BigTV English

OTT Movie : రహస్య గదిలో అంతు చిక్కని మిస్టరీ …అక్కడ మొదటి రాత్రి జరిగితే ప్రాణాలు పోతాయి…

OTT Movie : రహస్య గదిలో అంతు చిక్కని మిస్టరీ …అక్కడ మొదటి రాత్రి జరిగితే ప్రాణాలు పోతాయి…

OTT Movie : సినిమాలు, సీరియల్స్ తో బిజీ అయిన మన ప్రేక్షకులు, ఇప్పుడు వెబ్ సిరీస్ లకు అలవాటు పడిపోయారు. సెన్సార్ నిబంధనలు కూడా లేని ఈ వెబ్ సిరీస్ లు ఓటిటి ప్లాట్ ఫామ్ లో హల్చల్ చేస్తున్నాయి. అన్ని భాషలలో మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో బెంగాల్ నుంచి కూడా మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోపోయే వెబ్ సిరీస్ లో కొంతమంది పాము కరిచి చనిపోతూ ఉంటారు. ఈ మిస్టరీ చుట్టూ వెబ్ సిరీస్ స్టోరీ నడుస్తుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


రెండు ఓటీటీ లలో స్ట్రీమింగ్

ఈ బెంగాలీ వెబ్ సిరీస్ పేరు ‘బిషూరి’ (Bishohori). ఈ వెబ్ సిరీస్ కి శ్రీజిత్ రాయ్ దర్శకత్వం వహించారు. తరతరాల నుంచి మిస్టరీగా ఉండే ఒక ఇంట్లో పాము కరిచి మనుషులు చనిపోతూ ఉంటారు. సస్పెన్స్ తో ఈ వెబ్ సిరీస్ పిచ్చెక్కిస్తుంది. ఈ వెబ్ సిరీస్ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video), (hoichoi) లలో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

200 సంవత్సరాల క్రితం ఒక కొత్త జంట ఫస్ట్ నైట్ జరుపుకుంటూ ఉంటుంది. అయితే ఒక పాము భర్తను కాటు వేయడంతో అతను అక్కడే చనిపోతాడు. మొదటి రాత్రే ఆఖరి రాత్రి అవుతుంది. అలా మూవీ ప్రజెంట్ కు వస్తుంది. ఇప్పుడు అదే ఇంట్లో కార్తీక్, దుర్గ పెళ్లి జరుగుతుంది. ఈ జంటతో పాటు బంధువులు అంతా అక్కడికి వస్తారు. ఎందుకంటే ఆ ఇంటిని అమ్మేసి వెళ్ళిపోవాలనుకుంటారు. అయితే ఆ ఇంట్లో అంతా బాగానే ఉంటుంది. ఒక గదిని మాత్రం తరాల నుంచి క్లోజ్ చేసి ఉంటుంది. ఆ ఊరిలో తరాలుగా  జరుపుకునే ఒక పండుగ వస్తుంది. అక్కడ ఆ ప్రజలు ఆ పండుగని ఏడు రోజులు జాతరగా నిర్వహిస్తారు. ఆ సమయంలోనే పూజారి ఆ ఇంట్లో పూజలు కూడా చేస్తుంటాడు. పూజారి పెళ్లికూతురు దుర్గతో, పూజలు పవిత్రంగా చేయాలని, అలా చేయనందునే ఒకప్పుడు ఈ ఇంట్లో మరణాలు సంభవించాయని చెప్తాడు. ఈ క్రమంలో ఆ ఇంటిని కొనడానికి ఇద్దరు మనుషులు వస్తారు. ఇల్లంతా చూస్తూ మూసి ఉన్న గది దగ్గరికి వెళ్తారు. అక్కడ పాము వీళ్ళ మీదకి రావడంతో, దానిని చంపేస్తారు.

ఆ తర్వాత ఆ ఇంట్లో ఉన్న అమ్మవారి విగ్రహం రంగులు మారుతూ ఉంటుంది. పాము చనిపోవడంతోనే అమ్మవారికి కోపం వచ్చిందని భయపడుతుంటారు. ఇంతలోనే పూజారి కూడా అమ్మవారిని చూస్తూ రక్తం కక్కుకుని చనిపోతాడు. ఇంటిని కొనడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఒక ప్రమాదం జరుగుతుంది. ఎలాగైనా పూజ నిర్వహించి వెళ్ళాలనుకుంటారు అక్కడ ఉన్నవాళ్లు. ఇంట్లో ఉన్న రహస్యం బయటకు తీయాలనుకుంటుంది కొత్తగా వచ్చిన కోడలు. ఆ ఊరిలో ఒక స్వామి ఇంట్లో ఏడు రోజులు మరణాలు సంభవిస్తాయని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ విషయం విని అక్కడ ఉన్న వాళ్ళంతా భయపడతారు. చివరికి ఆ ఇంట్లో మరణాలు సంభవిస్తాయా? కోడలు రహస్యం బయటికి తీస్తుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ ను చూడండి.

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×