BigTV English

Olympic Medal: ఒలింపిక్‌ మెడల్‌ని పట్టుకునే అర్హత హీరోకి లేదంటూ నెటిజన్స్‌ ఫైర్

Olympic Medal: ఒలింపిక్‌ మెడల్‌ని పట్టుకునే అర్హత హీరోకి లేదంటూ నెటిజన్స్‌ ఫైర్

Netizens Fire That The Hero Does Not Deserve To Hold An Olympic Medal:బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే తన ధృఢమైన శరీరాకృతి అమ్మాయిల మనసును దోచుకునేలా ఉంటుంది. ఇక జాన్ అబ్రహం భారత్‌కి చెందిన మోడల్, నటుడు, నిర్మాత కూడా. ఆయన 2014 ఏడాదిలో విక్కీ డోనార్ మూవీకి గాను జాతీయ అవార్డును అందుకుని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే.. జాన్ అబ్రహంకి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఫొటో చూసిన వారంతా జాన్ అబ్రహంపై ఫైర్ అవుతున్నారు. అంతేకాదు ఆ మెడల్‌ని తాకే అర్హత తనకు లేదంటూ నెటిజన్లు గరం గరం అవుతున్నారు. ఇంతకీ ఏంటీ ఆ మెడల్, ఎందుకు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారో తెలియాలంటే పుల్ డీటెయిల్స్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సి్ందే..


ఇక అసలు డీటెయిల్స్‌లోకి వెళితే.. పారిస్ ఒలింపిక్స్‌ 2024లో భారత్‌కి చెందిన షూటర్ మను బాకర్ అధ్భుతమైన ప్రతిభను కనబరిచి సంచలనం సృష్టించింది. అంతేకాదు భారత క్రీడల విభాగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన మైలురాయిని సుస్థిరం చేసుకుంది. పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ క్రీడల విభాగంలో మనుబాకర్ ఏకంగా రెండు పతకాలను కైవసం చేసుకుంది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రెండుసార్లు కాంస్య పతకాన్ని భారత్‌కి అందించింది. అయితే ఈ విశ్వ క్రీడల్లో హ్యాట్రిక్ మెడల్స్ కొట్టే ఛాన్స్ మనుకు దక్కి్ంది. ఈ ఈవెంట్‌లో టాప్ ఫామ్‌లో ఉన్న షూటర్ తృటిలో 25 మీటర్ల పిస్తోల్ ఈవెంట్‌లో తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. దీంతో రెండు పతకాలతోనే తృప్తి పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఇది పక్కన పెడితే రెండు పతకాలతో పాటు ఎన్నో రికార్డులను కూడా తన పేరిట సువర్ణ అక్షరాలతో లిఖించుకొని భారత ఖ్యాతిని విశ్వనికి పరిచయం చేసింది.

Also Read: వినేశ్ ఫొగాట్, రెజ్లింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి.. అధికారులు ఏం చేశారు ?


ఇక ఒలింపిక్స్‌లో గెలుపొందిన మను సొంత గడ్డకు తిరిగి వచ్చింది. బుధవారం ఉదయం కోచ్ జస్పాల్ రాణాతో కలిసి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకి చేరుకుంది. దీంతో భారత్‌కి చెందిన అభిమానులు, భారత ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. అయితే నేరుగా మను బాకర్ ఇంటికి వెళ్లిన బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఆమెకు పుష్పగుచ్ఛంతో బెస్ట్ విషెస్ తెలిపాడు. అంతేకాదు తనను కలిసిన ఫొటోలు సోషల్‌మీడియా ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలో మను సాధించిన మెడల్‌ని పట్టుకోవడంతో సోషల్‌మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఆ మెడల్‌ని తాకే అర్హత లేదంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

అంతేకాదు సున్నితంగా మై డియర్ జాన్ ఒలింపిక్స్ పతకం సాధించి భారత్‌కి వచ్చిన మనుతో ఫొటో దిగడం ఓకే బట్ ఆ మెడల్‌ని మీరు తాకడం ఏం బాగోలేదంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాదు తనకు సంబంధించిన పతకాన్ని మీరెందుకు తాకుతున్నారంటూ నెటిజన్స్‌ రకరకాల కామెంట్లతో తనని దారుణంగా తిట్టిన తిట్టు తిట్టకుండా ట్రోల్స్ చేయడంతో ఈ కామెంట్లు కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×