Film industry: సాధారణంగా మనిషిని పోలిన మనిషి ఏడుగురు ఉంటారని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఆ ఏడుగురు ఉంటారో లేదో తెలియదు కానీ మనకు మాత్రం ఒకే పోలికతో కలిగిన వేరువేరు వ్యక్తులు ఇద్దరు లేదా ముగ్గురు తారసపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే అలా పోలికలు ఉన్న వారిని ఎక్కడో వెతుక్కోవాల్సిన పని లేకుండా.. సినిమా ఇండస్ట్రీలోనే ఒకరిని పోలిన మరొకరు మనకు తారసపడతారు. పైగా వారందరూ సక్సెస్ అయిన వారే. అయితే వీరిని చూసిన ప్రతిసారి వీరు సిబ్లింగ్స్ ఏమో అనిపిస్తుంది కానీ వారు మాత్రం వేరువేరు..అలా ఇండస్ట్రీలో ఒకే పోలికతో.. చూడగానే సిబ్లింగ్స్ (తోబుట్టువులు) ఏమో అనిపించే సెలబ్రిటీస్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
ధనుష్ – ప్రదీప్ రంగనాథన్..
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ (Dhanush ) ఏ రేంజ్ లో పేరు సొంతం చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఆయన పోలికలతోనే ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan)కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ధనుష్ ఎలా అయితే డైరెక్టర్గా, హీరోగా పేరు సొంతం చేసుకున్నారో.. ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ కూడా మొదటి సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రదీప్ చేసింది రెండు మూడు సినిమాలు అయినా తనకంటూ ఒక ఇమేజ్ దక్కించుకున్నారు. ఇక వీరిద్దరిని చూస్తే నిజంగా అన్నదమ్ములేమో అనిపిస్తుంది.
లావణ్య త్రిపాఠి – శ్రీదేవి..
తాజాగా ‘కోర్ట్’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ అయిపోయింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శ్రీదేవి (Sridevi). ఇంస్టాగ్రామ్ ద్వారా రీల్స్ చేస్తూ.. దర్శకుడు కంట్లో పడిన ఈమె అలా కోర్ట్ సినిమాలో జాబిలి పాత్రలో అవకాశాన్ని దక్కించుకొని, ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఈమెను చూస్తే మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya tripathi) గుర్తుకొస్తుంది. మొదట్లో శ్రీదేవిని చూసిన తర్వాత లావణ్య చెల్లెలు ఏమో అనుకున్నారు. అంతలా వీరిద్దరూ ఒకే పోలికలతో కనిపించి ఆకట్టుకున్నారు.
నజ్రియా నజీమ్ – వర్షా బొల్లమ్మ..
మలయాళం ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ (nazriya Nazim), యంగ్ బ్యూటీ వర్షా బొల్లమ్మ(Varsha Bollamma) కూడా ఒకే పోలికలతో కనిపిస్తారు. వీరిద్దరూ కూడా ఎవరికివారు తమకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు.
జూ.ఎన్టీఆర్ – ప్రముఖ క్రికెటర్ రోహిత్ శర్మ..
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohith Sharma), యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఇద్దరూ కూడా ఒకే పోలికలతో కనిపిస్తూ ఉంటారు. రోహిత్ శర్మ క్రికెట్లో దిగ్గజం కాగా.. ఎన్టీఆర్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ఒక సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన ఎన్టీఆర్ ఇప్పుడు అన్ని భాషలలో కూడా నటిస్తూ మంచి పేరు సొంతం చేసుకున్నారు.
వీరితో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు ఇలా ఒకేలాగా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు.