TGPSC Group-1: తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు ఇది బిగ్ అలెర్ట్. గ్రూప్-1 నియామకాలపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్-1 నియామక పత్రాలు ఇవ్వొద్దని తెలిపింది. ఎన్నికైన అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగించొచ్చని హైకోర్టు క్లారిటీ ఇచ్చింది.
అయితే, గ్రూప్-1 ఫలితాలపై పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ఎగ్జామ్ లో, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో చాలా అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. మెయిన్స్ ఎగ్జామ్ లో పేపర్ల ముల్యాంకనం సరిగా జరగలేదని.. మరి కొంత మంది తెలుగు మీడియం అభ్యర్థులకు సరిగా మార్కులు రాలేదని పిటిషన్ లో పేర్కొన్నారు.
గ్రూప్-1 ఎగ్జామ్ పేపర్ల ముల్యాంకనం నియామకాల ప్రక్రియకు విరుద్ధంగా, చాలా అవకతవకలు జరిగాయని పిటిషన్ లో అభ్యర్థులు పేర్కొన్నారు. పేపర్ల ముల్యాంకనంపై హైకోర్టు పర్యవేక్షణలో లేదా స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని తెలిపారు. ఈ క్రమంలోనే గ్రూప్-1 మెయిన్స్ పేపర్లను మళ్లీ దిద్దాలని.. లేదా మరోసారి ఎగ్జామ్ నిర్వహించాలని పిటిషన్ లో వివరించారు. తిరిగి పేపర్లను దిద్దితే.. ఆ మార్కులకు ఆధారంగానే జీఆర్ఎల్ ప్రకటించాలని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రభుత్వం, టీజీపీఎస్సీ ప్రతివాదులుగా చేర్చారు.
ఈ నేపథ్యంలోనే విచారణ చేపట్టిన హైకోర్టు, విచారణ పూర్తయ్యే వరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వొద్దని తెలిపింది. అయితే ఎంపికైన అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగించొచ్చని హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణను ఏప్రిల్ 28 కి వాయిదా వేసింది.
Also Read: HURL Recruitment: ఈ జాబ్ వస్తే రూ.1,00,000కి పైగా జీతం.. ఈ అర్హత ఉన్న వాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు..