Ram Gopal Varma : రామ్ గోపాల్ వర్మ.. ఒకప్పుడు సంచలనాత్మకమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించాడు. తన దర్శకత్వ ప్రతిభతో చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసాడు. తెలుగు సినిమాలో ఒక కొత్త మార్పును తీసుకొచ్చాడు. మెల్లగా సాగుతున్న తెలుగు సినిమాని పరుగులు పెట్టించాడు. ఇలా ఒకటి రెండు కాదు ఎన్నో అచీవ్మెంట్స్ ను రాంగోపాల్ వర్మ జీవితంలో సాధించాడు అని చెప్పొచ్చు. రాంగోపాల్ వర్మ శివ సినిమాను తీసినప్పుడు చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పటికే కొన్ని కథలను రాసుకున్న చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆ కథలను చింపేసారు. అంత గొప్పగా శివ సినిమాను తెరకెక్కించాడు రాము. అయితే ఆ తర్వాత గాయం, సత్య వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా అందించాడు. ఇప్పుడు టాప్ డైరెక్టర్ గా చలామణి అవుతున్న చాలామంది డైరెక్టర్స్ ఒకప్పుడు రాంగోపాల్ వర్మ దగ్గర పనిచేసిన వాళ్లే.
రాంగోపాల్ వర్మ అంటేనే క్రియేటివిటీ. చాలా తక్కువ ఏజ్ లోని వరల్డ్ సినిమాను చూడటం. ఎక్కువ పుస్తకాలు చదవడం వలన రామ్ గోపాల్ వర్మ ఆలోచన తీరు భిన్నంగా ఉంటుంది. అందుకనే రాంగోపాల్ వర్మ సినిమాలు కూడా ఒకప్పుడు చాలా భిన్నంగా ఉండేవి. రీసెంట్ టైమ్స్ లో రాంగోపాల్ వర్మ తన క్రియేటివిటీ పని చెప్పడం మానేసాడు. బయోపిక్ సినిమాలు తీస్తూ తనకు నచ్చిన పని నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే ఈ తీరు రాంగోపాల్ వర్మ కి ఇప్పుడు వచ్చింది కాదు ఎప్పటినుంచో ఉన్నదే.
ఇక ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ సారీ అనే ఒక సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. ఇంస్టాగ్రామ్ లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ ను పెట్టి రాంగోపాల్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతున్న తరుణంలో రాంగోపాల్ వర్మ పలు రకాల ఇంటర్వ్యూ లో పాల్గొంటున్నారు.ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలను ప్రస్తావించారు వర్మ . ఇదివరకు తాను కొంతమంది దేవుళ్ళపై చేసిన కామెంట్స్ లు కూడా మరోసారి గుర్తు చేశాడు. అయితే రామ్ గోపాల్ వర్మ ఒక వరల్డ్ క్లాస్ సినిమా తీస్తాను అని చెప్పిన విషయం తెలిసిందే. ఇదే విషయం గురించి యాంకర్ ప్రస్తావించినప్పుడు. నేను ఖచ్చితంగా ఆ సినిమా చేస్తాను. ఒకవేళ నేను చేయకపోతే మీరు నా డెన్ కి వచ్చి చెప్పుతో కొట్టండి అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రాంగోపాల్ వర్మ. అయితే రాంగోపాల్ వర్మ గతంలో ఇలాంటి మాటలు చాలా చెప్పారు. కానీ నిలబెట్టుకున్న దాఖలాలు లేవు. ఇదే మళ్లీ రాంగోపాల్ వర్మ అని అడిగితే సింపుల్ గా నా ఇష్టం అంటారు.వాస్తవానికి రాంగోపాల్ వర్మ నుంచి ఒక మంచి సినిమా వస్తుంది అని ఆడియన్స్ కూడా ఎదురు చూడటం కంప్లీట్ గా మానేశారు.
Also Read : Director Buchi Babu Sana: నా ఉప్పెన సినిమాకి మా నాన్న థియేటర్ ముందు అందర్నీ టాక్ అడిగేవాడు