Actress Divi Vadthya: బిగ్ బాస్(Bigg Boss) ద్వారా ఫేమస్ అయిన వారిలో దివి వాధ్యా (Divi Vadthya) కూడా ఒకరు. సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన దివికి బిగ్ బాస్ లో అవకాశం రావడంతో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. అలా బిగ్ బాస్(Bigg Boss) తర్వాత దివి వాధ్యా లైఫ్ మొత్తం మారిపోయింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో దివి వాధ్యకి అవకాశాలు వచ్చాయి. అలా దివి వాధ్య నటించిన అతి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప-2’..ఈ సినిమాలో దివి జర్నలిస్టు పాత్రలో కనిపిస్తుందని , పుష్ప-2 ట్రైలర్ రిలీజ్ అయిన సమయంలో రష్మిక మందన్న కంటే ఎక్కువగా దివి వాధ్యనే ఫేమస్ అయింది. కానీ తీరా సినిమా చూస్తే మాత్రం దివివాధ్య కి అన్యాయం జరిగినట్టు అర్థమవుతుంది.
థియేటర్లో సినిమా చూసి షాక్ అయ్యా..
అయితే తాజాగా పుష్ప-2 ( Pushpa-2) సినిమాలో తన సన్నివేశాలను తీసివేయడం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. దివి మాట్లాడుతూ.. “నేను ‘పుష్ప 2’ సినిమా కోసం 26 రోజులు షూటింగ్లో పాల్గొన్నాను. పది రోజులు డబ్బింగ్ చెప్పాను. పేజీలకు పేజీలు డైలాగులు నేర్చుకున్నాను. కానీ ఈ సినిమాలో నా స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉంది. కానీ దీనికి నేనేమీ బాధపడడం లేదు. ఎందుకంటే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేసి తీసేసారు. అలా ఎడిట్ చేసిన సన్నివేశాల్లో నాకు సంబంధించినవి కూడా ఉన్నాయి. అలా ఎడిటింగ్ లో నేను చేసిన సన్నివేశాలు పోయాయి. ఏది ఏమైనప్పటికి అంత పెద్ద హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.అయితే పుష్ప-2 సినిమా ట్రైలర్ లో నా రోల్ ఎక్కువ హైలెట్ అవ్వడంతో ఈ సినిమాకి ఏకంగా 10 మంది ఫ్రెండ్స్ ని వేసుకొని థియేటర్ కి వెళ్లాను. కానీ తీరా సినిమా చూశాక అందులో నాకు సంబంధించిన సన్నివేశాలు చాలా తక్కువగా ఉండడంతో షాక్ అయిపోయాను. అయితే ఎడిటింగ్ లో నా సన్నివేశాలు తీసేసారని నాకు తెలియదు. అంత పెద్ద పాన్ ఇండియా సినిమాలో నేను కనిపించడమే గొప్ప అనుకుంటాను. అలాగే అంత పెద్ద సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఫీల్ అవుతున్నాను.
పుష్ప -3 లో నా రోల్ ఎక్కువే..
అయితే పుష్ప 2 లో నా రోల్ తక్కువగా ఉన్నప్పటికీ పుష్ప-3 (Pushpa-3)లో నా పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని నేను భావిస్తున్నాను” అంటూ దివి వాధ్య రీసెంట్ ఇంటర్వ్యూలో పుష్ప 2 లో తన పాత్ర గురించి స్పందించింది.అలాగే అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ. అల్లు అర్జున్(Allu Arjun) ఎప్పుడు సెట్లో రిహార్సల్స్ చేస్తూనే ఉంటారు.చాలా హార్డ్ వర్కర్.. ఆయన తన పాత్ర బాగా రావడం కోసం ఎంతో కష్టపడతారు. అలాంటి వ్యక్తిని నేను ఇప్పటి వరకు చూడలేదు అంటూ దివి వాధ్య చెప్పుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ దివి మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో 26 రోజులు షూటింగ్ చేసి దివివాధ్య(Divi Vadthya) కి పుష్ప 2 మేకర్స్ అన్యాయం చేశారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.