Actor Sivaji : కొన్నిసార్లు కొన్ని అవకాశాలు మనల్ని ఏ స్థాయికి తీసుకెళ్తాయో ఎవరు ఊహించలేరు. ఒకప్పుడు ఎన్నో సినిమాలు చేసి హీరోగా తనకంటూ కొంతమంది ఫ్యాన్స్ ను సాధించుకున్నారు జగపతిబాబు. అయితే అలా సినిమాలు చేస్తున్న తరుణంలో కొన్ని బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ ఉండటం వలన. జగపతిబాబు కూడా హీరోగా సినిమాలు చేయడం తగ్గించేశారు. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ సినిమాలో పాత్ర జగపతిబాబుకి విపరీతమైన పేరును తీసుకొచ్చింది. అక్కడినుంచి ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యాయి. మంచి మంచి విలన్ క్యారెక్టర్స్ లో నటించే అవకాశం లభించింది. ఇక ఎన్నో సినిమాలతో హీరోగా గుర్తింపు సాధించుకున్న శివాజీ కూడా రీసెంట్ గా వచ్చిన కోర్టు సినిమాతో అద్భుతమైన పేరును సంపాదించుకున్నాడు.
హీరోగా మంచి గుర్తింపు
శివాజీ విషయానికొస్తే ముందు నటుడుగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కీలక పాత్రలో కనిపించాడు. పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర వంటి సినిమాల్లో శివాజీకి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత శివాజీ కూడా హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. శివాజీ కెరియర్ లో కూడా కొన్ని మంచి సినిమాలు ఉన్నాయి. అయితే సినిమాలు చేస్తున్న తరుణంలో శివాజీ సినిమాలకు ఆదరణ తగ్గడం లభించింది. ఒక సందర్భంలో శివాజీ సినిమాలకు పూర్తిగా దూరమైపోయారు. పొలిటికల్ ఎనాలిసిస్ చేయడం వలన అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో కనిపిస్తూ ఉండేవాళ్ళు. మొత్తానికి శివాజీ కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.
సూర్య నుంచి ప్రశంసలు
శివాజీ నటించిన 90 మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ ఈటీవీ విన్ లో విడుదలైంది. దానిలో స్కూల్ టీచర్ గా శివాజీ నటించారు. అయితే శివాజీ పర్ఫామెన్స్ కి ఆ సిరీస్ మంచి పేరు తీసుకొచ్చింది. ఇక రీసెంట్గా రామ్ జగదీష్ దర్శకుడుగా పరిచయమైన కోర్టు సినిమాలో మంగపతి అనే పాత్రలో కనిపించాడు శివాజీ. మంగపతి పాత్ర చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. వాస్తవిక జీవితంలో అలాంటి మనుషులు కూడా ఉండడంవల్లనే బహుశా చాలామంది సోషల్ మీడియాలో కూడా మంగపతి క్యారెక్టర్ ని బాగా ఫేమస్ చేశారు. ఒక ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ సినిమాను చూసిన సూర్య జ్యోతిక కి కూడా మంగపతి క్యారెక్టర్ విపరీతంగా నచ్చిందట. అందుకే శివాజీకి ఒక బొకే పంపించి మంగపతి క్యారెక్టర్ పై ప్రశంసలు కురిపించారు. అయితే ఈ రోజుల్లో మామూలుగా ట్వీట్ చేయడం వేరు డైరెక్ట్ గా వాళ్ళ విషెస్ ని పంపడం వేరు. ఇక ఈ విషయాన్ని స్వయంగా శివాజీ పంచుకున్నారు.
Also Read : Thammudu : ట్రైలర్ బాగుంది, సినిమాపై అంచనాలను పెంచుతుంది