Manchu Vishnu:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్ గా మారిన అంశం సంధ్యా థియేటర్ ఘటన. అల్లు అర్జున్ (Allu Arjun)హీరోగా నటించిన పుష్ప 2(Pushpa 2) బెనిఫిట్ షో చూడడానికి వెళ్ళిన రేవతి (39) అక్కడికక్కడే మరణించింది. ఆమె కొడుకు శ్రీ తేజ్ (9) కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టలేని స్థితిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు..ఈ బాలుడు కోలుకోవడానికి ఇంకా రెండు నెలల సమయం పడుతుందని వైద్యులు చెప్పినట్టు, బాలుడి తండ్రి వివరించారు. ఇకపోతే ఈ విషయంపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తున్న విషయం తెలిసిందే. ఎవరికి తోచినట్టు వారు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ను ఈ విషయంపై అరెస్టు చేయడం సరికాదు అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే, మరి కొంతమంది ప్రభుత్వ పనితీరును తప్పుపడుతున్నట్లు సమాచారం.
మా సభ్యులకు మంచు విష్ణు ప్రకటన..
ఈ నేపథ్యంలోనే మా అసోసియేషన్ సభ్యులను అలెర్ట్ చేయడానికి ఒక ప్రకటన విడుదల చేశారు ‘మా'(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu). ఇకపోతే మంచు విష్ణు విడుదల చేసిన ప్రకటన చూస్తూ ఉంటే తోటి నటుడైన అల్లు అర్జున్ కి అన్యాయం చేస్తున్నాడేమో అంటూ నెటిజన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ మంచు విష్ణు విడుదల చేసిన ప్రకటనలో ఏముంది?అనే విషయానికొస్తే..”ప్రభుత్వాల మద్దతుతోనే సినీ పరిశ్రమ ఎదిగింది. హైదరాబాదులో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడడానికి కారణం అప్పటి సీఎం చెన్నారెడ్డి(CM Chenna Reddy)ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. ప్రతి ప్రభుత్వంతో సినీ పరిశ్రమ సత్సంబంధాలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో మా సభ్యులను విన్నవించుకుంటున్నాను. దయచేసి సున్నితమైన విషయాలపైన మా సభ్యులు అసలు స్పందించకండి. సభ్యులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పకపోవడమే మంచిది. ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మధ్యలో మనం స్పందించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ముఖ్యంగా ఇలాంటి అంశాల పైన స్పందించడం వల్ల సంబంధిత వ్యక్తులకు కూడా నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి మా సభ్యులకు ఐకమత్యం ఎంతో అవసరం..అంటూ తన అభిప్రాయంగా చెబుతూ ఒక ప్రకటన విడుదల చేశారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు.
మంచు విష్ణు పై బన్నీ ఫ్యాన్స్ ఫైర్..
ఇకపోతే మంచు విష్ణు షేర్ చేసిన ప్రకటన వైరల్ అవ్వడంతో.. అల్లు అర్జున్ అభిమానులు మంచు విష్ణు పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తోటి నటుడు కష్టాల్లో ఉన్నాడని తెలిసి కూడా సహాయం చేయొద్దని చెప్పడం నీలాంటి వాళ్లకే సాధ్యం అంటూ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు కుటుంబ గొడవలను కూడా బయటకి తీస్తూ ఇంకొంతమంది నెటిజన్స్ మంచు విష్ణు పై కామెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. తోటి నటుడికి కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడడం పోయి.. ఇలాంటి విషయాలలో జోక్యం చేసుకోవద్దని చెప్పడం ఏమాత్రం సమంజసం కాదు అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు
మరి కొంతమంది నెటిజన్స్ మాత్రం ఒక అడుగు ముందుకేసి స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నారు కాబట్టే .. మీ కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు ఏ ఒక్క సెలబ్రిటీ ఆదుకోవడానికి ముందుకు రాలేదు అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏదిఏమైనా ఈ ప్రకటన కారణంగా మంచు విష్ణు వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు.