BigTV English

Actor Ravi Prakash: నటుడు రవి ప్రకాష్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశాడో తెలుసా..?

Actor Ravi Prakash: నటుడు రవి ప్రకాష్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశాడో తెలుసా..?

Actor Ravi Prakas: టాలీవుడ్ లో ఎంతో మంది నటీనటులు ఉన్నారు. అందులో కొంత మందికి హీరో, హీరోయిన్లకు ఉన్న క్రేజ్ ఉంటుంది. అలాంటి నటులు కొంతమంది మాత్రమే ఉంటారు. వీరికి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంటుంది. ఒక్క సినిమాలో ఒకే క్యారక్టర్ మంచి క్రేజ్ ను సంపాదించుకుంటే ఆ తర్వాత వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అలాంటి టాలెంట్ ఉన్న గొప్ప నటులు మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అందులో ఒకరు నటుడు ప్రకాష్.. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో నటించాడు. నెగిటివ్ రోల్స్ మరియు పోలీస్ పాత్రలలో రవి ప్రకాష్ ఎక్కువగా కనిపిస్తారు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రలలో నటించిన రవి ప్రకాష్ డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యారట.. ఈయన యాక్టర్ గా ఎలా అయ్యాడో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


నటుడు రవి ప్రకాష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పటివరకు దాదాపు 200 కు పైగా చిత్రాలలో నటించారు. రవి ప్రకాష్ అసలు పేరు దుగ్గిరాల రవి. మొదట ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన శుభవేళ అనే చిత్రంతో హీరో గా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించాడు రవి ప్రకాష్. అలా ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అయ్యాడు. పోలీస్ పాత్రల్లో ఎక్కువగా నటించి మెప్పించాడు. ఇకపోతేపోలీస్ ఆఫీసర్ పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. అయితే రవి ప్రకాష్ సినిమాలలోకి ఏ విధంగా వచ్చాడు? రవి ప్రకాష్ పర్సనల్ లైఫ్ గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

రవి ప్రకాష్ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ లో జన్మించారు. తండ్రి జిల్లా కోర్టులో పనిచేసేవారు. ఆ తర్వాత విశాఖపట్నంలోనే వ్యాపారస్తుడిగా స్థిరపడ్డారు. ఈయన పీజీ వరకు డిగ్రీ వరకు విద్యాభాసం చేశారు. మాస్కోలో ఎంబిబిఎస్ చేశానని వెల్లడించారు. ఆ తర్వాత హైదరాబాద్ లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేశారని తెలిపారు. కాగా కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహంతో అనుకోకుండా సినిమాలలోకి వచ్చానని వెల్లడించారు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ తో భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. శుభవేళ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన వేదం సినిమాతో నటుడిగా తనకు మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత వందల సినిమాల్లో నటించాడు. ఇప్పటికి వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఈరోజు మధ్య స్పెషల్ రోల్ చేస్తూ ఇండస్ట్రీలో బిజీగా రానిస్తున్నాడు.


ఇటీవల కోబలి అనే సినిమాలో నటించాడు. భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండటంతో పాటు పగా  ప్రతీకారం తీర్చు కునే పవర్ ఫుల్ పాత్రలో నటించాడు. ఆ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయ్యింది. ఇప్పటికి కూడా ఈ మూవీ సక్సెస్ టాక్ తో రన్ అవుతుంది. ప్రస్తుతం ఓ నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. త్వరలోనే ఆ మూవీలను అనౌన్స్ చేస్తున్నాడు.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×