Empuraan: మోహన్‌లాల్ నటించిన ‘ఎంపురాన్ (లూసిఫర్-2)’ సినిమా ఇటీవల కొన్ని వివాదాలకు గురైంది. సినిమాలో కొన్ని మత పరమైన సెన్సిటివ్ సీన్స్ ఉండటంతో, కొన్ని వర్గాలు సోషల్ మీడియాలో విమర్శలు చేసాయి. ఈ విమర్శలు రోజురోజుకీ పెరుగుతూ ఉండడంతో స్వయంగా మోహన్‌లాల్ బయటకి వచ్చి తన అభిమానులకు క్షమాపణలు తెలియజేశాడు. ఎంపురాన్ సినిమాలో కొన్ని సీన్స్ ప్రేక్షకులకు అసౌకర్యం కలిగించాయని గుర్తించి, వాటిని తొలగిస్తున్నామని మేకర్స్ అనౌన్స్ చేసారు. లేటెస్ట్ గా ఎంపురాన్ సినిమా రీసెన్సార్ అయ్యింది. కొత్త కట్స్ కారణంగా రన్ టైమ్ కూడా రెండు నిమిషాలకి పైగా తగ్గింది. ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చిన ఓపెనింగ్ సీన్ లోనే అత్యధికంగా కట్స్ పడడం విశేషం.
తొలగించిన సన్నివేశాలు:
సీబీఎఫ్‌సీ ఈ మార్పులను అధికారికంగా ఆమోదించింది. తొలగింపుల కారణంగా సినిమా మొత్త నిడివి 177:44 నిమిషాలకు తగ్గింది.
ఈ మార్పుల నేపథ్యంలో, హింసాత్మక దృశ్యాలు, మతపరమైన సున్నివేశాలు, మరియు ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన పదాలు తొలగించారు. ఈ కట్స్ తో కొత్త వర్షన్ థియేటర్స్ లో అవైలబుల్ గా ఉంది. అయితే ఇప్పటికే ఆలస్యం అయ్యి, ఎంపురాన్ సినిమాపై నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయిపొయింది. మేకర్స్ కాస్త ముందే జాగ్రత్త పడి ఉంటే, ఈ కట్స్ ఎదో ముందే వేస్తే అసలు ఎలాంటి సమస్య వచ్చేది కాదు. మరి ఈ కొత్త వర్షన్ ని ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది చూడాలి. కలెక్షన్స్ విషయంలో అయితే ఎంపురాన్ సినిమా 250 కోట్ల క్లబ్ కి చేరువలో ఉంది. ఇది మలయాళం నుంచి వచ్చిన హయ్యెస్ట్ ఓపెనింగ్ గ్రాసర్ అనే చెప్పాలి.