షన్లు వస్తాయని ఆశించారు. కానీ ఆ ఆశలు, అడియాశలయ్యాయి. దీంతో సినిమా హక్కులు ఫ్యాన్సీ రేట్లు పెట్టి కొన్ని డిస్ట్రిబ్యూటర్ లెక్కలు చూసుకుంటే రూ. 40 కోట్లు నష్టమట.

డబుల్ ఇస్మార్ట్ సినిమా డిస్ట్రిబూషన్ రైట్స్ తీసుకున్నది మరెవరో కాదు హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డికి చెందిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ. అమెరికాలో చాలా బిజినెస్ లు ఉన్న నిరంజన్ రెడ్డి.. డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రపంచవ్యాప్త రిలీజ్ రైట్స్ ని రూ.60 కోట్లకు కొన్నాడు. అయితే ఆ సినిమా నెట్ కలెక్షన్స రూ.20 కోట్లు దాటలేదు. దీంతో ఆయన హనుమాన్ సినిమాతో సంపాదించినదంతా డబుల్ ఇస్మార్ట్ తో పోగొట్టుకున్నారని తెలుస్తోంది.


హనుమాన్ సినిమాని యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందించగా.. యంగ్ టాలెంట్ తేజ సజ్జా సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. తెలుగుతో పాటు నార్త్ ఇండియా మొత్తం సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ మరోవైపు పూరీ జగన్నాథ్ లాంటి సీనియర్ డైరెక్టర్ దర్శకత్వం చేసిన డబుల్ ఇస్మార్ట్ మరో బ్లాక్ బాస్టర్ ఖాయమనుకుంటే సినిమా మొత్తానికే జెండా ఎత్తేసింది.

డబుల్ ఇస్మార్ట్ కు పెట్టిన రూ.60 కోట్లలో రూ.54 కోట్లు నాన్ రిఫండెబుల్ కాగా, రూ.6 కోట్లు మాత్రం రిఫండెబుల్. దీంతో నిరంజన్ రెడ్డికొచ్చిన నష్టంలో పూరి జగన్నాథ్ వాటా రూ.6 కోట్లు మాత్రమే. కానీ ఆ రూ.6 కోట్లు కూడా పూరీ తిరిగి ఇవ్వగలిగే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే ‘లైగర్’ సినిమా నష్టాల్లో నుంచి తేరుకోని.. ఆ సినిమాకొచ్చిన నష్టాలు భరిస్తానని డిస్ట్రిబూటర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు.

Also Read:  సంక్రాంతి బరిలో బాలకృష్ణ సినిమా.. మరోసారి చిరుతో పోటీ!

అయితే నిరంజన్ రెడ్డి నష్టాల్లో పంచుకోలేని పూరి కొత్త ఆఫర్ తీసుకొచ్చాడని ఫిల్మ్ నగర్ టాక్. ఎలాగూ హనుమాన్ సినిమా చేయడంతో నిరంజన్ రెడ్డికి ఆ సినిమా హీరో తేజ సజ్జాకు మంచి రిలేషన్స్ ఉంటాయి. అందుకే పూరి కొత్త ఐడియా ప్రకారం.. తేజ సజ్జా హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కొత్త సినిమాని నిరంజన్ రెడ్డి నిర్మిస్తే.. ఆ సినిమాక పూరి గారు ఫ్రీగా డైరెక్ట్ చేస్తానని చెప్పాడట.

కానీ తేజ సజ్జా ఇప్పుడు ఫామ్ లో ఉన్నాడు. అలాంటిది ఫామ్ కోల్పోయిన పూరితో సినిమాకు ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటే నిరంజన్ రెడ్డి ఆ సినిమాను పూరీని నమ్ముకొని ప్రొడ్యూస్ చేస్తారా? అనే చాలా ప్రశ్నలకు సమాధానం ఇంకొన్ని రోజుల తర్వాతే తెలుస్తుంది.

Also Read: ఎన్టీఆర్ కోసం హృతిక్ వెయిటింగ్.. వార్ వాయిదా!

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×