BigTV English

Divya Bharathi: జీ.వి.ప్రకాష్ తో డేటింగ్.. రూమర్స్ పై స్పందించిన దివ్యభారతి..!

Divya Bharathi: జీ.వి.ప్రకాష్ తో డేటింగ్.. రూమర్స్ పై స్పందించిన దివ్యభారతి..!

Divya Bharathi: ప్రముఖ సంగీత దర్శకులు జీ.వి.ప్రకాష్ (GV.Prakash) గత ఏడాది తన భార్య, ప్రముఖ సింగర్ సైంధవి (Saindhavi) తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో ప్రముఖ హీరోయిన్ దివ్యభారతి (Divya Bharathi) తో ఆయన డేటింగ్ చేస్తున్నారని,ఆమె వల్లే ఇప్పుడు భార్యకు విడాకులు ఇచ్చారు అంటూ చాలామంది విమర్శలు గుప్పించారు. ఇక వార్తలు జోరుగా వైరల్ అవుతున్న నేపథ్యంలో అటు జీవి ప్రకాష్, ఇటు దివ్యభారతి ఇద్దరూ కూడా స్పందించారు. అయినా సరే రూమర్స్ ఆగకపోవడంతో మళ్లీ తన ఇంస్టాగ్రామ్ లో ఒక ఘాటైన పోస్ట్ పెట్టి ఆశ్చర్యపరిచింది దివ్యభారతి. తన పోస్టులో ఇలాంటి పనికిమాలిన రూమర్స్ క్రియేట్ చేసి ఇతరుల జీవితాలతో ఆడుకునే బదులు సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా చేయండి అంటూ కౌంటర్ ఇచ్చింది.


ఏదైనా పనికొచ్చే పని చేయండి.. రూమర్స్ పై కౌంటర్ ఇచ్చిన దివ్యభారతి..

ఇక దివ్యభారతి తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా.. “గత కొద్ది రోజులుగా నాకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తుల కుటుంబ విషయాల్లోకి నన్ను లాగుతూ.. నాపై పూర్తి విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా జీవి ప్రకాష్ ఫ్యామిలీ సమస్యలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. అంతేకాదు మీ అందరికీ మరో క్లారిటీ కూడా ఇస్తున్నాను. నేను ఎప్పటికీ కూడా ఇంకో నటుడితో డేటింగ్ చేయను. అందులోనూ పెళ్లైన వ్యక్తితో అసలు డేటింగ్ చేయను. కాబట్టి ఆధారం లేని ఇలాంటి తప్పుడు రూమర్లు సృష్టించకండి. ఇప్పటివరకు ఈ విషయంలో మౌనంగా ఉన్నాను. కానీ కొద్ది రోజుల నుంచి ఈ రూమర్లు హద్దులు దాటుతున్నాయి. వీటివల్ల నా పేరు కూడా దెబ్బతింటుంది. నిరాధారమైన ఇలాంటి వార్తలు సృష్టించే బదులు ఏదైనా సమాజానికి ఉపయోగపడే పని చేయండి. నా వ్యక్తిగత గోప్యతను దయచేసి గౌరవించండి .ఈ విషయాలపై ఇదే నా మొదటి, చివరి ప్రకటన కూడా..” అంటూ చాలా ఘాటుగా రిప్లై ఇచ్చింది దివ్యభారతి. ఇక ప్రస్తుతం ఈమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Amala Paul: డైరెక్టర్ ను నమ్మి చిక్కుల్లో పడ్డానంటున్న అమలాపాల్.. అసలేమైందంటే..?

ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయితోనే విడాకులు..

జీవి ప్రకాష్, దివ్య భారతి కలసి రెండు సినిమాలు చేశారు. మొదటిగా ‘బ్యాచిలర్’ అనే చిత్రం చేయగా.. ఇది విజయం సాధించింది. అలాగే రీసెంట్గా ‘కింగ్ స్టన్’ అనే సినిమా విడుదలై.. బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించుకుంది.ఇక జీవి ప్రకాష్ విషయానికి వస్తే.. మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూనే వీలు దొరికినప్పుడు హీరోగా కూడా ప్రయత్నం చేస్తున్నారు . తన చిన్ననాటి స్నేహితురాలిని ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. అలాంటిది ఉన్నట్టుండి విడాకులు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు తన మేనమామ , ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ (AR Rahman) విడాకులు ప్రకటించే ఆరు నెలల ముందు ఈయన విడాకులు ప్రకటించడంతో అందరూ పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా జీవి ప్రకాష్ వ్యక్తిగత జీవితంలో ఇలాంటి చేదు వార్తలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇక మొత్తానికి అయితే ఈ వార్తలపై దివ్యభారతి స్పందించి మరీ ఖండించింది. మరి ఇకనైనా ఈ వార్తలు ఆగిపోతాయేమో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×