BigTV English

Diwali 2024: దీపావళి బరిలో టైర్ -2 హీరోలు.. టఫ్ ఫైట్ షురూ..!

Diwali 2024: దీపావళి బరిలో టైర్ -2 హీరోలు.. టఫ్ ఫైట్ షురూ..!

Diwali 2024 : ఎట్టకేలకు దసరా సినిమాల సందడి ముగిసింది. దాదాపు పది రోజుల పాటు సెలవులు వచ్చాయి. ఈ సెలవులను ఉపయోగించుకోవాలని ఎన్నో చిత్రాలు ప్రయత్నం చేసినా.. ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ముఖ్యంగా ఉన్నంతలో రజనీకాంత్ వేట్టయాన్, గోపీచంద్ విశ్వం చిత్రాలు మాత్రమే పర్వాలేదు అనిపించుకున్నాయి. ఇక చాలా చిత్రాలు డిజాస్టర్ గానే మిగిలాయి. ఇకపోతే దసరా హడావిడి కాస్త ముగియడంతో అప్పుడే దీపావళి హడావిడి కాస్త మొదలైందని చెప్పవచ్చు. అక్టోబర్ 31వ తేదీన దీపావళి పండుగ.. ఇప్పుడు ఈ పండుగను క్యాష్ చేసుకోవడానికి చాలామంది యంగ్ హీరోలు పోటీ పడుతూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా పబ్లిక్ హాలిడే కావడంతో దాదాపు 8 సినిమాలు దీపావళి సందర్భంగా థియేటర్లలోకి రాబోతున్నాయి. మరి ఈ దీపావళి పండుగకు పోటీపడుతున్న చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..


లక్కీ భాస్కర్..

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో నటిస్తున్న చిత్రం లక్కీ భాస్కర్. అక్టోబర్ 30వ తేదీన ప్రీమియర్ తో ఈ సినిమా విడుదల కానుంది.


అపుడో ఇపుడో ఎపుడో..

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న అపుడో ఇపుడో ఎపుడో సినిమా దీపావళి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన విడుదల కాబోతోంది.

జీబ్రా..

సత్యదేవ్ హీరోగా నటిస్తున్న జీబ్రా అక్టోబర్ 31వ తేదీన దీపావళి సందర్భంగా విడుదల కాబోతోంది.

క..

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న క చిత్రం అక్టోబర్ 31వ తేదీన విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.

అమరన్..

తమిళ్ హీరో శివ కార్తికేయన్ తన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన విషయం తెలిసిందే. ఇక ఈయన నటిస్తున్న అమరన్ చిత్రం కూడా దీపావళి 31 వ రోజు విడుదల కాబోతోంది.

బఘీర..

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ ,స్క్రీన్ ప్లే అందించిన బఘీర కూడా అక్టోబర్ 31వ తేదీన విడుదల కాంపుతున్నట్లు తాజాగా చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

బ్రదర్..

మరోవైపు ఈ చిత్రాలకు పోటీగా జయం రవి నటిస్తున్న బ్రదర్ సినిమాతో అక్టోబర్ 31న రాబోతున్నారు.

ఇలా ఇన్ని సినిమాలు ఒకేసారి రావడం వల్ల ఏ సినిమాకి కూడా సరైన ఓపెనింగ్ రాకపోవచ్చు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు కొన్ని ఏరియాలలో థియేటర్లు దొరకడం కూడా కష్టంగానే పరిస్థితి మారిపోయింది. అయినా సరే కొంతమంది నిర్మాతలు అదే రోజు విడుదల కావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే అల్లరి నరేష్ దీపావళి సందర్భంగా విడుదల చేయాలనుకోగా.. ఇంతమంది తమ సినిమాలు విడుదల చేస్తున్న నేపథ్యంలో తన సినిమా బచ్చలమల్లిని నవంబర్ 22వ తేదీకి పోస్ట్ పోన్ చేసుకున్నారు. మొత్తానికైతే ఇంతమంది హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరు విజయాన్ని అందుకుంటారు..? ఎవరు దీపావళి హీరోగా నిలబెడతారు..? ఎవరు పటాస్ లా పేలుతారో? చూడాలి.

Related News

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Big Stories

×