E-Paper
Advertisement

Spirit Movie : ‘స్పిరిట్’ కోసం డైరెక్టర్ మాస్టర్ ప్లాన్..?

Spirit Movie : ‘స్పిరిట్’ కోసం డైరెక్టర్ మాస్టర్ ప్లాన్..?

Spirit Movie : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గత ఏడాది సలార్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు . ఆ తర్వాత ఈ ఏడాది కల్కి అనే ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా వచ్చి మూడు నెలలు అవుతున్న కూడా క్రేజ్ తగ్గలేదు. ఓటిటిలో దూసుకుపోతుంది. ఈ సినిమా తర్వాత మరో నాలుగు పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు . ముందుగా రాజా సాబ్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా తర్వాత యానిమల్ డైరెక్టర్ తో స్పిరిట్ చెయ్యబోతున్నాడు. సందీప్ వంగా సినిమాలు ఎలా ఉంటాయో చూసాము. ప్రభాస్ ను ఈ సినిమాలో ఎలా చూపించబోతున్నాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు . తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘ది రాజా సాబ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రభాస్, ఈ సినిమాను ముగించుకుని తన నెక్స్ట్ మూవీ ‘ఫౌజీ’లో జాయిన్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా తరువాత తన నెక్స్ట్సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే, ‘స్పిరిట్’ కోసం సందీప్ రెడ్డి వంగా ఓ పవర్‌ఫుల్ కథను రాసుకున్నాడట. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇక అందులో ఒకటి పోలీస్ పాత్ర అని చిత్ర వర్గాల్లో టాక్. ఇక ఈ సినిమా లో యాక్షన్ డోస్ రెట్టింపుగా ఉండబోతుందట. కాగా, ఈ సినిమా లో విజయ్ దేవరకొండ, రణ్‌బీర్ కపూర్‌ల కేమియో కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది విన్న డార్లింగ్ ఫ్యాన్స్ మా హీరోను ఎం చేస్తున్నావ్ వంగా అని కామెంట్స్ చేస్తున్నారు.

గత కొన్నిరోజులుగా ఈ మూవీ పై వార్తలు వినిపిస్తున్నాయి. తాను చేసిన సినిమాల హీరోలను ‘స్పిరిట్’లోనూ చూపెట్టాలని సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నాడట. అంతేగాక, ‘స్పిరిట్’లో ఓ స్టార్ హీరోను విలన్ పాత్రలో నటింపజేసేందుకు సందీప్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడట. మొత్తానికి యాక్షన్ డ్రామా కథగా వంగా చూపించనున్నారు. దాంతో ఈ సినిమా పై ఫ్యాన్స్ క్యూరియాసిటీ పెరిగిఉపోతుంది. మొత్తానికి ప్రభాస్ ను సరికొత్తగా ప్రేక్ల్షకులకు చూపించేందుకు డైరెక్టర్ మాస్టర్ ప్లాం వేస్తున్నాడు. మరి ఈ సినిమాలో డార్లింగ్ ఎలా ఉంటాడో చూడాలి. ఈ మూవీ కోసం నిర్మాతలు భారీ బడ్జెట్ ను పెట్టడానికి వెనకాడటం లేదని టాక్ .. ఈ సినిమా తర్వాత సలార్ 2 , కల్కి 2 సీక్వెల్స్ పై ఫోకస్ పెట్టనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఆ తర్వాత రాజమౌళి తో సినిమా చెయ్యబోయితున్నట్లు సమాచారం.. ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ఇప్పటినుంచే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×