OTT Movie : కన్నౌజ్‌లో నివసించే సహిల్ కౌశల్ (ఆశుతోష్ రాణా), సంగీతా కౌశల్ (షీబా చడ్డా) అనే దంపతుల జీవితంలో గొడవలు రొటీన్ గా జరుగుతుంటాయి. ఒక సుగంధ ద్రవ్యాల ఫ్యాక్టరీలో సహిల్ ఉద్యోగం చేస్తుంటాడు. వీళ్ళ కొడుకు యుగ్ నోయిడాలో పనిచేస్తూ, హోళీ సందర్భంగా ఇంటికి వస్తాడు. తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవ పడుతుండటంతో, విసిగిపోయి ఒక షాకింగ్ సలహా ఇస్తాడు. ఉంటే సంతోషంగా ఉండమని, లేకపోతే విడిపోవాలని చెప్తాడు. ఆశ్చర్యకరంగా కౌశల్ దంపతులు ఈ సలహాను సీరియస్‌గా తీసుకుని, విడాకుల కోసం దరఖాస్తు చేస్తారు. యుగ్ తన తల్లిదండ్రుల విడాకులను ఆపగలడా? కౌశల్ కుటుంబం తమ బంధాలను తిరిగి నిలుపు కోగలదా ? ఈ మూవీ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసు కుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
ఈ కథ కన్నౌజ్‌లోని కౌశల్ కుటుంబం చుట్టూ తిరుగుతుంది. సహిల్ కౌశల్ ఒక సుగంధ ద్రవ్యాల ఫ్యాక్టరీలో అకౌంటెంట్, తన కవ్వాలీ కలను పెళ్ళి తరువాత త్యాగం చేసినందుకు ఎప్పుడూ బాధపడుతుంటాడు. అయితే ఇతని భార్య సంగీతా, సుగంధ ద్రవ్యాల తయారీ హాబీలో సంతృప్తి పొందుతుంది. అయితే వీళ్ళు చిన్న చిన్న వాటికే ఎప్పుడూ గొడవలు పడుతుంటారు. వాళ్ళ కొడుకు యుగ్, నోయిడాలో వాన్ గో అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేస్తూ, తాను పెరిగిన గ్రామీణ వాతావరణాన్ని తక్కువ చేసి చూస్తుంటాడు. తల్లిదండ్రులు “అప్‌డేట్” కావాలని కోరుకుంటాడు. హోళీ సందర్భంగా ఇంటికి వచ్చినప్పుడు, తల్లిదండ్రుల గొడవలతో విసిగిపోయిన యుగ్, వాళ్ళు విడిపోవాలని సలహా ఇస్తాడు. యుగ్ సోదరి రీత్ కూడా కుటుంబ డైనమిక్స్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
అయితే ఆశ్చర్యకరంగా, సహిల్, సంగీతా ఈ సలహాను సీరియస్‌గా తీసుకుని విడాకుల దిశగా అడుగులు వేస్తారు. ఇది యుగ్ జీవితంలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. మరో వైపు కియారా బన్సాల్ అనే అమ్మాయితో యుగ్ లవ్ ట్రాక్ నడుపుతుంటాడు. ఆమె తల్లి దండ్రులు కూడా విడిపోయి ఉండటంతో, ఒక సంప్రదాయ కుటుంబ విలువలు ఉన్న ఇంటికి కోడాలుగా వెళ్ళాలని కోరుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న యుగ్ తన పేరెంట్స్ ను మళ్ళీ కలపాలని అనుకుంటాడు. చివరికి సహిల్, సంగీతా నిజంగా విడాకులు తీసుకుంటారా ? యుగ్ తన సలహా వల్ల సృష్టించిన గందరగోళాన్ని ఎలా సరిదిద్దుతాడు ? కియారాతో అతని ప్రేమ నిలబడుతుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : మొగుడు పోయిన దుఃఖంలో తల్లి … బాయ్ ఫ్రెండ్ ని ఏసేసె కూతురు … ట్విస్టులతో మెంటలెక్కించే సినిమా
ఏ ఓటీటీలో ఉందంటే
ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు (Kaushaljis vs Kaushal).2025 లో వచ్చిన ఈ సినిమాకు సీమా దేశాయ్ దర్శకత్వం వహించారు. జియో స్టూడియోస్, మెర్రీ గో రౌండ్ స్టూడియోస్, ముంబై టాకీజ్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో ఆశుతోష్ రాణా, షీబా చడ్డా, పవైల్ గులాటీ, ఈషా తల్వార్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఫిబ్రవరి 21 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 135 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.6/10 రేటింగ్ ఉంది.