BigTV English

Wallet In Back Pocket : పర్స్ వెనుక జేబులో పెట్టుకుంటున్నారా..!

Wallet In Back Pocket : చాలా మంది పురుషులకి ప్యాంట్ వెనుక జేబులో పర్స్ పెట్టుకునే అలవాటు ఉంటుంది. మీరు తెలుసా ఇది ధూమపానం, మద్యపానం కంటే భయంకరమైన అలవాటు. ఆ పర్సు నిండా డబ్బులు, కార్డులు వంటివి పెడతారు. ఇలా పెట్టుకోవడమే కాకుండా వాటిని జేబులో పెట్టుకొని గంటల పాటు ఉంటారు. మీరు కూడా ఇలానే చేస్తున్నరా..? ఆ అలవాటు మీకు భవిష్యత్తులో నరకం చూపిస్తుందని తెలుసా..? ఈ అలవాటు గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి.

Wallet In Back Pocket : పర్స్ వెనుక జేబులో పెట్టుకుంటున్నారా..!

Wallet In Back Pocket : చాలా మంది పురుషులకి ప్యాంట్ వెనుక జేబులో పర్స్ పెట్టుకునే అలవాటు ఉంటుంది. మీకు తెలుసా ఇది ధూమపానం, మద్యపానం కంటే భయంకరమైన చెడు అలవాటు. ఆ పర్సు నిండా డబ్బులు, కార్డులు వంటివి పెడతారు. ఇలా పెట్టుకోవడమే కాకుండా వాటిని జేబులో పెట్టుకొని గంటలపాటు ఉంటారు. మీరు కూడా ఇలానే చేస్తున్నారా..? ఆ అలవాటు మీకు భవిష్యత్తులో నరకం చూపిస్తుందని తెలుసా..? ఈ అలవాటు గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి.


ప్యాంట్ వెనుక జేబులో పర్స్ లేదా వాలెట్ పెట్టుకోవం వల్ల నడుము నొప్పితోపాటు తొడలు జివ్వుమని లాగుతాయి. పర్స్ పెట్టుకుని ఎక్కువసేపు కూర్చుంటే తుంటి సమతుల్యత దెబ్బతింటుంది. అలానే తుంటి నొప్పితోపాటు తుంటికి తిమ్మిర్లు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పిరుదల షేపు కూడా మారుతున్నట్లు గుర్తించినట్లుగా పేర్కొన్నారు. వెన్నెముక వద్ద ఉండే సయాటిక్ నరాలు నలిగిపోయి నడుము నొప్పి వచ్చే ఛాన్స్ అధికంగా ఉంటుంది.

పర్స్ వెనుక వైపు పెట్టుకుని కూర్చోవడం వల్ల పెల్విస్ (వెన్నెముక చివరి భాగం) మీద ఒత్తిడి పడుతుంది. పెల్విస్‌లోని కుడి వైపు ఎముక మీద ఒత్తిడి పడి ఎడమ వైపుకు వాలుతుంది. దీని వల్ల వెన్నెముక సమతుల్యత దెబ్బతింటుంది. వెన్నెపూసలు గతి తప్పి వంపు తిరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల నడుము నొప్పి సమస్య వస్తుంది. కొందరిలో వెన్నెముకలో చీలిక ఏర్పడే ప్రమాదం కూడా లేకపోలేదు.


పర్స్ వెనుక పెట్టుకోవడం వల్ల కుడి వైపు కండరాల సామర్థ్యం కూడా బాగా తగ్గుతుంది. ఫలితంగా సాక్రోలియక్ జాయింట్‌పై ఒత్తిడి పెరుగి ఎడమ వైపు ఉండే కండరాలు సైతం మరింత పొడవుగా, అసమర్థంగా మారతాయి. ఫలితంగా అక్కడ విపరీతమైన నొప్పి కలుగుతుంది. కుడి వైపు వెన్నెముక స్టెబిలైజర్లు ఎక్కువగా సాగుతాయి. దీని కారణంగా కూర్చొనే భంగిమ కూడా మారుతుంది.

ఈ సమస్యను ‘హిప్ పాకెట్ సిండ్రోమ్’ అని అంటారు. పర్సు వాడతున్న కొన్ని రోజుల వరకు ఈ సమస్య పెద్దగా కనిపించదు. కానీ భవిష్యత్తులో క్రమేనా లక్షణాలు బయటపడతాయి. అప్పటికే మీ వెన్నులో మార్పులు జరిగిపోతాయి. వాలెట్ మీ పిరుదులలోని పిరిఫార్మిస్ కండరాలపై ఒత్తిడి పెట్టడం వల్ల తుంటి (తొడ వెనుక భాగం) నరాల మీద ఒత్తిడి పడుతుంది.

ఒత్తిడితో కాలు నొప్పి, వెన్నులో నొప్పి పెడుతుంది. ఈ నొప్పి వల్ల కూర్చోడానికి, నడవడానికి ఇబ్బందిపడతారు. పర్సు మాత్రమే కాదు, గట్టిగా ఉండే ఏ వస్తువులను బ్యాక్ పాకెట్‌లో పెట్టుకొని కూర్చోకూడదు. చివరికి చిన్న దువ్వెన ఉన్నా అది మీ పిరుదులు, తుంటిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మరచిపోవద్దు.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×