Waqf bill: ఎట్టకేలకు వల్ఫ్ సవరణ బిల్లుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 14 సవరణలతో బిల్లును ఆమోదం లభించింది. 16 మంది సభ్యులు మార్పులకు మద్దతు ఇచ్చారు. మరో 10 మంది వ్యతిరేకించారు. జేపీసీ నుంచి రూట్ క్లియర్ కావడంతో బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనుంది ఎన్డీయే ప్రభుత్వం.
వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు తెచ్చేందుకు శ్రీకారం చుట్టింది మోదీ ప్రభుత్వం. బోర్డులోని పాలకవర్గాల్లో మరింత జవాబుదారీ తనం పెంచుతూ పలు సవరణలు చేసింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత దాదాపు 44 సవరణలు జరిగాయి. ఈ విషయాన్ని జేపీసీ ఛైర్మన్ జగదాంబిక పాల్ వెల్లడించారు.
కొత్త బిల్లు అమల్లోకి వస్తే జిల్లా కలెక్టర్లు రెడీ చేసిన అంచనా విలువల మేరకు వక్ఫ్ బోర్డులు తమ ఆస్తులను తప్పనసరిగా నమోదు చేయించుకోవాలి. దాదాపు 108 గంటల పాటు 34 సమావేశాలను నిర్వహించిందన్నారు ఛైర్మన్ జగదాంబిక పాల్. ఆరు నెలల వివరణాత్మక చర్చలు జరిగాయి. ఆ తర్వాత సభ్యులందరి నుండి సవరణలు కోరారు.
మెజారిటీ ఓటు ఆధారంగా 14 సవరణలను కమిటీ ఆమోదించింది. ప్రతిపక్షాలు కూడా సవరణలను ప్రతిపాదించినట్టు ఛైర్మన్ మాట. మెజారిటీ ఓటు ద్వారా వక్ఫ్ సవరణలను ఆమోదించినట్లు ధృవీకరించిన జేపీసీ ఛైర్మన్ జగదాంబికా పాల్. దీంతో రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది.
ALSO READ: కుంభమేళా తొక్కిసలాట.. కారణాలు ఇవే..