BigTV English

Suriya Sister : సూర్య చెల్లెలుకు, అలియాభట్ కు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

Suriya Sister : సూర్య చెల్లెలుకు, అలియాభట్ కు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

Suriya Sister : తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో కూడా ఈయన సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఆయనకు తెలుగులో ఇక్కడ మంచి మార్కెట్ ఏర్పడింది. అయితే సూర్య తమ్ముడు కార్తీ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ సూర్య చెల్లెలు కూడా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది.. గాయనిగా ఎన్నో సినిమాలకు తన గొంతును అందించింది. అవును మీరు విన్నది. ఆమె ఒక సింగర్. ఆమె ఎన్నో అద్భుతమైన పాటలను పాటలను పాడారు.. ఏ హీరోల సినిమాలకు ఆమె పాటలు పాడారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


సూర్య చెల్లెలు ఏం చేస్తుందో తెలుసా..?

కొలీవుడ్ లో స్టార్ హీరోగా రానిస్తూ బిజీగా ఉన్న స్టార్ హీరో సూర్య ఫ్యామిలీ లోని అందరు కూడా సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్ళే కావడం విశేషం. సూర్య తండ్రి శివకుమార్ 1980 -90 దశకంలో తమిళంలో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.. ఆయన ఎన్నో సినిమాలను చేశారు. అలాగే సూర్య తమిళ్, తెలుగులో వరుసగా సినిమాలను చేశాడు. అలాగే శివకుమార్ బాటలోనే ఆయన తనయులు సూర్య, కార్తి యాక్టింగ్‌వైపు అడుగులు వేశారు. ప్రస్తుతం సూర్య పాన్ ఇండియన్ హీరోగా ఇమేజ్‌ను సొంతం చేసుకోగా…డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు కార్తీ.. ఇక ఈయనా భార్య జ్యోతిక కూడా ఒక హీరోయిన్ మన సంగతి తెలిసిందే. వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.


ఇకపోతే శివకుమార్‌కు సూర్య, కార్తి మాత్రమే కాకుండా బృంద అనే కూతురు కూడా ఉంది. అన్నయ్యల బాటలోనే బృంద కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. యాక్టర్‌గా కాదు సింగర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.. కానీ ఆమెకు అదృష్టం లేదేమో అన్నల మాదిరిగా సక్సెస్ కాలేక పోయింది. దాంతో ఆమె పేరు కూడా పెద్దగా ఎవరికి తెలియదు.అందుకే ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. కామెడీ థ్రిల్లర్ మూవీ మిస్టర్ చంద్రమౌళితో సింగర్‌గా మారింది బృంద. టైటిల్ సాంగ్‌ను ఆలపించింది. ఆ తర్వాత రాక్షసి, జాక్‌పాట్‌, పొన్‌మగల్ వంధాల్‌తో పాటు ఓ2 సినిమాల్లో పాటలు పాడింది.. ఆమె కేవలం ఐదు పాటలు మాత్రమే పాడింది. అందులో మూడు సినిమాలు జ్యోతిక నటించినవే కావడం గమనార్హం. జ్యోతిక హీరోయిన్‌గా నటించిన పొన్‌మగల్ వంధాల్‌లో బృంద శివకుమార్ పాడిన వా చెల్లామ్ పాట పెద్ద హిట్టయింది..

Also Read : పెళ్లి వద్దు.. కానీ అది లేకుంటే కష్టమే..

అలియాభట్ కు, బృంద కు సంబంధం…

బాలీవుడ్ హీరో రణ్‌భీర్‌కపూర్‌, అలియా భట్ జంటగా నటించిన బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర తమిళ వెర్షన్‌కు బృంద శివకుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. ఈ మూవీలో అలియాభట్ పాత్రకు తమిళంలో బృంద డబ్బింగ్ చెప్పారు.. ఇక్కడ కూడా ఈమె చెప్పినా ఒకే ఒక్క డబ్బింగ్ సినిమా ఇదే.. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తమిళంలో పలు అవకాశాలు వచ్చినా కుటుంబ బాధ్యతల కారణంగా ఎక్కువగా సినిమాలు చేయలేకపోయింది. ఇక కుటుంబ ఒత్తిడి వల్ల ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. ప్రస్తుతం సినిమాలకీ దూరంగా ఉన్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×