Amala Paul..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అందం , అభినయంతో, టాలెంట్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది అమలాపాల్ (Amalapaul). తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో పలు సినిమాలు వెబ్ సిరీస్ లలో చేస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నిర్మాతగా కూడా పలు ప్రాజెక్టులు చేస్తున్న ఈమె.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో సినిమాల గురించి ఏమీ తెలియదని, ఏ విషయంపై కూడా అవగాహన లేదని తెలిపింది. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. తన కెరీర్ లో తాను ఎదుర్కొన్న ఒడిదుడుకులు, తన వ్యక్తిగత అనుభవాల గురించి అభిమానులతో పంచుకుంది.
ఆ పాత్రే నా కెరియర్ పై చెడు ప్రభావం చూపింది – అమలాపాల్
ముఖ్యంగా కెరియర్ స్టార్టింగ్ లో ఈమె చేసిన ‘సింధు సమవేలి’ తన కెరియర్ తో పాటు వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేసిందని తెలిపింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాలో తండ్రి వయసు ఉన్న మామతో అక్రమ సంబంధం పెట్టుకునే కోడలు పాత్రలో అమలాపాల్ నటించింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక పెద్ద వివాదంగా కూడా మారింది. ఆ వివాదం సమయంలో వచ్చిన వ్యతిరేకతకు తాను ఎంతగానో భయపడ్డానని, ఆ మూవీ చూశాక తన తండ్రి కూడా చాలా బాధపడ్డారని, ఆ సినిమా చేస్తున్నప్పుడు తన వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమేనని, ఇక తనకు ఆ పాత్ర చేయడం వల్ల సమాజంలో ఎలాంటి పేరు వస్తుందో కూడా తను ఆలోచించలేదని తెలిపింది.
ముఖ్యంగా అలాంటి చెడ్డ పాత్రలను ఆడియన్స్ యాక్సెప్ట్ చేయారని, ఆ పాత్ర తన కెరియర్ పై చాలా చెడు ప్రభావాన్ని చూపించిందని సినిమా రిలీజ్ అయ్యాకే అర్థమైంది అంటూ తెలిపింది.
డైరెక్టర్ ని గుడ్డిగా నమ్మడం వల్లే చిక్కుల్లో పడ్డా..
ఇకపోతే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఏమీ తెలియదు కాబట్టే డైరెక్టర్ చెప్పిన విషయాన్ని గుడ్డిగా నమ్మి అతడు చెప్పినట్టు చేశాను. ఇక ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ వల్ల ఆ తర్వాత సినిమా ‘మైనా’ ఓపెనింగ్ ప్రమోషన్స్ కి కూడా నన్ను పిలవలేదు. ముఖ్యంగా ఈ విషయంలో రజనీకాంత్(Rajinikanth ), కమలహాసన్ (Kamal Haasan) నుంచి కూడా నాకు కాల్స్ వచ్చాయి. ఇక ఈ సినిమాలోని పాత్ర నాపై తీసుకొచ్చిన నెగెటివిటీ కారణంగా నేను చెన్నైకి కూడా వెళ్లలేకపోయాను.. అంటూ ఎమోషనల్ అయింది అమలాపాల్. తర్వాత ఎంతో కష్టపడి మంచి పేరు తెచ్చుకొని నటిగా ఎదగాలని ప్రయత్నం చేశానని తెలిపింది. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాని మళ్లీ రీ రిలీజ్ చేయగా ఆ సమయంలో ఆమె స్టార్ డంపై కూడా ఈ ప్రభావం పడిందని, అందుకే నటి ఎప్పుడైనా సరే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చింది అమలాపాల్. ఇకపోతే అమలాపాల్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త అమ్మాయిలకు ఇదొక గుణపాఠం అని.. ఎవరైనా సరే ఒక పాత్రకు అవకాశం ఇస్తున్నారు అంటే.. ఆ పాత్ర వెనుక ఉన్న అసలు ఆంతర్యం తెలుసుకొని, భవిష్యత్తులో ఆ పాత్ర తమ కెరియర్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయాన్ని తెలుసుకొని మరీ ఆ పాత్రలో నటించాలని చెబుతోంది. ఇక ప్రస్తుతం అమలాపాల్ చేసిన ఈ కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.