Ram Charan : మెగా పవర్ స్టార్, గ్లోబల్ రామ్ చరణ్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలు అయన చేతిలో ఉండగా మూడో మూవీని అనౌన్స్ చేశారు. అయితే మెగా స్టార్ చిరు ఫ్యామిలీ అంటే ఒక గౌరవం ఉంటుంది. మెగా సామ్రాజ్యన్ని నిర్మించారు. ఇక ఆయన కొడుకుగా రామ్ చరణ్ కూడా సినిమాలతో మంచి పేరు తెచ్చుకోవాలని అనుకుంటాడు. అయితే మొదట్లో రామ్ చరణ్ సినిమాల్లోకి రావడం చిరుకు అస్సలు ఇష్టం లేదట. కాని అందరి మాటను కాదనలేక హీరోను చేశాడు. అదే ఆయనకు బాధగా ఉంటుందట. రామ్ చరణ్ ను బాగా చదివించాలి అనుకున్నాడు.. అసలు రామ్ చరణ్ పై చిరంజీవి కోరిక వేరే ఉందట అదేంటో తెలుసుకుందాం..
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోస్ పరిస్థితి ఎలా ఉన్నా గానీ, ఆయన వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తనయుడు రామ్ చరణ్ కెరీర్ మాత్రం మెరుపు వేగంతో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. చిరుత మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ తర్వాత మగధీర మూవీతో భారీ సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. తనదైన స్టైల్ లో కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ తన నటన పరంగా ప్రపంచ వ్యాప్తంగా అందరి ప్రశంసలను అందుకున్నారు.. అయితే చిరు ఇలా హీరోగా చూడాలని ఎప్పుడు అనుకోలేదట ఆయన కోరిక చదువుల్లో రానియ్యాలని అనుకున్నాడు. కాని అది తీరకుండానే పోయిందని చాలా సందర్భాల్లో చెప్పాడు..
చిరంజీవికి తన తనయుడు రామ్ చరణ్ ని హీరోగా చూడడం ఇష్టం లేదట. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవనే విషయం చిరంజీవికి బాగా తెలిసిన విషయం. ఆయన కెరీర్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మెగాస్టార్ రేంజ్ కు చేరుకున్నారు. ఇండస్ట్రీలో ఎప్పుడు ఒకరిని తొక్కుకుంటూ పైకి ఎదగాలని అనుకుంటారు. అలాంటి పరిస్థితి రామ్ చరకు కు రావొద్దని అనుకోని డాక్టర్ ను చేద్దామని అనుకున్నాడట.. ఇక చిరంజీవి చేసేదేమిలేక క్రమంగా తన ఆలోచనల నుంచి బయటకు వచ్చారట. అంతేకాకుండా అదే టైంలో రామ్ చరణ్ నేను హీరో అవుతాను అనే తన అభిప్రాయాన్ని వెల్లడిచేశారు. రామ్ చరణ్ ఇష్టాన్ని కాదనలేక ఒప్పుకున్నాడు. అందుకే ఇప్పుడు హీరోగా, గ్లోబల్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం తమిళ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత బుచ్చి బాబుతో ఒక మూవీ చేస్తున్నాడు. దాని తర్వాత సుకుమార్ తో ఒక మూవీ చేస్తున్నాడు.. అటు చిరంజీవి వశిష్ఠ దర్శకత్వం లో విశ్వంభర మూవీ చేస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో మూవీ రిలీజ్ కాబోతుంది.