Naveen Chandra: టాలీవుడ్ హీరో నవీన్ చంద్ర తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రం లెవెన్. మే 16న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సుందర్ శ్రీ దర్శకత్వంలో, పనిచేసిన లోకేష్ అజ్లీస్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో శశాంక్, ఆడుకాలం నరేష్, రేయా హరి, అభిరామి, రవివర్మ, కిరీటి కీలకపాత్రలో నటించారు ఈ చిత్రానికి ఇమాన్ సంగీతం అందించారు మే 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తాజాగా ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. అందులో భాగంగా నవీన్ చంద్ర తన సినిమాను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం..
టికెట్ డబ్బులు వాపస్…
నవీన్ చంద్ర మాట్లాడుతూ… ఇంత సంతోషంగా ఈ ఫంక్షన్ జరుగుతుందంటే దానికి కారణం మన ఇండియన్ ఆర్మీ. నిన్న రాత్రి మన రాత్రి ఏం జరిగిందో మనకు తెలియదు. మనం చాలా హాయిగా నిద్రపోయాం కానీ దేవుడు ఆర్మీ వాళ్లకి వాళ్ళ ఫ్యామిలీకి ధైర్యం ఇవ్వాలి. మనమందరం ప్యానిక్ అవ్వకుండా, మన చుట్టూ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేసి గమనిస్తూ ఇంకొకరిని సేవ్ చేసేలా ఉండాలి. మేరా భారత్ మహాన్… ఇక ఈ సినిమా గురించి మాట్లాడాలంటే.. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుంది అని చెప్పారు కాకి పిల్ల కాకికి ముద్దులాగా మా మూవీ టీం బాగుందనుకోవడం కాదు ఈ సినిమాకి సంబంధం లేని వారు కూడా చూసి, బాగుంది అని చెప్పారు. మే 15థ్ న ఫ్రీ ప్రీమియర్ ఏర్పాటు చేశాం, మీకు సినిమా నచ్చకపోతే ఆరోజు చూసి, బయటికి రాగానే మీ టికెట్ ని పెట్టిన డబ్బులు వెనక్కి ఇస్తాను. నవీన్ నీ కధలు ఎప్పుడు బాగుంటాయి నువ్వు చేసే క్యారెక్టర్స్ బాగుంటాయి అని మీరిచ్చే కంప్లిమెంట్స్ బాగుంటుంది. నేను సినిమా బాగుంటుందని గట్టిగా నమ్ముతున్నాను నేను చేసిన ఇంత మంచి గొప్ప యాక్టర్స్ ఇంత మంచి టెక్నీషియన్స్, మంచి ప్రొడక్షన్ హౌస్ మీద నమ్మకం. నాకంటే డే వన్ నుంచి ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మా డైరెక్టర్ కన్నా ప్రొడ్యూసర్ ఎక్కువ కష్టపడ్డారు.మళ్లీ మళ్లీ చెప్తున్నాను ప్రతి ఒక్కరు సినిమా చూసిన తరువాత నచ్చకపోతే మీ డబ్బులు మీకు వాపస్ ఇచ్చేస్తాను మీరు నా ఫేస్ మీదే అడిగి డబ్బులు తీసుకోవచ్చు.అని నవీన్ చంద్ర తెలిపారు.
వీళ్ళందర్నీ నేను ఇలాగే సంపాదించుకున్నాను ..
ఈ కథని మీద ఈ ప్రొడక్షన్ మీద నాకు అంత నమ్మకం ఉంది. నేను ఫస్ట్ కమలహాసన్ గారికి థాంక్స్ చెప్పాలి. ఆయన లాంచ్ చేసిన ట్రైలర్ ని మీరందరూ చూసి ఎంత క్రేజ్ ఇచ్చారు. ధనుష్ గారికి కమలహాసన్ కి సింబు గారికి, నా యాక్టర్ ఫ్రెండ్స్ కి డైరెక్టర్ ఫ్రెండ్స్ కి చాలా థ్యాంక్స్. ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరూ నేను సంపాదించుకున్న వారు ఇక్కడి వాళ్ళందరూ నేను సంపాదించుకున్న వాళ్ళు నా హానస్టితో నేను సంపాదించుకున్నాను. ఇక్కడికి వచ్చిన వారందరూ నా కోసం వచ్చారు. మీడియా వాళ్లందరికీ నిజంగా థాంక్స్ చెప్పాలి. ఇప్పుడే కాదు నా మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన మీడియాకి నేను చాలా రుణపడి ఉంటాను.