BigTV English
Advertisement

Prabhas – Pawan Multi Starrer: ప్రభాస్- పవన్ మల్టీస్టారర్.. డైరెక్టర్ సుజీత్ సంచలన వ్యాఖ్యలు!

Prabhas – Pawan Multi Starrer: ప్రభాస్- పవన్ మల్టీస్టారర్.. డైరెక్టర్ సుజీత్ సంచలన వ్యాఖ్యలు!

Director Sujeeth Wants to Make a Movie Prabhas – Pawan Combo: నెత్తురు మరిగిన హంగ్రీ చీటా అంటూ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసి వదిలేశాడు కుర్ర డైరెక్టర్ సుజీత్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఇప్పటివరకు ఏ డైరెక్టర్ ఇంత అగ్రెసివ్ గా చూపించింది లేదు. రన్ రాజా రన్ సినిమాతో సుజీత్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతో భారీ విజయాన్ని అందుకొని అసలు ఎవరు సుజీత్ అని అందరూ అతనివైపు తిరిగేలా చేశాడు. ఇక రెండో సినిమాతో ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు.


సుజీత్- ప్రభాస్ కాంబోలో వచ్చిన సాహో సినిమా కొన్ని కారణాల వలన ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితేనేం.. సుజీత్ కొంత గ్యాప్ తీసుకున్నా పెద్ద స్టార్ నే పట్టాడు. టాలీవుడ్ ఏ డైరెక్టర్ అయినా తాను అభిమానించే హీరోతో కలిసి వర్క్ చేయాలనీ డ్రీమ్ పెట్టుకుంటారు. ప్రస్తుతం సుజీత్ ఆ డ్రీమ్ ను నెరవేర్చుకునే పనిలో పడ్డాడు. పవన్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం OG.

డీవీవీ దానయ్య ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే OG నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు అభిమానుల అంచనాలను ఆకాశానికి తాకేలా చేసాయి. ఇకపోతే తాజాగా సుజీత్ చెప్పిన కొన్ని మాటలు వింటే.. ఈ కుర్ర డైరెక్టర్ ముందు ముందు టాలీవుడ్ నే కాదు ఇండస్ట్రీ మొత్తాన్ని తగలెట్టేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ – ప్రభాస్ తో మల్టీస్టారర్ అంటే అభిమానులు ఆ హైప్ తో ఉండాలా.. ? పోవాలా.. ?. ఇలాంటి స్టార్ కాంబో ఆర్ఆర్ఆర్ తరువాత వచ్చింది లేదు. ఈ కాంబో దానికన్నా హైప్ తీసుకొచ్చి పెడుతుంది.


Also Read: NKR 21: తాత జయంతి రోజు కొత్త సినిమా ప్రకటించిన నందమూరి హీరో..

తాజాగా సుజీత్.. హీరో కార్తికేయతో కలిసి భజే వాయువేగం ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. ఆ ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో సుజీత్ OG కి సంబంధించిన పలు విషయాలను, తన మనసులోని మాటలను రెండు షేర్ చేసుకున్నాడు. OG రీమేక్ కాదు. మొదట పవన్ సార్ కూడా రీమేక్ కోసమే రమ్మన్నారు. అప్పుడే అనుకున్నాను.

దేవుడా ఒక్క ఛాన్స్.. ఒరిజినల్ సినిమా వచ్చే కిక్ వేరు ఉంటుంది. ఆ ఒక్క ఛాన్స్ వస్తే బావుండు అని అనుకున్నాను. ఒకరోజు కళ్యాణ్ గారు ఏదైనా కొత్త కథ ఉందా.. ? అని అడిగారు. ఒక్క లైన్ చెప్పా.. అంతే ఫిక్స్ అయిపోయింది. OG అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని పేరు వచ్చింది కానీ, OG అంటే ఓజాస్ గంభీర్. ఓజాస్ అంటే మాస్టర్.. గంభీర్ అంటే ఆయన పేరు. ఇలా అనుకున్నాం.. కానీ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అని వచ్చింది” అని చెప్పుకొచ్చాడు.

Also Read: Namita Divorce: భర్తతో నమిత విడాకులు.. ఇదిగో క్లారిటీ.. ?

ఇక భవిష్యత్తులో తనకు పవన్ – ప్రభాస్ తో ఒక మల్టీస్టారర్ తీయాలని ఉందని చెప్పాడు. ఈ ఒక్క మాట ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ పని చెయ్ స్వామి.. నీకు గుడి కట్టమన్నా కట్టేస్తాం అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. నిజంగా ఇదే మల్టీస్టారర్ కనుక ఓకే అయ్యింది అంటే ఇండస్ట్రీ హైప్ తో చచ్చిపోవడం ఖాయమే అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం సుజీత్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×