BigTV English

Rajamouli: ఆర్టీవో ఆఫీస్ లో సందడి చేసిన రాజమౌళి.. వీడియో వైరల్..!

Rajamouli: ఆర్టీవో ఆఫీస్ లో సందడి చేసిన రాజమౌళి.. వీడియో వైరల్..!

Rajamouli: సాధారణంగా సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి ఎక్కడ కనిపించినా.. ? ఏం చేసినా..? ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే వారు ఏ సందర్భంలో ఎక్కడ కనిపించినా సరే.. వారు ఎందుకు అక్కడ ఉన్నారు..? ఏ పని మీద వచ్చారు..? అనే విషయాలపై ఆరాతీస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి (Rajamouli).. తాజాగా ఆర్టీవో ఆఫీస్ లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..


ఆర్టీవో ఆఫీస్ లో సందడి చేసిన రాజమౌళి..

ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ లో ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి సందడి చేశారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఆయన గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్కు వచ్చారు. మహేష్ బాబు (Maheshbabu), రాజమౌళి (Rajamouli ) సినిమాకు సంబంధించి షూటింగ్ విదేశాల్లో జరుగుతున్న కారణంగా తన డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేసుకున్నారు. ఇకపోతే మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతూ ఉన్న చిత్రం SSMB -29భారీ స్థాయిలోనే రూపొందుతోంది. ఇందులో మహేష్ బాబు సరసన హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఒడిశా లో షూటింగ్ కూడా జరుపుకున్నారు. ఇక అక్కడ షూటింగ్ ముగిసిన వెంటనే ఆమె న్యూయార్క్ కి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే.


రాజమౌళి సినిమాలు..

ఇకపోతే ఈ సినిమా షూటింగు ఒడిశాలో జరుగుతున్న సమయంలో మహేష్ బాబు లుక్ కి సంబంధించిన కొన్ని విజువల్స్ లీక్ అవ్వగా.. చాలామంది వీటిని షేర్ చేసి, లైక్ కూడా చేయడంతో అవి మరింత వైరల్ గా మారాయి. దీనిపై అప్రమత్తమైన చిత్ర బృందం వెంటనే చర్యలు తీసుకుంది. నెటిజన్లు షేర్ చేసిన వీడియోలను కూడా తొలగించింది. ఈ ఘటనతో ఎస్ఎస్ఎంబీ 29 టీం తదుపరి షెడ్యూల్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసిందని చెప్పవచ్చు. ఇక ఇందులో మలయాళ సూపర్ స్టార్ నటుడిగా , దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. ఇలా భారీ అంచనాల మధ్య భారీతారాగణంతో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక రాజమౌళి విషయానికి వస్తే..’ శాంతి నివాసం’ అనే సీరియల్ ఎపిసోడ్ కి డైరెక్ట్ గా తన కెరియర్ ను ప్రారంభించిన ఈయన.. ఆ తర్వాత ‘స్టూడెంట్ నెంబర్ వన్ ‘, ‘సింహాద్రి’ వంటి చిత్రాలు చేసి తనకంటూ మంచి పేరు సొంతం చేసుకున్నారు. ఇక తక్కువ సమయంలో ‘ఈగ’, ‘మగధీర’, ‘సై’, ‘విక్రమార్కుడు’ వంటి సినిమాలతో తన మార్క్ చాటుకున్న ఈయన ‘ బాహుబలి’ సినిమాతో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాను ఈ తరం ప్రేక్షకులకు పరిచయం చేసి అబ్బురపరిచారు. ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు సొంతం చేసుకున్న రాజమౌళి.. ఆ తర్వాత ఎన్టీఆర్(NTR ), రామ్ చరణ్ (Ram Charan) తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేసి ఆస్కార్ వరకు వెళ్లిన రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ గా మిస్ అయిపోయారు. ఈసారి ఎలాగైనా సరే ఆస్కార్ అందుకోవాలనే దిశగా చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×