Telugu Movies : వేసవికాలం వచ్చిందంటే సినీ ప్రేమికులందరికీ పండగ సీజన్ వచ్చిందని చెప్పొచ్చు. జనవరి నుండి ప్రతి నెలలో రెండు సూపర్ సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నారు. భారీ చిత్రాలతో పాటు డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగులో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ని అందుకుంటున్నాయి. తాజాగా వచ్చిన జాట్ ,గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు ఈకోవకు చెందినవే. ఏప్రిల్ నెలలో నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాతో పాటు మిల్కీ బ్యూటీ తమన్నా కీలకపాత్రలో చేసిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఈ నెలలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా డజన్ సినిమాలు ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఒకే రోజు డజన్ సినిమాలు రిలీజ్ అవుతుండడంతో.. అందరూ ఆ సినిమాల గురించి ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఒకేరోజు ఇన్ని సినిమాలు విడుదల కావడం అన్నది తెలుగు సినిమా చరిత్రలోనే అసాధారణమని చెప్పొచ్చు. ఇంతకీ ఆ సినిమాలేంటో మనము తెలుసుకుందాం ..
ఏప్రిల్ 25 నాడు రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు..
సారంగపాణి జాతకం : ఈ సినిమా కామెడీ డ్రామాగా మన ముందుకు రానుంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
సోదరా : ఈ సినిమా కామెడీ యాక్షన్ మూవీ గా మన ముందుకు రానుంది. సంపూర్ణేష్ బాబు హీరోగా ఈ సినిమాలో నటిస్తున్నారు.
శంభో శివశంభో : ఫాంటసీ హర్రర్ థ్రిల్లర్ గా మన ముందుకు రానుంది. తనికెళ్ల భరణి, సుమన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
హలో బేబీ: రొమాంటిక్ కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కావ్య కీర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
శౌర్య పాఠం : క్రైమ్ థ్రిల్లర్ గా మన ముందుకు రానుంది. ఇది రియల్ లైఫ్ స్టోరీ గా ఇంద్ర రామ్ హీరోగా నటిస్తున్నారు.
ఏ ఎల్ సి సి : డ్రామా సోషల్ మూవీ గా ఈ సినిమా రానుంది. ఓ యూనివర్సల్ బ్యాచిలర్ గా రిలీజ్ కానుంది. నవీన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.
సర్వం సిద్ధం : కామెడీ క్రైమ్ డ్రామాగ మన ముందుకు రానుంది. గోవింద్ రాజ్ సంతోష్ సిద్ధేశ్వర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
సూర్యాపేట జంక్షన్: పొలిటికల్ బ్యాక్ డ్రాప్, యాక్షన్ మూవీగా మన ముందుకు రానుంది. ఈశ్వర్ నైనా సర్వర్ జంటగాన్ అభిమన్యుసింగ్ కీలక పాత్రలో ఈ సినిమా రానుంది.
మన ఇద్దరి ప్రేమ కథ : థ్రిల్లర్ మూవీగా మన ముందుకు రానుంది. ప్రియా జాస్పియర్, నందిని, ఇక్బాల్,మౌనిక నాయుడు ప్రధాన పాత్రలో ఈ సినిమా రానుంది
6 జర్నీ : అడ్వెంచర్ మూవీగా మన ముందుకు రానుంది. ఆరుగురు యువతీ యువకుల మధ్య జరిగే సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. సమీర్ దత్త పల్లవి రాథోడ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
జింఖానా: మలయాళం డబ్బింగ్ సినిమాగా మన ముందుకు రానుంది. యాక్షన్ థ్రిల్లర్ మూవీ గా రూపొందించారు. మలయాళం లో సక్సెస్ అయిన ఆలప్పుజ ఖింజనా మూవీ ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. నెస్లేన్ హీరోగా ఈ సినిమాలో నటిస్తున్నారు.
తుడరమ్ : ఈ సినిమా మలయాళం డబ్బింగ్ సినిమా మోహన్ లాల్ శోభన ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందిస్తున్నారు. మోహన్ లాల్ ఈ సినిమాలో టాక్సీ డ్రైవర్ గా కనిపిస్తారు.
సినీ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒకేరోజు ఈ 12 సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఏప్రిల్ చివరి వారం అవడం వేసవి సెలవులు దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమాలలో ఎక్కువగా చిన్న సినిమాలే ఉన్నాయి. ఇలాంటి చిన్న సినిమాలకు ఇదే కరెక్ట్ అయిన సమయం. పండుగలు లేని టైంలో ఇలాంటి చిన్న సినిమాలు రిలీజ్ చేయడం జరుగుతుంది.
Game Changer on TV : టీవీల్లోకి వచ్చేస్తున్న రామ్ చరణ్ డిజాస్టర్ మూవీ… ఎప్పుడు..? ఎక్కడ అంటే..?