BigTV English
Advertisement

Diwali Films : అమరన్ అంతంత మాత్రమే, దివాలి విన్నర్ డిసైడ్ అయిపోయింది

Diwali Films : అమరన్ అంతంత మాత్రమే, దివాలి విన్నర్ డిసైడ్ అయిపోయింది

Diwali Films : తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఎంతగా ఆదరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషతో సంబంధం లేకుండా మిగతా ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలను కూడా బాగుంటే మంచి కలెక్షన్స్ అందజేస్తారు. అలా ఇతర భాషల నుంచి వచ్చిన ఎన్నో సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పెట్టారు. కాంతారా వంటి సినిమాలు 50 కోట్లకు పైగా తెలుగులోనే వసూలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇక మామూలు సీజన్లో కంటే కూడా ఒక ఫెస్టివల్ సీజన్లో సినిమాకి ఉండే ఆదరణ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇక దీపావళి సందర్భంగా కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విడుదల కానున్నాయి. వీటిలో శివ నటిస్తున్న అమరన్(Amaran), దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లక్కీ భాస్కర్(Lucky Bhasker). కిరణ్ అబ్బవరం నటిస్తున్న క(KA) సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.


సార్ వంటి హిట్ సినిమా తర్వాత లక్కీ భాస్కర్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా అద్భుతంగా చేస్తున్నాడు నిర్మాత నాగ వంశీ. వంశీ నిర్మాతగా వ్యవహరించిన సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది అంటే మినిమం బజ్ క్రియేట్ అయిపోతుంది. ఒకరోజు ముందు నుంచే ప్రీమియర్స్ కూడా వేయడం లాంటివి మొదలుపెడతాడు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇదివరకు ఎప్పుడూ టచ్ చేయని పాయింట్ దీంట్లో డీప్ గా టచ్ చేసారు అంటూ చెబుతూ వస్తున్నారు. దుల్కర్ తెలుగులో చేస్తున్న మూడువ సినిమా ఇది. మామూలుగా దుల్కర్ చాలా కథలని వింటూ ఉంటారు. కానీ ఈ కథను మాత్రం ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే చేయడంతో దీని మీద కూడా అంచనాలు పెరిగిపోయాయి.

అలానే శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న అమరన్ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా ఒక యదార్థ సంఘటన ఆధారం చేసుకుని తీస్తుంది. లేకపోతే కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటిస్తున్న క సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతుంది. షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టి మంచి గుర్తింపు సాధించుకొని రాజా వారు రాణి గారు(Rajavaaru Ranigaaru) సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్నాడు కిరణ్. ఆ తర్వాత రచయితగా ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే సినిమాతో కూడా మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఈ రెండు సినిమాలు హిట్ అవ్వడంతో కిరణ్ కి వరుస అవకాశాలు వచ్చాయి. ఆ తరుణంలో దాదాపు కిరణ్ అన్ని సినిమాలను ఓకే చేశాడు. ఇకపోతే ఆ రెండు సినిమాలు తర్వాత ఇప్పటివరకు కిరణ్ కి సరైన హిట్ సినిమా ఒకటి కూడా పడలేదని చెప్పాలి. అందుకనే కొంతకాలం గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకులు ముందుకి వస్తున్నాడు కిరణ్. ఈ సినిమా మీద మంచి కాన్ఫిడెంట్ గా ఉంది చిత్ర యూనిట్.


ఇకపోతే అమరన్ సినిమా ఊహించిన రేంజ్ లో లేదని అంతంత మాత్రమే అని కోలీవుడ్ ఇండస్ట్రీలో కథనాలు వినిపిస్తున్నాయి. 31న రిలీజ్ అయితే గాని దాని రిజల్ట్ ఏంటో మనం కంప్లీట్ గా డిసైడ్ చేయలేం. ఒకవేళ వీటిలో వినిపిస్తున్న కథనాలు నిజమైతే దీపావళి విన్నర్ గా లక్కీ భాస్కర్ ను చెప్పుకోవచ్చు అనేది కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×