Babu Mohan: ప్రముఖ సినీ నటులు బాబు మోహన్ (Babu Mohan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో.. విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్న ఈయన.. అటు రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి, మంచి పేరు అందుకున్నారు. ఇక ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా.. అడపాదడపా రాజకీయాలలో కనిపిస్తున్న బాబు మోహన్.. తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పద్మ అవార్డు తనకు రాకుండా రాజకీయం చేశారని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు పద్మ అవార్డుల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి పద్మ అవార్డ్స్ పై బాబు మోహన్ చేసిన కామెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
పద్మ అవార్డ్స్ రాకుండా రాజకీయం చేశారు – బాబు మోహన్
ఇంటర్వ్యూలో భాగంగా పద్మ అవార్డ్స్ రాకుండా రాజకీయం చేస్తున్నారు అని చెప్పిన బాబు మోహన్ మాట్లాడుతూ.. “నాకు పద్మ అవార్డులు ఎప్పుడో రావాల్సి ఉంది. ముఖ్యంగా నాతో పాటు పనిచేసిన నా సన్నిహితులకు దాదాపు 20 సంవత్సరాల క్రితమే పద్మ అవార్డులు లభించాయి. కానీ దీంట్లో కొంత రాజకీయం జరిగింది. వాస్తవానికి పద్మ అవార్డు రాలేదని ఎప్పుడు బాధ లేదు. కానీ ఎందుకూ పనికిరాని బుర్రకథ చెప్పే వాళ్లకు , చెట్టు కింద ఉండి వాయిద్యం వాయించుకునే వాళ్లకు పద్మ అవార్డులు ఇస్తున్నారు. కానీ ఇంత రంజింపచేసిన మాలాంటి వాళ్ళు మాత్రం వీరికి కనపడడం లేదా? అనే ఆవేదన ఎప్పుడు ఉంటుంది. అయితే మరి వాళ్ళు ఎలా అవార్డు ఇస్తున్నారో వాళ్లకే తెలియాలి. పద్మ అవార్డ్స్ కూడా స్టార్స్ కి, స్టార్ లాంటి వాళ్లకు ఇవ్వాలి. అలాంటి వాళ్ళకి కాకుండా రాజకీయం చేస్తున్నారు. నిజానికి నేను విమర్శించట్లేదు.. అలాగని అవమానించట్లేదు.. కానీ పద్మా అవార్డులకు ఒక విలువ ఇచ్చి, విలువైన వాళ్లకు మాత్రమే ఇవ్వాలని కోరుకుంటున్నాను”. అంటూ బాబు మోహన్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.
బాబు మోహన్ సన్నిహితులకు పద్మ అవార్డ్స్..
ఇకపోతే బాబు మోహన్ అనగానే వెంటనే మరో విలక్షణ నటులు కోటా శ్రీనివాసరావు (Kota Srinivas Rao) గుర్తుకొస్తారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ లేకుండా అప్పట్లో సినిమాలు ఉండేవి కాదు. అంతలా స్టార్ హీరోల సినిమాలలో తమకంటూ ఒక మార్కు క్రియేట్ చేసుకున్న వీరు.. నిజ జీవితంలో కూడా మంచి సన్నిహితులన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇద్దరూ తమ నటనతో ఆకట్టుకున్నారు. కానీ కోటా శ్రీనివాసరావుకు 2015లో పద్మశ్రీ అవార్డు లభించింది. అలాగే బ్రహ్మానందం (Brahmanandam) కి కూడా 2009లోనే పద్మశ్రీ అవార్డు లభించింది. అయితే ఈ విషయంలో బ్రహ్మానందం కూడా బాబు మోహన్ కు అవార్డు రాలేదని బాధపడ్డారట. ఇక ఇలా తనతో పాటు నటించిన నటీనటులందరికీ అవార్డు వచ్చినప్పుడు తనకెందుకు రాలేదు అని బాబు మోహన్ బాధపడ్డారు. ప్రస్తుతం బాబు మోహన్ షేర్ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక బాబు మోహన్ విషయానికి వస్తే ఒకప్పుడు పదుల సంఖ్యలో సినిమాలు చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. స్టార్ హీరోయిన్ సౌందర్య తో పాటు డ్యూయెట్ సాంగ్ చేసి ఆకట్టుకున్నారు.
Madhavi Latha:సినీ నటిపై కేసు ఫైల్… రివేంజ్ తీర్చుకున్న పొలిటీషియన్