Satyabhama Today Episode February 24th: నిన్నటి ఎపిసోడ్లో.. హర్ష ఇంటికి వస్తాడు. నేను మోసం చేశాను నందిని మోహం చూడాలంటే నాకు భయమేస్తుంది అని మళ్లీ బయటకు వెళ్లాలని అనుకుంటాడు. హర్ష వెళ్ళిపోతుంటే వాళ్ళ నాన్నమ్మ చూసి హర్షను తిడుతుంది. హర్ష లోపలికి వెళ్ళగానే నందిని హర్ష తో మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతుంది. అటు క్రిష్ బైరవి అన్నమాటను తలుచుకొని కోపంగా ఉంటాడు. అమ్మంటే ఇలా మాట్లాడుతుందా? అమ్మన్న మాటలకి నేను ఎంత బాధ పడుతున్నానో తెలుసా అని ఆలోచిస్తూ ఉంటాడు. క్రిష్ ఛాలా కోపంగా ఉన్నాడు దీన్ని ఎలాగైనా కూల్ చేయాలి అని సంజయ్ ప్లాన్ వేస్తాడు. ఏమైంది బ్రో అంత టెన్షన్ పడుతున్నావ్ అంటే అమ్మ ఇలా అంటే బాధగా ఉంటది బ్రో అనేసి అంటాడు బిగ్ మామ్ తో నేను మాట్లాడుతాను అసలు ఏమైందో కనుక్కుంటానని అంటాడు. సంజయ్ మాట నమ్మి తాగడానికి కూర్చుంటాడు క్రిష్. భైరవి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ మొత్తం బాటిల్ ని తాగేస్తాడు. ఇలా మత్తులో చేరుకోవడమే నాకు కావాలి అక్కడ నేను సత్యతో చేయబోయేది నువ్వు చూడకూడదు కదా అనేసి అనుకొని వెళ్ళిపోతూ ఉంటాడు కానీ క్రిష్ మాత్రం ఎక్కడికి వెళ్తున్నావ్ బ్రో అంటే కళా పోషణ కాస్త అలా వెళ్లి వస్తానని అంటాడు. సత్య దగ్గరికి సంజయ్ వస్తాడు. సత్యను చక్కని చూసి కసితో రగిలిపోతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. క్రిష్ సత్యపై చెయ్యేసినందుకు సంజయ్ ని చితగ్గొట్టేస్తాడు. రక్తం వచ్చేలా కొడతాడు ఎవరు ఆపినా కూడా ఆగడు. సంజయ్ ని నా సత్య మీద చేయిస్తావని చంపబోతాడు. ముందు మీద కాలు పెట్టి నీకు ఇక భూమి మీద నూకలు చెల్లాయి ఇన్ని రోజులు సంధ్య మొహం చూస్తే నిన్ను వదిలాను ఇక నువ్వు చేసే మోసం గురించి అందరికీ తెలిస్తే అందరు నిన్నే ఛీ అంటారు అంటూ సంజయ్ ని చంపబోతాడు.. అప్పుడే మహదేవయ్య వచ్చి రేయ్ చిన్న అంటూ క్రిష్ ను కాలుతో తన్నెస్తాడు.. ఎందుకురా నువ్వు నా కొడుకుని చెప్పాలి అనుకుంటున్నావు నీకేం అధికారం ఉందని నువ్వు చంపుతావు అనేసి మహాదేవయ్యా క్రిష్ ను అంటాడు. నువ్వు అస్సలు నా కొడుకువే కాదు అని అంటాడు. ఇక భైరవి పెళ్లాంతో కుమ్మక్కయ్ సంజయ్ ప్రాణం తీయాలి అనుకున్నావ్ కదరా. తప్పు కదరా పాపం ఎట్లా గిల గిలా కొట్టుకుంటున్నాడో చూడండి అంటూ అంటుంది.
ఇక మహాదేవయ్య మనసులో చిన్నా గాడు నా కొడుకు కాదని రుజువు చేయడం చేతకాక నా కన్న కొడుకు సంజయ్ మీద పగపట్టావా కోడలా అనుకుంటాడు. క్రిష్ కూడా నేను చెప్పేది విను బాపు నేను చెప్పింది తప్పు అని పిస్తే చంపేయ్ ఎదురు చెప్పను. దానికి మహదేవయ్య ఛీ నీ ముఖం చూడాలి అంటే అసహ్యాంగా ఉందిరా ఇంక మాటలేంటి.. సంజయ్ఏడుపు నటిస్తూ వీళ్లిద్దరూ నా నుంచి బయటకు గెంటేయాలి అని చూస్తున్నారు. ఈ ఇళ్లు నాది అనుకున్నా మీలో నా అమ్మానాన్నని చూస్తున్నా మీరంతా నా ఆప్తులు అనుకున్నా. జీవితాంతం మీతో సంతోషంగా ఉండాలి అనుకున్నా. ఇందంతా ఓ భ్రమ అని తేలిపోయింది. సంజయ్ కన్నీళ్ల నాటకాన్ని చూసి అందరు నిజం అని నమ్ముతారు.
క్రిష్ అబద్దాలు చెబుతున్నాడు అని అందరు అంటాడు. ఇక క్రిష్ నిజం బయటకు రాబట్టాలని సత్య అంటుంది. నోర్ముయ్. నాటకాలు ఆడకు. ఈ ఇంటి కోడలి మీద దౌర్జన్యం జరిగింది అంటే ఇంటి పెద్దగా ఈయన గారు ఏం చేయాలి. ఈ సంజయ్ షర్ట్ పట్టుకొని నిలదీయాలి. నిజం రాబట్టాలి. అదేమీ చేయకుండా సరాసరి వచ్చి నీ గుండెల మీద తన్నాడు అంటే అర్థమేంటి. హా.. అడుగు మీ బాపుని క్రిష్.. తమ్ముడి కొడుకు తప్పు చేస్తే పట్టించుకోకుండా ఏ కన్న తండ్రి అయినా కన్న కొడుకుని చంపడానికి సిద్ధ పడలేదు. ఇదెక్కడి న్యాయం నేను ఎక్కడా ఇంత వరకు వినలేదు. చూడలేదు. కారణం ఏంటి తెలుసుకోవాలని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇంత చిన్న ప్రశ్నకు మీ బాపు ఎందుకు సమాధానం చెప్పడం లేదు క్రిష్. పోనీ నువ్వు అంటే ఇష్టం లేదు అందుకే తన్నారు అంటే అలాంటి ఛాన్సే లేదు. ఎందుకు అంటే నువ్వు అంటే ఆయనకు నువ్వు ప్రాణం గుండెల మీద నీ పేరు పచ్చ బొట్టు వేయించుకున్నారు. నిన్ను తక్కువ చేస్తూ సంజయ్కి విలువ ఇస్తున్నారు అంటే ఏదో పెద్ద కారణం ఉంది కదా చెప్పమను క్రిష్. ఆ మౌనానికి అర్థమేంటి. అయినా మన ఇంట్లో ఈ కొట్టు కోవడాలు మామూలే కదా మరి దీనికి ఇంత రాద్దాంతం ఎందుకు. అక్క దేవుడి దగ్గర హారతి తీసుకురా సత్య అంటుంది. రేణుక హారతి తీసుకురాగానే హారతి మీద ప్రమాణం చేసి చెప్పండి అనగానే క్రిష్ నా కొడుకు కాదు నా రక్తం పుచ్చుకు పుట్టిన కొడుకు కానేకాదని మహదేవయ్య నిజం చెప్పేస్తాడు.. నా చిన్న కొడుకు సంజయ్ అంటాడు. నువ్వు తట్టుకున్నా తట్టుకోకపోయినా ఇదే నిజం. నువ్వు నా కొడుకువి కాదు. నువ్వు బుద్ధిగా ఉండి ఉంటే పాతికేళ్లగా దాచుకున్న ఈ నిజం ఎప్పటికీ నా గుండెల్లోనే దాచుకునేవాడిని. ఎప్పటికీ నా కొడుకులా చూసుకునేవాడిని. కానీ గీత దాటావు. ఈ స్థానంలో ఉండాల్సింది వీడు నా అసలైన కొడుకు నా చిన్న కొడుకు సంజయ్. క్రిష్ కుప్పుకూలిపోయి.. నేను బాపు కొడుకుని కాదట పరాయి వాడినంట. నా గుండెల మీద ఎవరో కాళ్లు వేసి తొక్కుతున్నట్లుంది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కొడుకు కాదు అంటే నేను ఏమైపోవాలి సత్య. బాపు కాదన్నా కూడా నేను బాపు కొడుకునే. ఇక్కడ గుండె నిండా ప్రేమ ఉంది నా ప్రేమ చావదు. అని అంటాడు.. జయమ్మ వాడు నీ కొడుకు కాకపోతే ఎవడ్రా వాడు అని అడుగుతుంది. భైరవి డెలివరీ అయినప్పుడు అక్కడ హాస్పిటల్ లో ఎంత పెద్ద గొడవ జరిగిందో చూసావు కదా అప్పుడే పక్కవాడిలో కాన్పైనా చక్రవర్తి కొడుకుని నా కొడుకుగా పెంచాను కేవలం నాకు కాపలాగా మాత్రమే పెంచాను నా కొడుకుని ఆ చక్రవర్తికి ఇచ్చాను అనగానే షాక్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇప్పుడు ఎపిసోడ్ లో చక్రవర్తి కృష్ణ తన ఇంటికి తీసుకెళ్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..