Kubera Pre Release Event: టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి(S.S.Rajamouli) ఒకరు. ఈయన కెరియర్ మొదట్లో సీరియల్స్ కు డైరెక్టర్ గా పనిచేసేవారు. అనంతరం ఈయన దర్శకుడిగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న రాజమౌళి కెరియర్ పరంగా ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోలేదు.. ఇప్పటివరకు ఈయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి.
కుబేర…
రాజమౌళి దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే ఆ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇక ఇటీవల బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్గా గుర్తింపు పొందిన జక్కన్న RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu)తో ఈయన పాన్ వరల్డ్ స్థాయిలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా రాజమౌళి తాజాగా శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో ధనుష్, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన కుబేర సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు(Kubera Pre Release Event) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మొదటి రెమ్యూనరేషన్…
హైదరాబాదులో ఈ వేడుక ఎంతో ఘనంగా జరుగుతో ఈ కార్యక్రమంలో భాగంగా శేఖర్ కమ్ములతో పాటు నాగార్జున రష్మిక ధనుష్ వంటి వారందరూ హాజరై సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి సుమ యాంకర్ గా వ్యవహరించారు. సుమ యాంకరింగ్ అంటే అక్కడ ఎంత సందడి వాతావరణం ఉంటుందో అందరికీ తెలిసి. ఇకపోతే సుమ రాజమౌళి వద్దకు వెళ్లి ఆయన రెమ్యూనరేషన్ (Remuneration)గురించి ప్రశ్నలు వేశారు. మీరు మొదటి తీసుకున్న శాలరీ ఎంత? ఆ శాలరీతో ఏం చేశారు అనే ప్రశ్నలు వేశారు.
50 రూపాయలు..
సుమ ఈ విధమైనటువంటి ప్రశ్నలు అడగడంతో వెంటనే రాజమౌళి సమాధానం చెబుతాను కెరియర్ మొదట్లో అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేశానని తెలిపారు. ఇలా అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేసే సమయంలో తనకు 50 రూపాయలు జీతం ఇచ్చారని, అదే తన తొలి రెమ్యూనరేషన్ అంటూ రాజమౌళి తెలియజేశారు. అయితే ఆ డబ్బుతో ఏం చేశారనే ప్రశ్న ఎదురవడంతో రాజమౌళి తనకు గుర్తు లేదంటూ సమాధానం చెప్పారు. ఇక వెంటనే సుమ ఆ టైంలో రమా గారు మీ దగ్గర లేరు కనుక ఆ డబ్బు మాత్రం ఆవిడకి ఇచ్చి ఉండరు లేండి అంటూ సెటైర్లు పేల్చారు. రాజమౌళి ఫస్ట్ రెమ్యూనరేషన్ 50 రూపాయలని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈయన ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకోవడమే కాకుండా సినిమా లాభాలలో వాటాలు తీసుకుంటున్నారు. ఇలా ఒక్కో సినిమాకు హీరోల రేంజ్ లో 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్న విషయం తెలిసిందే.