BigTV English

Etala: భూలోకంలో నాకు నరకాన్ని చూపించిన వ్యక్తి కేసీఆర్: ఈటల

Etala: భూలోకంలో నాకు నరకాన్ని చూపించిన వ్యక్తి కేసీఆర్: ఈటల

Etala Rajender: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.. తెలంగాణ ఉద్యమకారుడు.. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల ప్రాజెక్టులపై మంచి నాలెడ్డ్ ఉన్న రాజకీయ నాయకుడు. చాలా తెలివిగా సమాధానం చెప్పడంలో ఆయన దిట్ట. అయితే ఇటీవల కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. దాదాపు 45 నిమిషాల పాటు కమిషన్ ఆయనను విచారించింది. ప్రాజెక్ట్ అవసరమైన 19 ప్రశ్నలు లేవనెత్తినట్టు సమాచారం. అయితే.. ఆయన కొన్ని ప్రశ్నలకు తనకు సంబంధం లేదన్నట్టు తప్పించుకున్నాడని టాక్ వినిపిస్తోంది. కమిషన్ ముందు గులాబీ బాస్ కు కొంత పాజిటివ్ గా మాట్టాడినట్టు కూడా తెలుస్తోంది. అలాగే నిధుల విషయంలో మాత్రం అంతా కేసీఆర్, హరీష్ చూసుకున్నారని చెప్పడంతో ఆ ఇద్దరిలో కొంచెం టెన్షన్ మొదలైంది. ఆ తర్వాత ఈ వారం రోజుల గ్యాప్‌లో ఈ అంశానికి సంబంధించి మాట్లాడింది లేదు. అయితే ఈ రోజు ఓ ప్రధాన మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం, ఆ ప్రాజెక్టుతో అసలు రాష్ట్రానికి లాభమా..? నష్టమా..? కేసీఆర్ తో ఆయనకు ప్రస్తుత సన్నిహిత్యం ఎలా ఉంది అనేది క్లియర్ గా చెప్పేశారు..


మేడిగడ్డ కుంగిపోవడంలో నా ప్రమేయం ఉంటే ఏ శిక్షకైనా సిద్ధం అని ఈటల చెబుతున్నారు. ‘కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించే సమయంలో కేసీఆర్ తో కలిసి మహారాష్ట్రతో చర్చల్లో నేనూ పాల్గొన్నది నిజం. బరాజ్ ఎత్తు 152 మీటర్లు పెంచడానికి అప్పటి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఒప్పుకోలేదు. ఎత్తు తగ్గించుకుంటే సరిపడా నీరు దొరకదనే రీ డీజైన్ చేయాల్సి వచ్చింది. చర్చోపచర్చల తర్వాత మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణానికి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వ్యయం, డిజైన్ టెండర్లు, కాంట్రాక్ట్ లలో నాకేం సంబంధ లేదు. కాళేశ్వరంపై ప్రతీ చిన్న అంశం నాటి కేబినెట్ లో చర్చించాం. ప్రతి అంశాన్ని కేబినెట్ ముందు పెట్టాలని కేసీఆర్ చెప్పేవారు. సబ్ కమిటీ సూచనలు, నిర్ణయాల ప్రకారమే కాళేశ్వరం నిర్మాణం జరిగింది. ఇప్పుడు మంత్రి తుమ్మల ఎందుకు మాట మార్చారో తెలియదు’ అని ఈటల చెప్పుకొచ్చారు.

ALSO READ: ఏమయ్యా ఈటల.. కేసీఆర్‌ను ఇలా ఇరికించావేంటయ్యా


‘కాళేశ్వరం వల్ల వాగులు పొంగిపొర్లుతున్నయ్. కాళేశ్వరం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఎండాకాలంలోనూ చెరువులు నిండినయ్. మహబూబ్‌నగర్ జిల్లాలోనూ ఎండాకాలంలో నీళ్లు కనిపించాయ్. కరెంట్ బిల్లు సంగతి పక్కనపెడితే.. కాళేశ్వరంతో రైతులకు ఎంతో మేలు జరిగింది. ఇది ముమ్మాటికీ వాస్తవం. కాంగ్రెస్ వచ్చాక రైతులు మళ్లీ ఏడుస్తున్నారు. కాళేశ్వరంపై వివాదం చేయకుండా వాడుకుంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాళేశ్వరం వల్ల తెలంగాణకు లాభమే జరిగింది.. ఎలాంటి నష్టం చేకూరలేదు. ప్రాజెక్టులో నచ్చిన వారికి కాంట్రాక్టులు ఇచ్చారేమో నాకు తెలీదు. వంద శాతం కాళేశ్వరం రాష్ట్రానికి ఉపయోగ కరం. ఎస్సారెస్పీకి వంద శాతం ఆయకట్టు వచ్చిందంటే కారణం కాళేశ్వరమే’ అని ఈటల తన ఓపీనియన్ చెప్పారు.

ALSO READ: ప్రభాకర్ రావు అరెస్ట్ తప్పదా?

‘ఏ చిన్న అంశం కూడా కేబినెట్ ఆమోదం లేకుండా జరగలేదు. నాటి కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా.. జరిగిన విషయాలే చెబుతున్నా. కాళేశ్వరం, తన బ్రెయిన్ చైల్డ్ అని కేసీఆరే చెప్పారు. అప్పుడు నా లీడర్ కేసీఆర్. అందుకే ఆ నిర్ణయాలను ఆమోదించా. నీటి లభ్యతను బట్టి ప్రాజెక్ట్ డిజైన్ మారింది. కేసీఆర్, హరీష్, నేను కమిషన్ ముందు ఒక్కటే చెప్పామనడం కరెక్ట్ కాదు. ప్రాజెక్ట్ ఒక్కటే అయినప్పుడు డాక్యుమెంట్స్ కూడా ఒక్కటే ఉంటాయ్. రాజకీయంగా కేసీఆర్ ను బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉంటా. కాళేశ్వరంపై సమగ్రమైన విచారణ చేయాలని కమిషన్ ను కోరాను. కాళేశ్వరం తెలంగాణ పొలాలకు నీళ్లు ఇవ్వడానికి కట్టిందే’ అని ఆయన చెప్పారు.

‘కాళేశ్వరం వచ్చాక ఉత్తర తెలంగాణకు నీళ్లు వచ్చిన మాట వాస్తవం. కాళేశ్వరం తర్వాత రైతుల కళ్లలో ఆనంద భాష్పాలు చూశాను. ప్రజలకు అప్పీలు చేస్తున్నా.. కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదు. లక్ష కోట్ల ప్రాజెక్టు అంటే ఎన్నో టన్నెల్స్, రిజర్వాయర్లు, బంకర్లు, బరాజ్‌లు. మేడిగడ్డ ఒక్కటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకోవద్దు. కుంగిన పిల్లర్లు బాగు చేయకుండా రైతుల నోట్లో మట్టి కొట్టొద్దు. మేడిగడ్డను రిపేర్ చేయించి.. రైతులకు భరోసా కల్పించాలని కోరుతున్నా. ప్రాజెక్టును, రైతులకు నీళ్లు ఇవ్వడాన్ని, చివరకు ఎంక్వైరీ కమిటీని కూడా సపోర్ట్ చేశా. కేసీఆర్‌కు సపోర్టు చేస్తున్నానడం కరెక్ట్ కాదు. కాళేశ్వరం విషయంలో చేసినదాన్ని ఒప్పుకోవడంలో భయం లేదు. ఇప్పటికీ.. ఎప్పటికీ కేసీఆర్‌ను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తా. కేసీఆర్‌తో తప్ప ఆ ఇంట్లో అందరితో మంచి సత్సంబంధాలే ఉన్నాయి. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్నది గాలి ముచ్చట అని అన్నారు.’ అని ఈటల అన్నారు.

‘బీజేపీలో కంఫర్ట్ గానే ఉన్నాను. జాతీయ పార్టీలో వైరుధ్యాలు, ఆధిపత్యాలు కామన్ గా ఉంటాయ్. 99 శాతం బీజేపీ నేతలతో.. కార్యకర్తలతో కలిసే ఉన్నాను. నాకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారనేది అనుమానమే. భవిష్యత్తులో దక్షిణాదిన కూడా జెండా ఎగరేస్తాం. నేను బీజేపీ నాయకుడ్ని.. నాకు ఇంకేం పదవీ అవసరం లేదు. ప్రజలు అనుకుంటే నాకు పదవి వస్తుంది. హైకమాండ్ ఇస్తోంది. బీసీల విషయంలో బీజేపీ కమిట్‌మెంట్‌పై అనుమానం అక్కర్లేదు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన పార్టీ బీజేపీ. బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన పార్టీ బీజేపీ.నాకు అన్ని పార్టీల్లోనూ ఫ్రెండ్స్ ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో మిత్రులున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా నాకు మంచి మిత్రుడే.. భూలోకంలో నాకు నరకాన్ని చూపించిన వ్యక్తి కేసీఆర్. వాళ్ల ఇంట్లో ఆయనతో తప్ప అందరితో మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. సిద్ధాంతపరంగానే విభేదాలు.. ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు.. ప్రజలకు మంచి చేయడంలో అన్ని పార్టీలు ఒక్కటిగా ఉండాలి. మంచి సాంప్రదాయాన్ని కేసీఆర్ తుంగలో తొక్కారు’ అని ఈటల చెప్పారు.

Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×