Anupama Parameswaran: ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకొని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న మలయాళ ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. అందులో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కూడా ఒకరు. అనుపమ తెలుగులో అడుగుపెట్టకముందే.. తనను ‘ప్రేమమ్’ అనే మలయాళ సినిమాలో చూసి చాలామంది తెలుగు ప్రేక్షకులు తనకు ఫిదా అయ్యారు. ప్రస్తుతం తను తెలుగు, మలయాళంతో పాటు తమిళంలో కూడా ఛాన్సులు కొట్టేస్తూ బిజీ అయిపోయింది. ఇదే సమయంలో ఒక ప్రముఖ మ్యాగజిన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో మలయాళ సినిమాను టాలీవుడ్‌తో పోలుస్తూ మాట్లాడడం ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
జుట్టు వల్లే సమస్యలు
ఒక ప్రముఖ మ్యాగజిన్ కోసం జరిగిన ఫోటోషూట్‌లో పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది అనుపమ పరమేశ్వరన్. అనుపమ యాక్టింగ్ మాత్రమే కాదు.. తన జుట్టు అంటే కూడా చాలామందికి ఇష్టమే. చిన్నప్పుడు ఆ జుట్టు వల్లే తను చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ‘చిన్నప్పుడు నా స్నేహితులు నా జుట్టులో పెన్ క్యాప్స్ లాంటివి దాచేవారు. నన్ను రకరకాల పేర్లతో పిలుస్తూ వెక్కిరించేవారు. అది భరించలేక నేను నా జుట్టుకు చాలా నూనె పెట్టుకొని గట్టిగా ముడివేసుకునేదాన్ని. దానివల్ల నాకు తలనొప్పి కూడా వచ్చేది. కానీ వయసు పెరుగుతున్నకొద్దీ నా జుట్టును యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాను’ అని తెలిపింది.
Also Read: ‘ఎల్లమ్మ’కు హీరోయిన్ దొరికేసింది.. పక్కా హైబ్రిడ్ పిల్లనే పట్టారు
అదే భయం
తన సినిమాల సెలక్షన్ గురించి కూడా అనుపమ పరమేశ్వరన్ మాట్లాడింది. ‘ఒక కథ ఎంపిక చేయడమనేది నా దృష్టిలో చాలా కష్టమైన విషయం. పేపర్ మీద రాసుందే తెరకెక్కుతుందనే నమ్మకం లేదు. ఒక్కొక్కసారి సగం షూటింగ్ అయిపోయిన తర్వాత ఇది వర్కవుట్ అవ్వడం లేదని అర్థం చేసుకుంటాను. నేను సైన్ చేసినదానికి, జరుగుతున్నదానికి తేడా ఉందని గ్రహిస్తాను. అయినా కూడా వదిలేయకుండా, నా వందశాతం ఇవ్వాలని నన్ను నేను మోటివేట్ చేసుకుంటాను. విమర్శలను యాక్సెప్ట్ చేస్తాను’ అని తెలిపింది అనుపమ పరమేశ్వరన్. అంతే కాకుండా తనకు ఫోటోషూట్స్ అంటే చాలా భయమని బయటపెట్టింది. పది పేజీల డైలాగ్ చెప్పమన్నా చెప్తాను కానీ ఫోటోషూట్స్, ఇంటర్వ్యూలు అంటేనే స్ట్రేస్ ఫీలవుతానని చెప్పింది. తనకు అయిదు భాషలు వచ్చని చెప్పి ఆశ్చర్యపరిచింది.
సినిమాటిక్‌గా కావాలి
‘మలయాళ సినిమాల్లో మొహం మీద మొటిమలు ఉన్నా.. జుట్టు సరిగా లేకపోయినా.. చాలా బాగుంది చేసేద్దాం అంటారు. వాళ్లకు అలాగే నచ్చుతుంది. కానీ తెలుగు సినిమాలో అలా కాదు. వాళ్లకు అన్నీ సినిమాటిక్‌గా కావాలి. జీవితాన్ని జీవితంగా చూడడంలో జీవితాన్ని కలలాగా చూడడంలో వ్యత్యాసం అంటే ఇదేనేమో’ అంటూ మాలీవుడ్, టాలీవుడ్‌ను పోలుస్తూ మాట్లాడింది అనుపమ. తను చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌ను తక్కువ చేసి మాట్లాడినట్టుగా ఉన్నాయని చాలామంది ప్రేక్షకులు ఫీలవుతున్నారు. హీరోయిన్స్ ఎలా ఉన్నా పర్ఫార్మెన్స్‌ను బట్టే తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారని కొందరు ఆడియన్స్ వాదిస్తున్నారు.