భారత్ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. ఇక్కడ ఎన్నో రకాల సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నాయి. బోలెడు మతాలు, పలు భాషలు ఉన్నాయి. భిన్న వాతావరణం, విభిన్న నేలలతో సమశీతోష్ణ దేశంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇండియాలో పలు రకాల ఆహారపు అలవాట్లు ఉన్నాయి. నార్త్ రాష్ట్రాలో శాకాహారుల సంఖ్య ఎక్కువగా ఉండగా, సౌత్ స్టేట్స్ లో మాంసాహారు ఎక్కువగా ఉన్నారు. ఇంతకీ దేశంలో ఏ రాష్ట్రాల్లో శాకాహారం ఎక్కువగా తినేవాళ్లు ఉన్నారు? ఏ రాష్ట్రాల్లో మాంసాహారం ఎక్కువగా తింటారు అనే విషయాన్ని తెలుసుకుందాం..
శాకాహారులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు
దేశంలో అత్యధిక శాకాహారులు ఉన్న రాష్ట్రంలో రాజస్థాన్ టాప్ లో ఉంది. ఇక్కడ ఏకంగా 75 శాత మంది వెజిటేరియన్స్ ఉన్నారు. రెండో స్థానంలో హర్యానా ఉంది. ఇక్కడ 70 శాతం మంది శాకాహారులు ఉన్నారు. పంజాబ్ లో 67 శాతం మంది, గుజరాత్ లో 61 శాతం, హిమాచల్ ప్రదేశ్ లో 53 శాతం, ఢిల్లీ, మధ్య ప్రదేశ్, మహారాష్ట్రలో 40 శాతం మంది శాకాహారులు ఉన్నారు.
మాంసాహారుల ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు
నాన్ వెజ్ ఎక్కువగా తినేవాళ్లు కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్స్ లో ఉన్నారు. ఇక్కడ నూటికి నూరశాతం మంది నాజ్ వెజిటేరియన్స్. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ ఉంది. ఇక్కడ ఏకంగా 98.7 శాతం మంది మాంసాహారం తినేవాళ్లు ఉన్నారు. వెస్ట్ బెంగాల్ లో 98.6 శాతం మంది మాంసాహారం తింటున్నారు. ఆ తర్వాత స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ ఉంది. ఇక్కడ ఏక్గా 98.3 శాతం మంది నాన్ వెజ్ టేరియన్స్ ఉన్నారు. తమిళనాడులో 97.7 శాతం, ఒడిషాలో 97.6 శాతం మంది మాంసాహారులు ఉన్నారు. జార్ఖండ్, కేరళలో 97 శాతం మంది మాంసాహారం తినేవాళ్లు ఉన్నారు. బీహార్ లో 92.5 శాతం మంది నాన్ వెజ్ తింటారు. సిక్కిం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో 92 శాతం మంది మాంసం తింటారు. అండమాన్ నికోబార్ లో 91 శాతం, గోవాలో 89 శాతం, చత్తీస్ గఢ్ లో 82 శాతం, అస్సోంలో 79.4, కర్నాటకలో 79 శాతం మంది నాన్ వెజ్ తినేవాళ్లు ఉన్నారు.
Read Also: ఒక్క ఫ్లైట్ టికెట్ కొని రూ. 75 లక్షల ఫుడ్ తినేశాడు, అదీ ఫ్రీగా!
ప్రపంచంలోనే అత్యధిక వెజిటేరియన్స్ ఉన్న దేశం
ఇక ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది శాకాహారులు ఉన్న దేశంగా భారత్ కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా సగటును 39 శాతం మంది వెజిటేరియన్స్ ఉన్నారు. ఇందుకు కారణాలు చాలా ఉన్నాయి. సాంస్కృతిక, మతపరమైన ఆచారాల కారణంగా అత్యధిక మంది వెజిటేరియన్స్ గా కొనసాగుతున్నారు. హిందూ, జైన, బౌద్ధ మతాల కారణంగా ఎక్కువగా మాంసాహారం తినరు. ఈ మతాల వాళ్లు జీవుల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటారు. అహింసకు దూరంగా ఉంటారు. శాకాహారం చాలా పురాతనమైనది. భారత్ లో ఈ సాంప్రదాయం వేదాల కాలం నాటి నుంచి ఉంది.
Read Also: ఇండియాకు ఏపీ ఇన్ని అందిస్తోందా? మీరు అస్సలు ఊహించి ఉండరు!