BigTV English

Trivikram: సమంత కోసం అందరం ఏదో ఒకటి చేయాలి.. ఆమె ఒక శక్తి.. త్రివిక్రమ్ సంచలన వ్యాఖ్యలు

Trivikram: సమంత కోసం అందరం ఏదో ఒకటి చేయాలి.. ఆమె ఒక శక్తి..  త్రివిక్రమ్ సంచలన వ్యాఖ్యలు

Trivikram: బాలీవుడ్  స్టార్ హీరోయిన్ అలియా భట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా జిగ్రా రిలీజ్ కు రెడీ అవుతోంది. పాన్ ఇండియా లెవెల్ లో అక్టోబర్ 11 న ఈ సినిమా రిలీజ్ కానుంది. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ సినిమాను కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అలియా భట్, షాహీన్ భట్ & సోమెన్ మిశ్రా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డ్రగ్స్ కేసులో ఇరుకున్న తమ్ముడును కాపాడుకోవడానికి ఒక అక్క  ఏం చేసింది అనేదే జిగ్రా కథ.


ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా తెలుగులో జిగ్రా  ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్, స్టార్ హీరోయిన్ సమంత, నటుడు  రానా ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఇక వేదికపై త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ” అందరికి నమస్కారం..  నా ఇద్దరు ఫేవరేట్ స్టార్స్ నా ఎదురుగా ఉన్నారు. ఒకరు సమంత.. ఇంకొకరు అలియా భట్. అలియాతో నేను ఇంకా వర్క్ చేయలేదు. సమంతతో మూడు సినిమాలు చేశాను. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం ఇలా అన్ని భాషల్లో ఒకే రకమైన ఫ్యాన్స్ బేస్ ఉన్న వాళ్లలో ఒకరు రజినీకాంత్.. మరొకరు సమంత మాత్రమే. చాలారోజుల తరువాత సమంతను చూడడం చాలా ఆనందంగా ఉంది. 


కొన్ని సినిమాల పోస్టర్స్ చూడగానే అవి మనల్ని పిలుస్తాయి.. జిగ్రా అలాంటి సినిమానే.  ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.. అలియా ఈ సినిమా కోసం ఎంత కష్టపడిందో.. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది  అని ట్రైలర్ చూసి చెప్పొచ్చు. ఈ సినిమాలో పనిచేసిన  అందరికి శుభాకాంక్షలు. సమంతలో ఉన్న లక్షణాలే అలియాలో కనిపించాయి. సెట్ లో ఆమె డైనమెట్ గా ఉంటుంది. చచ్చిపోతున్నా సీన్  చేస్తున్నా.. నవ్వుతూ వెళ్లి చచ్చిపోతుంది. అలాగే అలియా కూడా ఉంది.

సమంత  ఎప్పటి నుంచో హీరోనే. ఏ మాయ చేసావే నుంచి మీరు హీరోనే. అమ్మ తరువాత వేరే తరం లేదు.. మీకు ఎవరో శక్తిని ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరే ఒక శక్తి  మిమ్మల్ని ఎవరో మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక మగాడు సంతోషంగా ఉంటే వాడు డబ్బువలన సంతోషంగా ఉన్నాడని, ఒక స్త్రీ సంతోషంగా ఉంటే ఒక కుటుంబం బావుంటుంది. సెట్ లో హీరోయిన్ హ్యాపీగా ఉంటే.. ఆ యూనిట్ మొత్తం బావుంటుంది.

సమంత ఎప్పుడూ ముంబై లోనే ఉండొద్దు.. అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తూ వుండండి. మీరు చెయ్యారేమో అని నేను మీకోసం క్యారెక్టర్లు రాయడం లేదు. అత్తారింటికి దారేదిలా.. సమంత కు హైదరాబాద్ కు దారేది అని చెప్పాల్సి వస్తుంది. సోషల్ మీడియాలో ఒక హ్యాష్ క్రియేట్ చేయాలి.. ఆమె కోసం అందరం ఏదో ఒకటి చేయాలి. హైదరాబాద్ కు రప్పించాలి. ఆర్ఆర్ఆర్ లో సీత పాత్రతో అలియా మన ఇంటికి వచ్చేసింది. ఈ విజయదశమికి విజయాన్ని ఆమెకు కానుకగా ఇచ్చి  మన ఇంటి పడచుకు మరింత సక్సెస్ తో బయటికి పంపిద్దాం.  ఆల్ ది బెస్ట్ అలియా” అంటూ ముగించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా  మారాయి. 

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×