BigTV English

Sandeep Reddy: ఆ హీరోయిన్ కు క్షమాపణలు చెప్పిన సందీప్ రెడ్డి… నీలో ఈ యాంగిల్ కూడా ఉందా వంగా మామ?

Sandeep Reddy: ఆ హీరోయిన్ కు క్షమాపణలు చెప్పిన సందీప్ రెడ్డి… నీలో ఈ యాంగిల్ కూడా ఉందా వంగా మామ?

Sandeep Reddy: సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) ఒకరు. ఈయన తెలుగులో అర్జున్ రెడ్డి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక ఇదే సినిమాని హిందీలో రీమేక్ చేస్తూ అక్కడ కూడా సూపర్ సక్సెస్ అందుకోవడంతో సందీప్ రెడ్డి బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కొనసాగుతూ సినిమాలపై ఫోకస్ చేశారు. ఇక ఈయన ఇటీవల యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.


క్షమాపణలు చెప్పిన డైరెక్టర్…

ఈ సినిమాలో రణబీర్ కపూర్(Ranbir Kapoor) రష్మిక(Rashmika) హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో సందీప్ రెడ్డి తన తదుపరి చిత్రం ప్రభాస్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా హీరోయిన్ విషయంలో పెద్ద ఎత్తున వివాదం చోటుచేసుకుంది. ముందుగా ఈ సినిమాలో దీపికా పదుకొనేని హీరోయిన్గా ఎంపిక చేశారు కానీ, ఆమె కొన్ని కండిషన్లు పెట్టిన నేపథ్యంలో సందీప్ రెడ్డి ఆమెను ఈ సినిమా నుంచి తప్పించి త్రిప్తి దిమ్రిని ఎంపిక చేయటంతో పెద్ద ఎత్తున వివాదం నెలకొంది.


క్షమాపణలు చెప్పటం గొప్ప విషయం…

ఇలాంటి వివాదాలలో చిక్కుకున్న నేపథ్యంలో సందీప్ రెడ్డికి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతుంది. సందీప్ రెడ్డి ఇటీవల చేసిన యానిమల్(Animal) సినిమాలో కూడా రష్మిక మొదటి ఛాయిస్ కాదని తెలుస్తోంది. ఈ సినిమాలో ముందుగా ఈయన బాలీవుడ్ నటి పరిణితి చోప్రాను(Parineeti Chopra) ఎంపిక చేశారని, ఈ సినిమా కాస్త షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఆమెను సినిమా నుంచి తప్పించానని తెలిపారు. ఇలా పరిణితి చోప్రా స్థానంలో రష్మిక రావడానికి గల కారణాలను కూడా ఈయన వెల్లడించారు. యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్రకు ముందుగా పరిణితి చోప్రాను అనుకొని, కొంత షూటింగ్ తర్వాత ఈ సినిమా నుంచి తప్పించాము అందుకు నేను తనకు క్షమాపణలు కూడా చెప్పానని తెలిపారు.

ఈ సినిమా కోసం పరిణితి చోప్రాను ఎంపిక చేసిన తర్వాత లుక్ టెస్ట్ అన్ని కూడా చేశాము బాగా సెట్ అవుతుందని అనిపించింది. కానీ షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత గీతాంజలి పాత్రకు తాను కరెక్ట్ కాదని నాకనిపించింది. అందుకే ఈ విషయం పరిణితికి చెప్పి ఆమెను తప్పించి ఆ తర్వాత రష్మికను ఎంపిక చేసామని సందీప్ రెడ్డి షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఎంతో వైల్డ్ గా కనిపించే సందీప్ రెడ్డి హీరోయిన్ కు క్షమాపణలు చెప్పడంతో మనలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా వంగా మామ అంటూ కొందరు కామెంట్లు చేయగా, ఇండస్ట్రీలో ఇలా సెలబ్రిటీలను రీప్లేస్ చేయడం సర్వసాధారణం కానీ, క్షమాపణలు చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అంటూ ఈయన తీరుపై మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×