BigTV English

Director Teja: కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న డైరెక్టర్ తేజ.. టైటిల్ అదిరిపోయిందిగా

Director Teja: కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న డైరెక్టర్ తేజ.. టైటిల్ అదిరిపోయిందిగా

Exclusive – Director Teja: ఒకప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ డైరెక్టర్లలో దర్శకుడు తేజ ఒకరు. అసిస్టెంట్ కెమెరామెన్‌గా కెరీర్‌ను మొదలుపెట్టిన తేజ.. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్‌గా పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు పనిచేశారు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ.. దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ‘చిత్రం’ అనే సినిమాతో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తొలి సినిమా సక్సెస్ కావడంతో తేజ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. చిన్న చిన్న హీరోలతో సినిమాలు చేసి మంచి హిట్లు కొడుతూ పేరు సంపాదించుకున్నాడు.


జయం, నువ్వు నేను సహా మరెన్నో సినిమాలు తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రాల విజయంతో తన పేరు మరింత మారు మోగిపోయింది. అయితే ఆ తర్వాత తీసిన సినిమాలు పెద్దగా హిట్‌ కాలేదు. తీసిన ప్రతి సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో కద్దిరోజులు సైలెంట్‌గా ఉన్న దర్శకుడు తేజ ఆ తర్వాత టాలీవుడ్ క్రేజీ హీరో రానా దగ్గుబాటితో ‘నేనే రాజు నేనే మంత్రి’ మూవీ చేశాడు.

ఈ మూవీలో రానా సరసన కాజల్ హీరోయిన్‌గా నటించింది. ఇందులో దర్శకుడు తేజ.. రానాను చూపించే విధానం సినీ ప్రియుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమాలో రానా అప్పుల వ్యాపారిగా ఉంటాడు. అంటే అవసరమైన వారికి వడ్డీకి డబ్బులు అప్పుగా ఇస్తాడు. నిర్ముహమాటంగా వాళ్లదగ్గర నుంచి ముక్కుపిండి వసూళు చేస్తాడు. అలాంటి వాడు రాజకీయాల్లోకి ఎలా వెల్లాడు అనేది చూపించిన తీరు అత్యద్భుతంగా ఉంది.


Also Read:  ఆర్జీవీ ‘శారీ’ టీజర్.. పేరుకే చీర, అందాలు ఆరబోతే ఎక్కువ.. మరో అడల్ట్ మూవీ అవుతుందా?

ఈ సినిమాతో దర్శకుడు తేజ మంచి కంబ్యాక్ అయ్యాడు. అక్కడ నుంచి తేజకు తిరుగులేదని చాలా మంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత అతడు రానా తమ్ముడు అభిరామ్‌తో ‘అహింస’ సినిమా తీశాడు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయింది. బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. కానీ దర్శకుడు తేజ తన ప్రయత్నాన్ని ఆపలేదు. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇందులో భాగంగానే ఒక డిఫరెంట్ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో తేజ తన కొడుకుని లీడ్ యాక్టర్‌గా (హీరో) పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం అతడి కుమారుడు శిక్షణ కూడా పొందుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ‘వాయువు’ అనే టైటిల్‌ని మేకర్స్ ఫిక్స్ చేశారని ఇండస్ట్రీ టాక్. తన కొడుకు మొదటి సినిమాకి తానే దర్శకత్వం వహిస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి మొదలైంది. ఆనంది ఆర్ట్స్‌తో కలిసి తేజ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. దీనికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×