BigTV English

Divyavani: రాజేంద్రప్రసాద్ తో గొడవ గురించి ఓపెన్ సీక్రెట్స్ బయటపెట్టిన దివ్యవాణి

Divyavani: రాజేంద్రప్రసాద్ తో గొడవ గురించి ఓపెన్ సీక్రెట్స్ బయటపెట్టిన దివ్యవాణి

Divyavani: తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి దివ్యవాణి. పెళ్లికి పుస్తకం సినిమాతో ఆమె ఎంతో పాపులర్ అయ్యారు. ఆ తరువాత ఆమె ఎన్నో సినిమాలలో నటించారు. ఆమె అందం, అభినయం, నటన ప్రేక్షకులను ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈమె అసలు పేరు ఉషారాణి. కన్నడ చిత్ర దర్శకుడు ద్వారకేష్ ఈమె పేరును దివ్యవాణిగా మార్చాడు. ఈమె ఇప్పటికే 40 పైగా సినిమాల్లో నటించింది. రాజేంద్రప్రసాద్ తో వచ్చిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం మూవీ తో పాపులర్ అయ్యారు. తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో రాజేంద్రప్రసాద్ పై ఆరోపణ చేశారు. ఆయన వల్ల కొన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందంటూ ఆమె కామెంట్స్ చేశారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..


ఆయన తో గొడవ అందుకే ..

టాలీవుడ్ సీనియర్ నటి దివ్యవాణి. బాపు గారి పెళ్లి పుస్తకం సీరియల్ తో ఈమె ఎంతో పాపులర్ అయింది.రాజేంద్ర ప్రసాద్ తో తీసిన ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, ఈ రెండు మూవీస్ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచాయి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో రాజేంద్రప్రసాద్ ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. శుభలగ్నం, మిస్టర్ పెళ్ళాం రెండు సినిమాలు మొదట మిమ్మల్ని అనుకొని తరువాత క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటి అని యాంకర్ అడగ్గా.. దివ్యవాణి మాట్లాడుతూ… అప్పుడు,ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో గొడవలు కామన్ గా జరుగుతాయి. బాపు రమణ గారు ఈ అమ్మాయి అయితే బాగుంది అని మిస్టర్ పెళ్ళాం కోసం అన్నారు,ఐతే రాజేంద్రప్రసాద్ గారు కాదు అన్నారు. అంతకుముందు ఆయన నాతో రెండు సినిమాలు చేశారు అయినా నాకన్నా ఆ హీరోయిన్ బాగా చేస్తుందని ఆయన అనుకున్నారు. ఏవో చిన్నచిన్న కారణాలు చెప్పి, రాజేంద్రప్రసాద్ గారు నన్ను వద్దన్నారు. కానీ బాబు గారు ఎంతో ప్రయత్నం చేశారు. ఆమెతో నేను తీసిన సినిమాలు మూడు మూవీస్ సక్సెస్ అయ్యాయి కదా అని బాపుగారు నాతో మూవీ చేద్దాం అనుకున్నారు కానీ, రాజేంద్రప్రసాద్ గారు వద్దనడంతో ఆగిపోవాల్సి వచ్చింది అని ఆమె తెలిపారు. ఇక శుభలగ్నం సినిమాకి ఆమెని క్యారెక్టర్ లో కృష్ణారెడ్డి గారు మొదట నన్ను అనుకొని ఆమనీ కి ఇచ్చారు. కానీ ఇక్కడ విశేషం రెండు సినిమాలు ఆమెనికి వెళ్లడం. రెండు మంచి క్యారెక్టర్స్ 2 అలా వదులుకోవాల్సి వచ్చింది అని ఆమె తెలిపింది.


రీ ఎంట్రీ ..

ఇక దివ్యవాణి కొంతమంది హీరోయిన్స్ అట్రాక్టివ్ గా కనిపించడం కోసం, బాడీ బిల్డప్ చేసుకోవడానికి ఏవో ప్రయత్నాలు చేసేవారు కానీ, అప్పట్లో నేను ప్రతిరోజు స్విమ్మింగ్ డాన్సింగ్ ప్రాక్టీస్ చేసేదాన్ని, మా అమ్మ నాకు మంచి ఆహారాలు అందించింది వాటితోనే నేను ఇంత యాక్టివ్ గా అప్పటినుంచి ఇప్పటిదాకా ఉన్నాను అని చెప్పుకొచ్చారు. కొన్ని రోజులు విరామం తర్వాత ఆమె రాధాగోపాలం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పంచాక్షరి, వీర, మహానటి వంటి సినిమాలలో నటించి మెప్పించారు.

Naveen Chandra: టికెట్ డబ్బులు వాపస్… లెవన్ మూవీకి నవీన్ చంద్ర హామీ

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×