Daaku Maharaj Song: మాస్ ఆడియన్స్ పల్స్ క్యాచ్ చేయాలంటే కమర్షియల్ సినిమాల్లో ఐటెమ్ సాంగ్ అనేది పక్కా ఉండాల్సిందే అని చాలామంది మేకర్స్ ఫీలవుతుంటారు. అందులోనూ ఎన్నో ఏళ్లుగా మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న బాలకృష్ణ సినిమాలో ఐటెమ్ సాంగ్ ఉండకపోతే ఎలా..? అందుకే బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj)లో కూడా ఒక ఐటెమ్ సాంగ్‌ను యాడ్ చేశారు మేకర్స్. న్యూ ఇయర్ సందర్భంగా ఈ సాంగ్‌కు సంబంధించిన ఫస్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక జనవరి 2 సాయంత్రం 5 గంటల 16 నిమిషాలకు ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట రిలీజ్ అయిన వెంటనే బాలయ్య ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపేసేలా ఉంది.
బాలయ్య స్టెప్పులు అదుర్స్
‘దబిడి దిబిడి’ (Dabidi Dibidi) అంటూ సాగే ఈ పాటలో బాలయ్యకు జోడీగా ఊర్వశి రౌతెలా (Urvashi Rautela) కనిపించింది. ఇద్దరూ కలిసి ఎనర్జిటిక్ స్టెప్పులతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేశారు. మామూలుగా బాలయ్య పాటల్లో వేసే స్టెప్పులకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా విడుదలయిన లిరికల్ సాంగ్‌లో కూడా అలాంటి స్టెప్పులు రివీల్ చేశారు. దీంతో ఈ సాంగ్ ఇన్‌స్టాంగ్ చార్ట్ బస్టర్ అయిపోయి రేపటి నుండి దీనిపై చాలా రీల్స్ వస్తాయని ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఊర్వశి రౌతెలా గ్రేస్ అయితే సాంగ్‌కు ఎక్స్‌ట్రా అందాన్ని యాడ్ చేసింది. ఇప్పటికే తెలుగులో పలువురు స్టార్ హీరోలతో కలిసి స్టెప్పులేసిన ఊర్వశి.. ఇప్పుడు బాలయ్యతో కలిసి చిందులేసి అందరినీ అలరించింది.
Also Read: సంధ్య థియేటర్ కేసులో ‘పుష్ప 2’ నిర్మాతలకు ఊరట.. వారికి అనుగుణంగా కోర్టు తీర్పు
ఊర్వశి రిపీట్
ఇప్పటికే బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’లో కూడా ఊర్వశి రౌతెలా ఒక స్పెషల్ సాంగ్‌లో నటించింది. అందులో చిరంజీవితో కలిసి స్టెప్పులేసి ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇప్పుడు బాలయ్యతో కూడా ఊర్వశి వేసిన స్టెప్పులు అందరినీ అలరించేలా ఉన్నాయి. ఇక ఈ పాటను వెండితెరపై చూస్తుంటే ఒక రేంజ్‌లో ఉంటుందని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. తమన్, బాలకృష్ణ (Balakrishna) కాంబినేషన్ అనేది గత కొన్నేళ్లలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. బాలయ్య సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు అంటే అది కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని సెంటిమెంట్‌లాగా ఫీలవుతున్నారు. ఇప్పుడు ‘డాకు మహారాజ్’ విషయంలో కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతోంది.
డైలాగ్సే లిరిక్స్‌గా
‘డాకు మహారాజ్’లో ‘దబిడి దిబిడి’ పాటలో మరొక స్పెషాలిటీ ఏంటంటే బాలయ్య చెప్పిన ఫేమస్ డైలాగ్స్‌ను ఈ పాటలోని లిరిక్స్‌గా ఉపయోగించుకున్నారు మేకర్స్. ‘ఇంటికే వస్తావో.. నట్టింటికే వస్తావో’, ‘నువ్వు అడుగెడితే హిస్టరీ రిపీట్సే’.. అనే డైలాగులను లిరిక్స్‌లాగా ఉపయోగించేసుకున్నారు కాసర్ల శ్యామ్. తమన్ అందించిన సంగీతం ఎప్పటిలాగానే బాలయ్య ఫ్యాన్స్‌లో జోష్ నింపేలా ఉంది. ఈ పాటను వాగ్దేవితో కలిసి తమన్ స్వయంగా ఆలపించారు. శేఖర్ మాస్టర్ అందించిన స్టెప్పులు చాలా బాగుంటాయని లిరికల్ వీడియో చూసి అంచనా వేస్తున్నారు ప్రేక్షకులు.