BigTV English
Advertisement

Disaster Laila : ‘ఏ’ సర్టిఫికెటే కొంప ముంచిందా..? కాస్త ఆలోచించాల్సింది విశ్వక్

Disaster Laila : ‘ఏ’ సర్టిఫికెటే కొంప ముంచిందా..? కాస్త ఆలోచించాల్సింది విశ్వక్

Disaster Laila :సాధారణంగా ఏ సినిమా అయినా సరే విడుదలకు ముందు కచ్చితంగా సెన్సార్ పూర్తి చేసుకోవాల్సిందే. ఒక్కొక్కసారి సెన్సార్ ఇచ్చే సర్టిఫికెట్ ని బట్టి ఆ సినిమా రిజల్ట్ ని ముందే పసిగడతారు ఆడియన్స్. ఈ నేపథ్యంలోనే విశ్వక్ సేన్ (Vishwak Sen) తాజాగా నటించిన లైలా (Laila) మూవీకి ఇచ్చిన సర్టిఫికెటే ఇప్పుడు కొంపముంచింది అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడే కాస్త విశ్వక్ ఆలోచించి ఉండి ఉంటే, కచ్చితంగా ఈ సినిమా ఫలితం మరోలా ఉండేదేమో అంటూ తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.


లైలాకి ఏ సర్టిఫికెట్..

అసలు విషయంలోకి వెళ్తే ..విశ్వక్ సేన్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ ఆకాంక్ష శర్మ (Aakanksha Sharma)హీరోయిన్గా నటించిన చిత్రం లైలా. ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటెన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇకపోతే ఈ సినిమా డిజాస్టర్ కావడానికి పలు కారణాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు ఇచ్చిన సర్టిఫికెట్ కూడా ఒక కారణంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చూసిన తర్వాత సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. సెన్సార్ సభ్యుల నియమాల ప్రకారం ఏ సర్టిఫికెట్ జారీ చేస్తే 18 ప్లస్ వాళ్లు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. ఏ సర్టిఫికెట్ అంటే క్రైమ్, థ్రిల్లర్ , క్రిమినల్ తో పాటు అసభ్యకర సన్నివేశాలు ఎక్కువగా ఉండే సినిమాలకు ఈ సర్టిఫికెట్ ను సెన్సార్ సభ్యులు జారీ చేస్తారు.


ఆసక్తి చూపని ఫ్యామిలీ ఆడియన్స్, కిడ్స్..

ఇక ఇందులో లేడీ గెటప్ లో విశ్వక్ సేన్ నటించారు. పైగా కామెడీ తరహాలో ఈ సినిమా తెరకెక్కింది కాబట్టి ఇందులో క్రైమ్, థ్రిల్లర్ , క్రిమినల్ అంశాలు జోడించే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో ఈ సినిమాలో అసభ్యకర సన్నివేశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కేవలం 18 ప్లస్ మాత్రమే చూసేలా సెన్సార్ సభ్యులు ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను చూడడానికి అటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. ముఖ్యంగా పిల్లలు కూడా థియేటర్ గడప తొక్కే అవకాశం లేదు. ఇదే ఈ సినిమాకు మొదటి మైనస్ గా మారిందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.

లైలా సినిమా తారాగణం..

రామ్ నారాయణ్ (Ram Narayan) దర్శకత్వం వహించగా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. విశ్వక్ సేన్ ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. సోనూ అనే మేకప్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ లో విశ్వక్ నటించారు. అలాగే స్టోరీలో భాగంగా శత్రువుల నుండి తప్పించుకోవడానికి లైలా అనే లేడీ గెటప్ కూడా పోషించారు. ఇక వీరితోపాటు వెన్నెల కిషోర్, నాగినీడు, హర్షవర్ధన్, బ్రహ్మాజీ, బబ్లూ పృథ్వీరాజ్ ,అభిమన్యు సింగ్, వినీత్ కుమార్ , రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇకపోతే ఈ చిత్రంలో అభిమన్యు సింగ్ తప్ప మిగతా వారి నటన పేలవంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే విశ్వక్ సేన్ లైలా భారీ డిజాస్టర్ ను చవిచూస్తోందని చెప్పవచ్చు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×