OTT Movie : థియేటర్లలో వచ్చే సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయినా గాని పెద్ద సక్సెస్ అందుకోవు. అవే సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లో మంచి టాక్ తెచ్చుకుంటాయి. అటువంటి మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
యూట్యూబ్
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు ‘రజినిగంధ‘ (Rajnigandha). ఈ మూవీలో కుటుంబం కోసం తండ్రి గల్ఫ్ కు వెళ్లడంతో, ఇక్కడ ఉన్న ఫ్యామిలీ ఫేస్ చేసే సమస్యల చుట్టూ మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ మూవీ యూట్యూబ్ (Youtube) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
మునీర్ తన భార్య శబ్నం కూతురు గుడియాతో కలసి జీవిస్తూ ఉంటాడు. ఇతడు చిరు ఉద్యోగి కావడంతో ఇంటికని పోషించడానికి కష్టమవుతూ ఉంటుంది. ఒకరోజు ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బులు ఉండవు. అప్పుడు ఇంటి ఓనర్ గల్ఫ్ కి వెళ్తే డబ్బులు బాగా సంపాదించవచ్చని మునీర్ కి చెప్తాడు. ఈ క్రమంలో మునీర్ గల్ఫ్ కి వెళ్ళిపోతాడు. అయితే నాలుగు నెలలు అయినాగాని మునీర్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఈ క్రమంలో భార్య శబ్నం ఆర్థిక పరిస్థితి మరింత క్షీణిస్తుంది. ఆ తర్వాత మునీర్ గల్ఫ్ లో వేరొక పెళ్లి చేసుకుని వెళ్లిపోయాడని తెలుస్తుంది. శబ్నం బతుకుతెరువు కోసం వ్యభిచారం చేస్తూ ఉంటుంది. అయినాగాని తన భర్త వస్తాడని ఎదురుచూస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె అనారోగ్యం పాలవుతుంది. కూతురు కాస్త వయసు వచ్చేసరికి ఆమె చనిపోతుంది. కూతురు గుడియాకి బతుకు తెరువు తెలియక తన తల్లి వృత్తినే ఎంచుకుంటుంది. ఏ ఫీలింగ్స్ లేకుండా తన జీవితాన్ని వచ్చి పోయే వాళ్లతో శరీరాన్ని అమ్ముకుంటూ కాలం గడిపేస్తూ ఉంటుంది. ఆమెకు ఒక అబ్బాయి డైలీ కస్టమర్ ఉంటాడు. అయితే ఆ అబ్బాయి పెళ్లి చేసుకోమని అడుగుతాడు. పెళ్లి నా వంటికి పడదని, కస్టమర్లను సప్లై చేయమని అడుగుతుంది. అలా సాగుతున్న క్రమంలో 15 సంవత్సరాల తర్వాత తండ్రి దుబాయ్ నుంచి తిరిగి వస్తాడు. నిజానికి దుబాయిలో అతడు వేరొక పెళ్లి చేసుకొని ఉండడు. అతని మీద అనవసరంగా యజమాని కేసు పెట్టి జైలుకు వెళ్లేలా చేస్తాడు. కోర్టు 15 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తుంది.
చివరి రోజుల్లో మునీర్ భార్య పిల్లలతో ఆనందంగా గడపడానికి వస్తాడు. వాళ్లు అక్కడ లేకపోవడంతో తెలిసిన వాళ్ళను అడిగి తన భార్య చనిపోయిందని తెలుసుకుంటాడు. కూతురు కోసం వెళ్లగా ఆమె ఒక కస్టమర్ తో ఆ పనిలో ఉంటుంది. తండ్రిని చూసి కూతురు కస్టమర్ అనుకుంటుంది. అయితే నేను కస్టమర్ కాదని, నీ తండ్రి మునీర్ అని ఆమెతో చెప్తాడు. తన తల్లి చావుకు కారణం నువ్వే అంటూ అతని తిడుతూ ఉంటుందిగుడియా. తండ్రి తనతో రమ్మని ఆమెను వేడుకుంటాడు. అతను ఎందుకు దుబాయ్ నుంచి రాలేకపోయాడో వివరిస్తాడు. అప్పుడు ఆమె 15 రోజులు నాకు కస్టమర్లను సప్లై చేస్తే నీతో వస్తానని చెప్తుంది. అప్పుడు తండ్రి భార్య సమాధి దగ్గరికి వెళ్లి ఏడుస్తాడు. కూతురు తన దగ్గర ఉండాలంటే ఆ పని చేయడానికి సిద్ధపడతాడు తండ్రి. 15 రోజులు ఆమె చెప్పినట్టుగానే కస్టమర్లను తీసుకువస్తాడు. ఆ తర్వాత తనతో రమ్మని చెప్తాడు తండ్రి. అందుకు ఆమె నేను వచ్చే సమస్య లేదని తిరగబడుతుంది. అక్కడే ఒక మూల కూర్చుని ఆలోచిస్తుండగా, ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డ వ్యక్తి గొంతు నులిమి చంపడానికి ప్రయత్నిస్తాడు. అక్కడికి తండ్రి వచ్చి ఆ వ్యక్తిని హెచ్చరిస్తాడు. అతను తనకు హెచ్ఐవి వచ్చిందని దానికి కారణం గుడియా అని మునీర్ కి చెప్తాడు. గుడియా కావాలని ఇలా చేస్తుందని ఇంకా ఎంతమందికి ఈ వ్యాధిని అంటిస్తుందో అంటూ ఏడుచుకుంటూ వెళ్లిపోతాడు. ఆ తర్వాత తండ్రి ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. తండ్రి తీసుకున్న నిర్ణయం ఏమిటి? కూతురు ఈ వృత్తిని ఆపేస్తుందా? వీళ్ళిద్దరూ చివరికి ఏమవుతారు? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.