Hair Growth Oil: జుట్టు పొడవుగా, అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం అమ్మాయిలు ముఖ్యంగా రకరకాల హెయిర్ ఆయిల్స్ తో పాటు షాంపూలను కూడా వాడుతుంటారు. ఇదిలా ఉంటే మరికొందరు నేచురల్ హోం రెమెడీస్ వాడుతుంటారు. బయట మార్కెట్ లో దొరికే హెయిర్ ప్రొడక్ట్స్ వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇంట్లో దొరికే కొన్ని రకాల పదార్థాలతో హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు ఇంట్లోనే ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని వాడితే జుట్టు రాలే సమస్య చాలా వరకు తగ్గుతుంది. అంతే కాకుండా జుట్టు బాగా పెరుగుతుంది కూడా. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న హోం మేడ్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హెయిర్ ఆయిల్ తయారీ:
కావలసినవి:
కొబ్బరి నూనె: 1 కప్పు
వేప గింజలు: 1 టీ స్సూన్
బ్రహ్మీ గింజలు: 1 టీ స్పూన్
కరివేపాకు: 1 చిన్న కప్పు
నువ్వులు: 2 టేబుల్ స్పూన్లు
బియ్యం: 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం: ముందుగా కొబ్బరి నూనె తీసుకుని గ్యాస్‌పై ప్యాన్ పెట్టి అందులో వేసి వేడిచేయాలి. 5 నిమిషాల తర్వాత అందులో పైన చెప్పిన అన్ని పదార్థాలను వేసి 10 నుంచి 15 నిమిషాల పాటు మరగనివ్వాలి. తర్వాత నూనె రంగు మారతుతుంది. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఆయిల్ ను వడకట్టాలి. అనంతరం దీనిని ఒక గాజు సీసా లేదా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేయాలి .
ఇలా తయారు చేసిన ఈ ఆయిల్ వారానికి 2 సార్లు ఉపయోగించవచ్చు. తలస్నానం చేసే గంట ముందు ఆయిల్ జుట్టుకు బాగా అప్లే చేసి 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా జుట్టు బాగా పెరుగుతుంది. అంతే కాకుండా రాలకుండా కూడా ఉంటుంది.
తరుచుగా ఈ ఆయిల్ వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. జుట్టు సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే తరుచుగా ఈ హెయిర్ ఆయిల్ వాడాలి. చుండ్రు సంబంధిత సమస్యలకు ఇది బెస్ట్ ఆయిల్ అనే చెప్పాలి. తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఈ ఆయిల్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Also Read: దీన్ని ఒక్క సారి వాడినా చాలు.. తెల్లగా మెరిసిపోతారు
ఈ ఆయిల్ యొక్క ప్రయోజనాలు:
జుట్టు పొడవుగా మారుతుంది. అంతే కాకుండా మందంగా తయారవుతుంది.
ఈ నూనె జుట్టు కుదుళ్లకు తగిన పోషణను అందిస్తుంది.
ఈ ఆయిల్ వాడటం వల్ల రాలిన చోట తిరిగి జుట్టు పెరుగుతుంది.
జుట్టు మృదువుగా మారడంలో ఈ ఆయిల్ ఉపయోగపడుతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.