BigTV English

Director Teja: ఉదయ్ కిరణ్ మొదటి సినిమా ఎంపిక వెనుక ఇంత కథ నడిచిందా..?

Director Teja: ఉదయ్ కిరణ్ మొదటి సినిమా ఎంపిక వెనుక ఇంత కథ నడిచిందా..?

Director Teja: సాధారణంగా ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చేవారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలి సినిమాతోనే హీరోగా అవకాశం వస్తుందా? అంటే చెప్పలేని పరిస్థితి. అది అదృష్టం పైన ఆధారపడి ఉంటుంది. ఒకరకంగా చెప్పాలి అంటే నెపోటిజం కిడ్స్ తో పోలిస్తే బ్యాక్ గ్రౌండ్ లేని వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే సినీ ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టాలి అంటే కాస్తో .. కూస్తో ఫేమ్ ఉండాలని, అలాంటి వారికే హీరోగా అవకాశం ఇస్తారు అంటూ ఇండస్ట్రీ విషయాలను బయటపెట్టారు డైరెక్టర్ తేజ (Director Teja). అంతేకాదు తన సినిమా కోసం హీరో ఉదయ్ కిరణ్ (Uday Kiran) ను ఎంచుకునేటప్పుడు జరిగిన తతంగాన్ని కూడా చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.


Tollywood: సౌందర్యను చంపించింది మోహన్ బాబే.. నేనే సాక్ష్యం అంటున్న చిట్టిబాబు..!

‘చిత్రం’ సినిమా కోసం ఉదయ్ కిరణ్ ఎంపిక వెనుక ఇంత కథ జరిగిందా..?


తాజాగా డైరెక్టర్ తేజ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ఆ ఇంటర్వ్యూలో.. “ఉదయ్ కిరణ్ తొలి సినిమా ఆడిషన్స్ లో హీరోలను ఎలా పిక్ చేసుకున్నారు?” అని ప్రశ్నించగా.. తేజ మాట్లాడుతూ.. “నా సినిమాకి యంగ్ హీరోలు కావాలి. కానీ ఫిలిం ఇండస్ట్రీ ప్రకారం మొదటి సినిమాకి హీరోగా నటించాలంటే కొంచెం పాపులారిటీ అయి ఉండాలి. నేను ఉదయ్ కిరణ్ ని అనుకున్నాను. కానీ రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు ఇతను కాదు మా సినిమా కోసం ఇంకొక అబ్బాయి ఉన్నారు. అతన్ని పెడదామన్నారు. ఇక ఉదయ్ కిరణ్ కి నేనేం చెప్పానంటే ముందు కూర్చున్న వాడిని కాస్త వెనక్కి వెళ్లి కూర్చో వేరొక అబ్బాయి వస్తాడు అని చెప్పాను. ఇక తర్వాత ఆ చైల్డ్ ఆర్టిస్ట్ మదర్ కి వెళ్లి కథ చెప్పాను. వారికి కథ నచ్చింది కానీ ఎంత రెమ్యూనరేషన్ అని అడిగారు. రూ.11,000 అని చెప్పాను. దాంతో ఆవిడ మా అబ్బాయికి రూ.11,000 ఏంటి రూ.5,00,000 కావాలి అని డిమాండ్ చేశారు. ఇక నేను రూ.5లక్షలు బడ్జెట్ లేదండి, నా చిత్రానికి నేను అనుకున్న హీరోకి కేవలం రూ.11000 మాత్రమే ఇవ్వగలను అని చెప్పాను. కానీ ఆవిడ ఏంటి మా అబ్బాయికి రూ.11,000 అంటూ అడిగారు. కానీ నేను మీ అబ్బాయికి మేమెలా వాల్యూ కట్టగలము. అంత దమ్ము నాకు ఎక్కడుంది అని కూడా చెప్పాను. ఇక దాంతో ఆమె మేము చేయలేము అని చెప్పారు ఇక వెనక్కి వచ్చా. ఇక తర్వాత ఆ చైల్డ్ ఆర్టిస్ట్ కుర్రాడిని వెనక్కి కూర్చోమని, ఉదయ్ కిరణ్ ని మళ్ళీ ముందు కూర్చోబెట్టాను..” అని తేజ తెలిపారు. ఇంటర్వ్యూలో భాగంగా ఎవరు సార్ ఆ చైల్డ్ ఆర్టిస్టు అని ప్రశ్నించగా..” ఎవరిని తగ్గించకూడదు.. వీలైతే పెంచాలి” అంటూ చక్కగా విలువల గురించి తెలియజేశారు తేజ. “మళ్లీ అట్లూరి రామారావు గారు వచ్చి నేనెళ్ళి మాట్లాడుతాను అని చెప్పారు. దాంతో నేను ఉదయ్ తో నువ్వు కాదు వెనక్కి వెళ్లి కూర్చో అని చెప్పాను. మళ్లీ ఆయన వెళ్లి మాట్లాడి వచ్చి వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పడంతో వెనకున్న ఉదయ్ కిరణ్ ని మళ్లీ ముందుకు పిలిపించాను.” అంటూ అసలు విషయాన్ని చెప్పారు తేజ. మొత్తానికైతే ‘చిత్రం’ సినిమా కోసం ఉదయ్ కిరణ్ ను ఎంపిక చేసుకోవడం వెనుక ఇంత కథ జరిగిందా అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.

తక్కువ బడ్జెట్ తో భారీ బ్లాక్ బస్టర్..

ఇక ఉదయ్ కిరణ్ తొలి సినిమా ‘చిత్రం’ విషయానికి వస్తే.. అతి తక్కువ బడ్జెట్ తో, కొత్త వారితో కాలేజీ పిల్లల ప్రేమ ఇతివృత్తంగా 2000 మే 25న విడుదలైన సినిమా ‘చిత్రం’. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అటు హీరోగా ఉదయ్ కిరణ్ ను నిలబెట్టింది అని చెప్పవచ్చు. ఇక ఇందులో రీమాసేన్ హీరోయిన్ గా నటించగా , చిత్రం శీను, బబ్లు, తనికెళ్ల భరణి, బెనర్జీ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×