BigTV English

Devara: దేవర సినిమాను మిస్ చేసుకున్న లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా?

Devara: దేవర సినిమాను మిస్ చేసుకున్న లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా?

Devara: ప్రస్తుతం సినీ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న దేవర.. ఈ సినిమా మేనియా కొనసాగుతుంది.. మరో రెండు రోజుల్లో సినిమా రాబోతుంది. తమ అభిమాన నటుడు సినిమా వస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అప్పుడే హంగామా మొదలైంది. ఈ సినిమా రిలీజ్ డేట్ చాలా సార్లు మార్చుతూ వచ్చారు. ఫైనల్‌గా సెప్టెంబర్ 27 న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ కొరటాలా శివ దర్శకత్వం వహించగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. అయితే మొదటగా ఈమెను అనుకోలేదట.. ప్రస్తుతం స్టార్ ఇమేజ్ తో వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ ను సంప్రదించారట.. ఆమె నో చెప్పడంతో జాన్వీ వద్దకు వెళ్లిందని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..


మామూలుగా ఓ ఇండస్ట్రీలో ఒక హీరో అనుకోని మరో హీరోకు ఛాన్స్ ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం.. కానీ హీరోయిన్లు దగ్గరకు వచ్చేసరికి అలా జరగడం చాలా తక్కువ. అయితే ఇప్పుడు మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతున్న దేవర సినిమాకు ముందుగా జాన్వీ పాపను అనుకోలేదట.. ఆ ఆఫర్ మరో హీరోయిన్ కి వచ్చిందట. కానీ ఆ హీరోయిన్ రిజెక్ట్ చేయడంతో ఈ చాన్స్ జాన్వీ కపూర్ కి వచ్చినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో? అనే ఆలోచనలో ఉన్నారా? అవును అండి ఆమె.. పుష్ప సినిమా తో పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ ను అందుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. అయితే ఆ మధ్య కాలంలో కొరటాల శివ,ఎన్టీఆర్ కాంబోలో సినిమా రాబోతుంది అంటే రష్మిక పేరే మీడియాలో వైరల్ అయింది..

Do you know who is the lucky heroine who missed the movie Devara?
Do you know who is the lucky heroine who missed the movie Devara?

ఆమె తప్పుకోవడంతో ఆ ప్లేసుకోకి రష్మిక మందన్నాకు బదులుగా జాన్వీ పేరు వినిపించింది. కొరటాల, ఎన్టీఆర్ కాంబోలో సినిమా అంటే అంచనాలు ఓ రేంజులో ఉంటాయి. అలాంటి సినిమాను ఎందుకు రిజెక్ట్ చేసిందో అని ఆమె ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. రష్మికకు బాలీవుడ్ లో వరుస సినిమాలు ఉన్నాయి. అలాగే టాలీవుడ్లో కూడా సినిమాలతో తీరిక లేకపోవంతోనే ఈ సినిమాకు నో చెప్పిందట. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో పక్కన అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా సరే ఓకే చెప్తుంది. కానీ ఈ హీరోయిన్ మాత్రం ఆచార్య సినిమా డిజాస్టర్ అయింది అనే ఒకే ఒక్క కారణంతో దేవర మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందోనని భయపడి ఈ మూవీని మిస్ చేసుకుందట. ఆదాంతో ఆ ఛాన్స్ జాన్వీ పాపకు వెళ్లింది.. ఈ అమ్మడుకు ఇది మొదటి సినిమా మరి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఇక ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు చెయ్యనున్నారు.. జాన్వీ కపూర్ మాత్రం వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా ఉంది..


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×