Oscar 2026 : వరల్డ్ వైడ్ గా సినీ, కళ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్. దీనిని అకాడమీ అవార్డులు అని కూడా అంటారు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ ఆస్కార్ అవార్డు అందుకోవాలనే కలలు కంటారు. కానీ ఆస్కార్ దక్కడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కసారైనా నామినేషన్ లో తమ పేరు చూసుకోవాలని చాలా సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ఆస్కార్ అవార్డులను అందుకున్నాయి. తెలుగులో మాత్రం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ దక్కింది. ఇక వచ్చే ఏడాదికి గాను ఆస్కార్ అవార్డుల లిస్టును త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. వచ్చే ఏడాది మార్చిలో అవార్డులను అందించనున్నారు. మరి ఎప్పుడు? ఎక్కడ? ఈ అవార్డుల వేడుక జరగనుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
ఆస్కార్ అవార్డుల వేడుక ఎప్పుడంటే..?
సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ అంటే ఆస్కార్ అవార్డ్స్. ప్రతి ఏడాది సినిమాలకు సంబంధించిన ఆస్కార్ అవార్డులు వేడుక జరుగుతూనే ఉంది. అలాగే ఈ ఏడాదికి సంబంధించి ఆస్కార్ అవార్డులో ఎంపిక జరిగింది. వచ్చే ఏడాది అవార్డులను అందించనున్నారు. మార్చి 2న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ అట్మాస్ థియేటర్‌లో 97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా 2026లో జరుగనున్న 98వ ఆస్కార్ అవార్డుల వేడుక తేదీలను ఆస్కార్ నిర్వాహకులు వెల్లడించారు..
ఏఐ సినిమాలకు ఛాన్స్..
ఈ ఆవార్డులను వచ్చే ఏడాది మార్చి 15న జరగనున్నట్లు అకాడమీ తెలిపింది. అందుకు నామినేట్ అయిన చిత్రాల జాబితాను జనవరి 22న వెల్లడిస్తామని పేర్కొంది. అయితే ఈసారి ఏఐ టెక్నాలజీ ఉపయోగించిన సినిమాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు ప్రకటించారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ లో ఈ వేడుక జరగనుంది. 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు విడుదలైన సినిమాలకు ఆస్కార్ ఎంట్రీకి అవకాశం ఉంటుంది. కానీ, ఒరిజినల్ సాంగ్ విభాగం కోసం మాత్రం 2025 నవంబర్ 3 వరకు విడుదలైన మూవీలకు మాత్రమే ఛాన్స్ ఉంటుంది..
Also Read :‘పెద్ది’ షాట్.. క్రెడిట్ మొత్తం అతనికే.. డైరెక్టర్..
ఆస్కార్ అవార్డ్స్..
సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన అత్యంత గొప్ప అవార్డ్స్ అంటే ఆస్కార్ అవార్డులే.. ప్రతీ యేటా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక బహుమతులు. దీని బహుమతి ప్రదానోత్సవం అత్యంత వైభోగంగా జరుపడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది వీక్షిస్తారు. ఈ అవార్డులను మొదటగా మే 16, 1929లో హాలీవుడ్ లోగల హోటల్ రూజ్వెల్ట్ లో జరిగింది. 1927, 1928 సంవత్సరాలలో చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం కోసం నటుడు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీ కలిసి దీన్ని ఏర్పాటు చేశారు.. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రతి ఏడాది అవార్డులను అందిస్తున్నారు.. ఈ ఏడాది తెలుగు సినిమాకు అవార్డు దక్కుతుందో లేదో చూడాలి..