Gaddar Filim Awards : టాలీవుడ్ ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సినిమాల ప్రతిభను గుర్తించి అవార్డులను అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసేంది. అయితే ఎప్పటిలాగే నంది అవార్డులను కాకుండా ఈసారి ప్రముఖ గాయకుడు గద్దర్ పేరిట అవార్డులను ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇప్పటికే 2014లో వచ్చిన సినిమాలకు అవార్డులను అన్ని కేటగిరీల్లో ప్రకటించింది. తాజాగా 2014 జూన్ 2 నుంచి 2023 వరకు సెన్సార్ అయిన సినిమాలలో పదేళ్ల వరకు ఉత్తమ సినిమాల అవార్డులను ప్రకటించారు. ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు, జ్యురీ చైర్మన్ మురళీ మోహన్ కలిసి ఈ అవార్డులను ప్రకటించారు.. బెస్ట్ సినిమాలకు మాత్రమే అవార్డులను ఇవ్వబోతున్నట్లు ముందుగానే ప్రకటించారు. అయితే కొంత ప్రోత్సహ నగదును కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే ఎంత మనీని ఇవ్వబోతున్నారో అన్న దానిపై ఇంకా కొన్ని సందేహాలు వినిపిస్తున్నాయి. తాజాగా అమౌంట్ పై క్లారిటీ వచ్చేసింది. ఎంత ఇస్తున్నారో తెలుసుకుందాం..
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు భారీగా ప్రోత్సాహక నగదు..
*. నంది అవార్డుల కంటే భారీగా ప్రోత్సాహక నగదును తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఏ మూవీకి ఎంతంటే..
*. ఒక్కో ఉత్తమ చిత్రానికి అవార్డుతోపాటు రూ.10 లక్షల ప్రోత్సాహక నగదు
*. ఉత్తమ చిత్రానికి అవార్డు కింద నిర్మాతకు రూ. 10 లక్షలు, దర్శకుడుకి రూ. 5 లక్షల ప్రోత్సాహక బహుమతి
*. వ్యక్తిగత అవార్డుల్లోనూ ఒక్కో అవార్డుకు రూ. 5 నుంచి రూ.3 లక్షల చొప్పున నగదు
*. ప్రత్యేక పురస్కారాల్లో ఒక్కో స్మారక అవార్డు కు రూ.10 లక్షల ప్రోత్సాహక నగదు
*. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల్లో 73 అవార్డులను అందించనున్న ప్రభుత్వం
*. అవార్డుల్లో నగదు బహుమతి కోసం రూ.6 కోట్లు తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది.
*. మొత్తం 11 ఉత్తమ చిత్రాలకు ఒక్కో చిత్రానికి రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహక బహుమతి ఇవ్వనున్నారు.
*. రెండో ఉత్తమ చిత్రాలకు ఒక్కో చిత్రానికి రూ.7 లక్షల చొప్పున ప్రోత్సాహక బహుమతి..
*. మూడో ఉత్తమ చిత్రాలకు ఒక్కో చిత్రానికి రూ.5 లక్షల చొప్పున ప్రోత్సాహక బహుమతి..
*. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల కోసం సుమారు రూ. 25 కోట్లు కేటాయించిన ప్రభుత్వం..
అవార్డులు అందుకోబోతున్న సినిమాలు..
2014 కు గాను బెస్ట్ ఫిల్మ్ రన్ రాజా రన్
సెకండ్ బెస్ట్ పాఠశాల
థర్డ్ బెస్ట్ ఫిల్మ్ అల్లుడు శ్రీను
2015 లో బెస్ట్ ఫిల్మ్ రుద్రమ దేవి
సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె
మూడో బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు
2016లో బెస్ట్ ఫిలిం శతమానం భవతి
సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు
థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్
2017లో బెస్ట్ ఫిలిం బాహుబలి-2
సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా
థర్డ్ బెస్ట్ ఫిలిం ఘాజీ
2018లో బెస్ట్ ఫిలిం మహానటి
సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం
థర్డ్ బెస్ట్ ఫిలిం కేరాఫ్ కంచర్ల పాలెం
2019లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి
సెకండ్ బెస్ట్ ఫిలిం జెర్సీ
థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం
2020లో బెస్ట్ ఫిలిం అలా వైకుఠపురంలో
సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫొటో
థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలోడీస్
2021లో బెస్ట్ ఫిలిం ఆర్ ఆర్ ఆర్
సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ
థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెన
2022లో బెస్ట్ ఫిలిం సీతా రామం
సెకండ్ బెస్ట్ ఫిలిం కార్తికేయ-2
థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్
2023లో బెస్ట్ ఫిలిం బలగం
సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్
థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి
ఇవే కాదు స్పెషల్ జ్యురీలో ఆరు అవార్డులను ప్రకటించారు.
ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్-బాలకృష్ణ
పైడి జైడిరాజ్-అవార్డ్ మణిరత్నం
బిఎన్ రెడ్డి అవార్డ్-సుకుమార్
నాగిరెడ్డి అవార్డు- చక్రపాణి చందర్ రావు
కాంతారావు అవార్డ్-విజయ్ దేవర కొండ
రఘుపతి వెంకయ్య అవార్డ్ ఫిల్మ్ -యండమూరి వీరేద్ర నాథ్
అయితే ఈ అవార్డులను వచ్చినలా జూన్ 14న అందించనున్నారు. హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అవార్డులు వేడుకను నిర్వహించనున్నారు..