Shiva Rajkumar:కన్నడ నటుడు శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) అంటే తెలియని వారు ఉండరు. ఈయన కన్నడ సినిమాల్లో నటించినప్పటికీ సౌత్ ఇండస్ట్రీ వ్యాప్తంగా గుర్తింపు పొందిన హీరో.. అయితే అలాంటి ఈ హీరో సొంత రాష్ట్రంలోనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అది కూడా కమల్ హాసన్ (Kamal Haasan) చేసిన పని వల్ల.మరి ఇంతకీ కమల్ హాసన్ వల్ల శివరాజ్ కుమార్ ఎందుకు సఫర్ అవుతున్నారు..? కమల్ చేసిన పనికి శివరాజ్ కుమార్ ని ఎందుకు నిందిస్తున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం కమల్ హాసన్ పై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కన్నడ భాష తమిళం నుండి పుట్టిందని చెప్పి, కన్నడిగుల కోపానికి బలయ్యారు కమల్ హాసన్.ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ మూవీ కన్నడలో రిలీజ్ చేయాలంటే కచ్చితంగా కమల్ హాసన్ కన్నడ ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాల్సిందే అని,ఒకవేళ క్షమాపణలు చెప్పకపోతే ఖచ్చితంగా ఈ సినిమాని కన్నడలో బ్యాన్ చేస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు.
కమలహాసన్ దెబ్బకు శివరాజు కుమార్ పై పెరుగుతున్న నెగిటివిటీ..
అయినా కూడా కమల్ హాసన్ తగ్గేదేలే అంటూ క్షమాపణలు చెప్పకపోగా నేను ఆ మాటలు ప్రేమతో అన్నాను.. సారీ చెప్పను అని, నేను ఎంతోమంది భాషా చరిత్రకారుల దగ్గర తెలుసుకొనే మాట్లాడాను అంటూ మరోసారి కన్నడ ప్రజలకు మండేలా చేశారు. దాంతో కన్నడ వ్యాప్తంగా కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీని బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా కమల్ హాసన్ ఈ మాటలు మాట్లాడిన టైంలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ చప్పట్లు కొట్టిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది కన్నడ వాళ్ళు నీ సొంత భాషను హేళన చేసి మాట్లాడితే నువ్వు నవ్వుకుంటూ చప్పట్లు కొడుతున్నావా అంటూ శివరాజ్ కుమార్ పై మండిపడుతున్నారు.
స్పందించిన శివరాజు కుమార్.. ఆగని ట్రోల్స్
అయితే ఈ వీడియో పై తాజాగా స్పందించిన శివ రాజ్ కుమార్.. కమల్ హాసన్ మాట్లాడినప్పుడు నేను చప్పట్లు కొట్టలేదు.అది ఫేక్ వీడియో. నేను ఆయన మాట్లాడిన వేరే మాటలకు చప్పట్లు కొడితే దాన్ని ఎడిటింగ్ చేసి అలా మార్చారు.అందులో ఎలాంటి నిజం లేదు. అలాగే నేను ఎప్పటినుండో చెబుతున్నాను కన్నడ భాష కోసం ప్రాణం ఇస్తానని.నేను అన్ని భాషల్ని గౌరవిస్తాను. కానీ కన్నడ భాష నా మాతృభాష.నా భాష కోసం చావడానికైనా సిద్ధం.. ఇక కమల్ హాసన్ ఏం మాట్లాడారో కూడా నాకు అర్థం కాలేదు. అలాగే నేను కమల్ హాసన్ మాట్లాడిన మాటలకి క్షమాపణలు చెప్పమని అడగలేను. ఎందుకంటే ఆయన ఓ పెద్ద హీరో. ఆయనకు నేను పెద్ద అభిమానిని.. అంటూ చెప్పుకొచ్చారు. అయితే శివరాజ్ కుమార్ మాట్లాడింది అంతా బాగానే ఉంది. కానీ మళ్ళీ ఆయనపై ట్రోల్స్ చేస్తున్నారు.ఎందుకంటే కమల్ హాసన్ అభిమానివైతే ఆయన కన్నడ భాషను ఎంత హేళనగా మాట్లాడిన కూడా సపోర్ట్ చేస్తావా.. ఛీ ఛీ.. నీ భాష అంటే నీకు కనీస గౌరవం లేదా అంటూ విమర్శిస్తున్నారు. అలా కమల్ హాసన్ చేసిన కామెంట్లకి సొంత గడ్డపైనే శివరాజ్ కుమార్ వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.
ALSO READ:Sudheer: పెళ్లి కాకుండానే అంకుల్.. ఆ హీరోయిన్ చేతిలో ఘోర అవమానం!