Ind vs Aus 3rd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంటులో ( Border-Gavaskar Trophy 2024/25) భాగంగా… ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డపై టీమ్ ఇండియా ( Team India) పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంటులో ( Border-Gavaskar Trophy 2024/25) లో భాగంగా ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడవ టెస్ట్ జరుగుతోంది. అయితే ఈ మూడవ టెస్టులో… టీమిండియా ( Team India) ఆల్ అవుట్ అయింది. తన మొదటి ఇన్నింగ్స్ లో… 78.5 ఓవర్లు ఆడిన టీమిండియా ( Team India) …260 పరుగులకు కుప్ప కూలింది.
Also Read: Kohli – Gambhir: కోహ్లీ, గంభీర్ పై సెలబ్రేషన్స్… టీమిండియా ఫ్యాన్స్ సీరియస్?
ఐదవ రోజు ఆట ప్రారంభమైన మొదటి 30 నిమిషాల లోపే టీమిండియా ( Team India) ఆల్ అవుట్ కావడం జరిగింది. నాలుగో రోజు పూర్తయ్య సమయానికి 9 వికెట్లు పడిపోయాయి. అయితే ఇవాల్టి చివరి రోజున… అద్భుతంగా ఆడిన ఆకాష్ దీప్ ( akash deep)…హెడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 44 బంతుల్లో 31 పరుగులు చేసిన ఆకాష్ దీప్ ( akash deep) రెండు ఫోర్లు అలాగే ఒక సిక్స్ బాదేశాడు.
కానీ ఉదయం పిచ్ చాలా హార్డ్ గా ఉండటంతో… టీమిండియా ( Team India) తొందరగానే ఆల్ అవుట్ కావడం జరిగింది. దీంతో ఆస్ట్రేలియా కంటే… 185 పరుగులు వెనుకబడి ఉంది టీమిండియా. అయితే ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ ప్రారంభం చేసే కంటే ముందే… గబ్బాలో మళ్లీ వర్షం షురూ అయింది. ఈ తరుణంలోనే మళ్లీ మ్యాచ్ ఆగిపోయింది.
ఇక టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో… కె ఎల్ రాహుల్ 84 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఆ తర్వాత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా… 74 పరుగులతో… టీమిండియాను ఆదుకున్నాడు. ఇటు చివర్ లో ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ 31 పరుగులతో రాణించాడు. ఆస్ట్రేలియాకు కొరకరాని కొయ్యగా మారాడు ఆకాష్ దీప్. కానీ ఇవాళ ఉదయమే స్టంట్ అవుట్ కావడం జరిగింది. దీంతో టీం ఇండియా ఇన్నింగ్స్ ముగిసింది.
Also Read: Prithvi Shaw: సాయి బాబా.. నేను ఇంకేం చేయాలి.. పృథ్వి షా ఎమోషనల్ పోస్ట్!
అయితే ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు… గబ్బాలో వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాతావరణ శాఖ కూడా ఇదే సూచనలు చేస్తోంది. వర్షం పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో… ఆస్ట్రేలియా ఫాస్ట్ గా ఆడే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 185 పరుగులు వాళ్ల చేతిలో ఉన్నాయి. మరో 100 పరుగులు చేసి ఇండియాకు బ్యాటింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. వర్షం పడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో పిచ్ కూడా బౌలర్లకు అనుకూలిస్తుంది.ఈ గ్యాప్ లోనే టీమ్ ఇండియాను ఆల్ అవుట్ చేయాలని…. ఆస్ట్రేలియా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. మరి ఆస్ట్రేలియా వేసిన స్కెచ్ కు టీమిండియా ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందో చూడాలి. ఇక వర్షం భారీగా పడితే… మ్యాచ్ డ్రా అయ్యే ఛాన్సులు ఎక్కువ.