Director Buchi Babu: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ దర్శకులలో సుకుమార్ ఒకరు. సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దగ్గర పని చేసిన చాలామంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీలు ఇప్పుడు దర్శకులుగా మారుతున్నారు. ప్రజెంట్ జనరేషన్లో పెద్ద డైరెక్టర్ దగ్గర చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు దర్శకులుగా మారడం అనేది అరుదుగా జరుగుతుంది. ఈ విషయంలో సుకుమార్ గ్రేట్ అని చెప్పాలి. కొందరు అసిస్టెంట్ డైరెక్టర్స్ ని తను కథలు ఇచ్చి మరి డైరెక్టర్ చేసిన దాఖలాలు ఉన్నాయి. సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లోనే టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఏకంగా రామ్ చరణ్ హీరోగా సినిమాను చేస్తున్నాడు.
ఉప్పెన సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు బుచ్చిబాబు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు సినిమా చేస్తాడు అని వార్తలు వచ్చాయి. అలానే ఎన్టీఆర్ కి బుచ్చిబాబుకి మధ్య అనుబంధం కూడా బాగానే ఉంటుంది. వీరిద్దరూ కలిసి నాన్నకు ప్రేమతో సినిమాకి పనిచేశారు. ఎన్టీఆర్ తో అనుకున్న ప్రాజెక్ట్ ఎవరు ఊహించని విధంగా రామ్ చరణ్ తో చేస్తున్నాడు బుచ్చిబాబు. రామ్ చరణ్ కెరియర్ లో వస్తున్న 16వ సినిమా ఇది. ఈ సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ గ్రౌండ్ లో జరగబోతున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఒక సందర్భంలో సుకుమార్ కూడా మాట్లాడుతూ చిట్టిబాబు పాత్ర పుట్టడానికి కారణం బుచ్చిబాబు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కంప్లీట్ గా చరంతో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమా గురించి ఒక ఎమోషనల్ స్పీచ్ కూడా పంచుకున్నాడు బుచ్చిబాబు.
బ్రహ్మాజీ నటించిన బాపు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈవెంట్ కి బుచ్చిబాబు కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈవెంట్లో బుచ్చిబాబు మాట్లాడుతూ తమ నాన్నతో ఉన్న ఎక్స్పీరియన్స్ ను షేర్ చేశారు. బుచ్చిబాబు సినిమాలు చూడటం వాళ్ళ నాన్నకి ఇష్టం లేదంట, సినిమాలు కి వెళ్తే వాళ్ళ నాన్న కొట్టే వారంట. మా నాన్న వ్యవసాయం చేసేవాళ్లు, ఆయనకు సినిమాలు అసలు ఇష్టం లేవు. నేను సినిమా తీసినప్పుడు థియేటర్ వరకు వెళ్లి లోపలికి వెళ్లలేదు. సినిమా చూసొచ్చిన వాళ్ళని సినిమా ఎలా ఉంది అని అడిగారట. మా నాన్న సంవత్సరం క్రితమే కాలం చేశారు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను. రామ్ చరణ్ సినిమాకి అలా అడగాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read : ఇలా దెబ్బ కొట్టావా రష్మిక.. సమంత బాధ అదేనా?