Vasista: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా ‘బింబిసారా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు డైరెక్టర్ వశిష్ట మల్లిడి(Vasista mallidi). మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత రెండో సినిమా ఏకంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తో చేసే అవకాశం అందుకున్నారు. దీంతో బింబిసారా డైరెక్టర్ కాస్త విశ్వంభర డైరెక్టర్ గా మారిపోయారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా.. చిరంజీవి గత కొన్ని రోజులుగా చికెన్ గున్యా వ్యాధితో బాధపడడం వల్ల సినిమా షూటింగ్ ఆలస్యమైంది. దాంతో సినిమా విడుదల తేదీని కూడా మార్చారు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మే నెలలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మరోవైపు ఈ సినిమా కోసం లాక్ చేసిన తేదీని ఈయన వారసుడు రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ (Game changer)సినిమాను విడుదల చేయబోతున్నారు.
డైరెక్టర్ వశిష్ట అకౌంట్ హ్యాక్..
ఇకపోతే తాజాగా వశిష్ట టెలిగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది అంటూ ఈ విషయాన్ని డైరెక్టర్ వశిష్ట సోషల్ మీడియా వేదికగా స్పందించారు.. “హాయ్, అందరికీ.. ఇప్పుడే నా టెలిగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందనే విషయాన్ని నేను గుర్తించాను. నా టెలిగ్రామ్ అకౌంట్ నుంచి మీకు ఏదైనా మెసేజ్ వస్తే మాత్రం వాటిని దయచేసి పట్టించుకోవద్దు.. ధన్యవాదాలు” అంటూ రాసుకు వచ్చారు. ఇక ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు అలర్ట్ అవుతున్నారు. అంతేకాదు వశిష్ట రిక్వెస్ట్ మేరకు సినీ సెలబ్రిటీలు కూడా అలర్ట్ కావాలని కోరుతున్నారు.
వశిష్ట సినీ రంగ ప్రవేశం..
ఇక వశిష్ట విషయానికి వస్తే.. ‘బింబిసారా’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈయన ‘విశ్వంభర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడడంతో ప్రమోషన్స్ విషయంలో కూడా టీం కాస్త ఆలస్యం చేస్తోంది. దాదాపు సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నా.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కూడా విడుదల చేయలేదు. ఈ మధ్యనే దసరా సందర్భంగా సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ప్రస్తుతానికి దానిని చూసే అభిమానులందరూ ఆనందపడుతున్నారు. ఇక నెమ్మదిగా ప్రమోషన్స్ మొదలుపెట్టి, పెద్ద ఎత్తున సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరేమో చిరంజీవి ఈ విషయంపై స్పందించలేదు. మరి చిత్ర బృందమైనా ఈ విషయంపై స్పందించి, ప్రమోషన్స్ మొదలు పెడతారేమో చూడాలి.
అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ మొదలు..
ఇక వశిష్ట కెరియర్ విషయానికొస్తే.. ఈయన అసలు పేరు మల్లిడి వెంకట నారాయణ రెడ్డి (Mallidi Venkata Narayana Reddy). ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత వశిష్టగా పేరు మార్చుకున్నారు. చలనచిత్ర దర్శకుడిగా, స్క్రీన్ రైటర్ గా, నటుడిగా కూడా పేరు దక్కించుకున్న ఈయన ఎవరో కాదు సినీ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి (Mallidi Surya Narayana Reddy)కుమారుడే. నా ఆటోగ్రాఫ్, భగీరథ, సఖియా, బన్నీ, ఢీ, బాడీ గార్డ్ వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఈయన 2007లో ‘ప్రేమలేఖ రాశా’ అనే సినిమాలో నటించారు.