Trinadh Rao Nakkina : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో త్రినాధరావు నక్కిన ఒకరు. చాలామంది దర్శకుల కెరియర్లో హిట్ ప్లాపు సినిమాలు ఉంటాయి. కానీ అతి తక్కువ మంది దర్శకులు మాత్రం భారీ హిట్ సినిమాలు కొట్టకుండా అలానే డిజాస్టర్ సినిమాలు చేయకుండా సేఫ్ జోన్ లో సినిమాలు చేస్తూ ఉంటారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తాయి. కేవలం నిర్మాతకు లాభాలు తీసుకురావడం మాత్రమే వాళ్ళ ఉద్దేశం అనుకునేటట్లు వాళ్ళ సినిమాలు ఉంటాయి. అలాంటి వారిలో అనిల్ రావిపూడి, మారుతి, త్రినాధరావు నక్కిన వంటి పేర్లు చెప్పొచ్చు. అనిల్ రావిపూడి వీళ్లందరిలో కొంచెం ప్రత్యేకం ఎందుకంటే ప్రస్తుతం స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ కొడుతున్నాడు. ఇక దర్శకుడు మారుతి విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభాస్ హీరోగా రాజా సాబ్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
నిర్మాతగా అడుగులు
త్రినాధ రావు నక్కిన కొన్ని సక్సెస్ఫుల్ సినిమాలు తీసిన తర్వాత నిర్మాతగా కూడా అడుగులు వేశారు. ఈయన కెరియర్ లో ముఖ్యంగా ధమాకా సినిమా మంచి లాభాలు తీసుకొచ్చింది. దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ సినిమా. ఇక రీసెంట్ గా వచ్చిన మజాకా సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది. ఈయన నిర్మాతగా చౌర్యపాఠం అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో అందరూ కూడా కొత్త నటులు కనిపిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ మాత్రం మంచి అంచనాలను. ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే రీసెంట్ టైమ్స్ లో థియేటర్స్ కు ఆడియన్స్ రావట్లేదు అనేది వాస్తవం మరి ఈ సినిమాకి ఎటువంటి ఆదరణ దక్కుతుందో వేచి చూడాలి.
క్రేజీ ప్రమోషన్స్
ఒక మంచి సినిమాను తీయడం ఎంత ముఖ్యమో ఆ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే దీనిని విపరీతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు దర్శకుడు త్రినాధరావు. ముఖ్యంగా ఈ సినిమా దొంగతనాలు కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇతరుణంలో దొంగతనాలు ఎక్కడ చేయాలి ఎలా చేయాలి అని ఒక ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో కూడా ఆసక్తిగా ఉంది. దొంగతనాలు ఎక్కువగా ఉండే పెద్ద పెద్ద ఇళ్లల్లో చేయకూడదు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎక్కడ ఏది ఉందో తెలుసుకోవడానికి టైం పట్టేస్తది, అలానే చిన్నచిన్న ఇళ్లల్లో చేయకూడదు ఎందుకంటే అక్కడ ఏమీ దొరికే అవకాశం ఉండదు. మరి ఎక్కడ చేయాలి అని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా పార్ట్ 2 లో చెప్తా అంటూ ఈ వీడియోని కట్ చేశారు.
Also Read : Aamir Khan: భారీ బడ్జెట్ బయోపిక్ నుండి తప్పుకున్న అమీర్ ఖాన్.. ఇక సినిమాలు లేనట్టేనా.?