BigTV English

Bigg Boss 8 Telugu: ఓజీ టీమ్‌కు ప్రేరణ వెన్నుపోటు, మెహబుబ్‌తో కలిసి మాస్టర్ ప్లాన్.. మణికంఠను ఇంప్రెస్ చేసిన హరితేజ

Bigg Boss 8 Telugu: ఓజీ టీమ్‌కు ప్రేరణ వెన్నుపోటు, మెహబుబ్‌తో కలిసి మాస్టర్ ప్లాన్.. మణికంఠను ఇంప్రెస్ చేసిన హరితేజ

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో ఓవర్ స్మార్ట్ ఫోన్స్ వర్సెస్ ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్ ఆట మొదలయ్యింది. రాయల్స్ టీమ్ అంతా ఓవర్ స్మార్ట్ ఫోన్స్ కాగా ఓజీ టీమ్ అంతా ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్. అలా బిగ్ బాస్ హౌస్ మొత్తం రాయల్స్ ఆధీనంలో ఉండగా.. గార్డెన్ ఏరియా మాత్రం ఓజీ కంట్రోల్‌లో ఉంటుంది. రాయల్స్ అంతా ఓజీ టీమ్‌ను ఒప్పించి లేదా మాయ చేసి ఛార్జింగ్ పెట్టుకోవాలి లేదా సమయానుసారం వారి ఛార్జింగ్ తగ్గిపోతుంది. ఇక ఓజీ టీమ్ అంతా కలిసి గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన కుండలు పగలకుండా కాపాడుకోవాలి. అయితే అవినాష్, మెహబూబ్ ఇప్పటికే సీజన్ 4లో ఈ ఆట ఆడి ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకున్నారు.


కన్నింగ్ ప్రేరణ

టాస్క్ ప్రారంభం కాకముందే ప్రేరణతో డీల్ మాట్లాడుకున్నాడు మెహబూబ్. తనకు ఫుడ్ కావాలన్నా, వాష్‌రూమ్ ఉపయోగించుకోవాలన్నా తాను సాయం చేస్తానని, ఒకవేళ తన టీమ్ వచ్చి ప్రేరణను అటాక్ చేయాలనుకున్నా చేయనివ్వను అని మాటిచ్చాడు. దానికి ప్రేరణ కూడా ఒప్పుకుంది. అప్పటికే తన సొంత టీమ్ అయిన ఓజీపై పగ పెంచేసుకొని దూరంగా ఉంటున్న ప్రేరణ.. సైలెంట్‌గా తనకు వెన్నుపోటు పొడిచింది. అందుకే తన డ్రెస్‌కు ఉన్న ఛార్జింగ్ కేబుల్‌ను తీసేసి మరీ ఎవరికీ తెలియకుండా మెహబూబ్‌కు ఇచ్చింది. తన టీమ్‌మేట్స్ అడిగితే అది ఊడిపోయిందని చెప్పింది. అలా రాయల్స్ టీమ్ అంతా ఛార్జింగ్ పెట్టుకున్నా కూడా అది డ్రెస్‌కు ఉన్నప్పుడు ఛార్జింగ్ పెడితేనే ఛార్జ్ అయినట్టు అని బిగ్ బాస్ వివరించారు.


నయనికి గాయం

ఓజీ టీమ్‌పై దాడి చేసి అయినా ఛార్జింగ్ పొందాలని రాయల్స్ నిర్ణయించుకున్నారు. అందుకే ముందుగా రోహిణి వెళ్లి విష్ణుప్రియా దగ్గర బలవంతంగా ఛార్జింగ్ తీసుకుంది. ఆ తర్వాత యష్మీ దగ్గరకు వెళ్లి నయని పావని కూడా అదే చేయాలనుకుంది. కానీ నిఖిల్ వచ్చి తనను లాగి పక్కన పడేశాడు. అదే క్రమంలో తనకు దెబ్బలు తగలడంతో ఏడ్చింది. ఇక నబీల్‌కు తెలియకుండా తన దగ్గర ఛార్జింగ్ తీసుకున్నాడు అవినాష్. టాస్క్ ప్రారంభమయిన కాసేపటి తర్వాత రాయల్స్ టీమ్ ఛార్జింగ్ తగ్గిపోయింది. అవినాష్, గంగవ్వ తప్పా మిగతా అందరి ఛార్జింగ్ తగ్గిపోయింది. గంగవ్వ అప్పటికే మెగా చీఫ్ కంటెండర్ కావడంతో తన ఛార్జింగ్ తగ్గలేదు.

Also Read: ఎంటర్టైన్మెంట్ హౌస్ ని కాస్త కమ్యూనిటీ హౌస్ గా మార్చేశారు కదరా..!

హరితేజ తిప్పలు

గార్డెన్ ఏరియాలో ఓజీ టీమ్ కాపాడుకోవడానికి నాలుగు కుండలు ఏర్పాటు చేయగా అందులో ఒక్కటి మాత్రమే రాయల్స్ టీమ్ పగలగొట్టింది. మిగతా మూడు కుండలు ఓజీ టీమ్ చేతిలోనే పగిలాయి. ఒక కుండ అయితే పొరపాటున విష్ణుప్రియా చేతిలోనే పగిలింది. హరితేజ.. తన ఛార్జింగ్ పెంచుకోవడం కోసం విష్ణుప్రియాతో డీల్ మాట్లాడుకోవాలని అనుకుంది కానీ కుదరలేదు. ఆ తర్వాత స్మోకింగ్ ఏరియా నుండి లైటర్ ఎత్తుకెళ్లిపోయింది. అయినా లాభం లేకపోవడంతో ఒక హరికథ చెప్పి మణికంఠను ఇంప్రెస్ చేసి ఛార్జింగ్ కొట్టేసింది. దాంతో హరితేజ ఛార్జింగ్ మళ్లీ ఫుల్ అయిపోయింది. ప్రస్తుతం అవినాష్, హరితేజ, గంగవ్వలకు మాత్రమే ఫుల్ ఛార్జింగ్ ఉంది.

Related News

Bigg Boss9 Promo: ఉత్కంఠ రేకెత్తిస్తున్న కెప్టెన్సీ టాస్క్.. వర్షంలో హీట్ పుట్టిస్తూ!

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Big Stories

×